Krishna Mukunda Murari May 12th Episode: మురారి బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న భవానీ - కృష్ణ ప్లాన్ సక్సెస్
Krishna Mukunda Murari May 12th Episode: మురారి పుట్టినరోజు వేడుకల్లో భవానీ పాల్గొంటుంది. కృష్ణతో పాటు మురారితో మాట్లాడుతుంది.కృష్ణ, మురారి విషయంలో తాను పెట్టిన రూల్స్‌ను తొలగిస్తుంది. ఆ తర్వాత నేటి కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.....
Krishna Mukunda Murari May 12th Episode: మురారి బర్త్ డే కోసం అన్ని ఏర్పాట్లు తానే దగ్గరుండి ఒంటరిగా చేస్తుంది కృష్ణ. ఇంట్లో ఒక్కరు కూడా ఆమెకు హెల్ప్ చేయరు. కృష్ణకు సాయం చేయాలని రేవతికి ఉన్నా అక్క భవానీకి భయపడి దూరంగా ఉంటుంది. పెద్దమ్మ తనను విష్ చేయకపోవడంతో కేక్ కట్ చేయాలని లేదని మురారి అంటాడు.
కానీ పెద్దత్తయ్య తప్పకుండా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటుందని కృష్ణ అతడితో చెబుతుంది. ఆమెకు కోడలుపైనే కోపం కొడుకంటే ప్రాణం అని మురారితో అంటుంది. ఈ ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటోండగా అక్కడికి ముందుకు వస్తుంది. మురారికి బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతుంది.
తాను వెళ్లి భవానీని కేక్ కటింగ్ లో పాల్గొనడానికి పిలుస్తానని రేవతి అంటుంది. మురారి వద్దన్నా వినకుండా కొడుకు కోసం అక్కతో తిట్లు తినడానికి సిద్ధమవుతుంది.కానీ ఎవరూ పిలవకుండా భవానీ అక్కడికి రావడం చూసి మురారి, కృష్ణ సంతోషపడతారు.
యశోద కృష్ట ఫొటో...
మురారి పుట్టినరోజు వేడుకల్లో భవానీ పాల్గొనేలా కృష్ణనే చేస్తుంది. మురారి తనకు దూరమవుతోన్నాడనే భాదలో ఒంటరిలో రూమ్‌లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూంటుంది భవానీ. ఆమె గదిలో యశోద, కృష్ణుల ఫొటోను తీసుకెళ్లి పెడుతుంది కృష్ణ. మీరు పెంచిన బాలకృష్ణుడు ఇప్పుడు కేక్ కట్ చేయబోతున్నాడు. మీరు రాకపోతే చిన్నబుచ్చుకుంటాడు.
అలకలు అపార్థాలు వదిలేసి మీరు వస్తే మురారి చాలా సంతోషపడతాడు. కృష్ణుడి పుట్టినరోజుకు యశోద రాకుండా ఉంటుందా అంటూ భవానీలో మురారి పట్ల ఉన్న ప్రేమను తట్టిలేపుతుంది కృష్ణ. ఆమె మాటలతో మురారి తనపై చూపించిన ప్రేమను గుర్తుకుతెచ్చుకుంటుంది భవానీ. ఆ సంఘటనలను అన్నీ తలచుకొని ఎమోషనల్ అవుతుంది.
కృష్ణకు థాంక్స్ చెప్పిన మురారి....
కృష్ణ కారణంగానే పుట్టినరోజు వేడుకల్లో భవానీ పాల్గొనడంతో మురారి సంతోషపడతాడు. కృష్ణకు థాంక్స్ చెబుతాడు. మురారిని ఆశీర్వదించడమే కాకుండా అతడికి ఫ్లవర్ బొకేను గిఫ్ట్‌గా ఇస్తుంది భవానీ.
ఫ్లవర్ బొకే కాకుండా గిఫ్ట్ ఏం లేదా అని కృష్ణ అనగా నేను మీ అందరితో మాట్లాడుతున్నాను అదే గిఫ్ట్. మీరు కూడా ఇంట్లో అందరితో మాట్లడవచ్చు. నేను పెట్టిన నిబంధనలను ఈ రోజు నుంచి తుడిచేశాను అని అనడంతో మురారి సంతోషపడతాడు.ఆమె మాటలతో కృష్ణ కూడా ఆనందపడుతుంది. నిజంగా పెద్ద వరమే ఇచ్చారంటుంది.
మురారికి కృష్ణ గిఫ్ట్...
భవానీ సమక్షంలో మురారి కేక్ కట్ చేస్తాడు. పెద్దమ్మకే ఫస్ట్ కేక్ తినిపిస్తాడు. కేక్ కట్ చేసే సమయంలో కృష్ణ, మురారి కలివిడితనం చూసి ముకుంద అసూయపడుతుంది. ఆ తర్వాత మురారికి కృష్ణ గిఫ్ట్ ఇస్తుంది.
ఆ గిఫ్ట్ ఒంటరిగా ఓపెన్ చేయాలని అంటుంది. అందరం కలిసి గుడికి వెళ్లాలని అనుకుంటారు. అక్కడే మురారి కోసం కొన్న రింగ్ అతడి వేలికి తొడలాని ముకుందు అనుకుంటుంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి నేటి ఎపిసోడ్ ముగిసింది.