Krishna Mukunda Murari Today Episode: కృష్ణకు త‌న మ‌న‌సులో మాట‌ను మురారి చెప్పాడా? - ముకుంద టెన్ష‌న్‌కు కార‌ణం ఏంటి?-krishna mukunda murari june 3rd episode revathi doubts on murari suspicious behaviour ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari June 3rd Episode Revathi Doubts On Murari Suspicious Behaviour

Krishna Mukunda Murari Today Episode: కృష్ణకు త‌న మ‌న‌సులో మాట‌ను మురారి చెప్పాడా? - ముకుంద టెన్ష‌న్‌కు కార‌ణం ఏంటి?

HT Telugu Desk HT Telugu
Jun 03, 2023 09:21 AM IST

Krishna Mukunda Murari Today Episode: కృష్ణ‌కు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేయాల‌ని అనుకుంటాడు మురారి. ఆమె మ‌న‌సులో ఏముందో తెలుసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. మురారి కోరిక తీరిందా? నేటి కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే...

కృష్ణ ముకుంద మురారి
కృష్ణ ముకుంద మురారి

Krishna Mukunda Murari Today Episode: అగ్రిమెంట్ గ‌డువు ముగిసిపోతే కృష్ణ త‌న‌ను వ‌దిలివెళ్లిపెట్టి వెళ్లిపోవాల్సివ‌స్తుంద‌ని మురారి భ‌య‌ప‌డిపోతుంటాడు. మ‌రోవైపు మురారి మ‌న‌సులో మ‌రో అమ్మాయి ఉంద‌నే నిజం తెలియ‌క తొంద‌ర‌ప‌డి అత‌డిని ప్రేమించినందుకు కృష్ణ కూడా త‌ల్ల‌డిల్లిపోతుంది. ఇద్ద‌రికి ఒక‌రిపై మ‌రొక‌రికి ప్రేమ ఉన్న ఎవ‌రూ బ‌య‌ట‌ప‌డ‌కుండా ఎంతో సంఘ‌ర్ష‌ణ‌కు లోన‌వుతుంటారు.

మురారి లేని త‌న జీవితాన్ని త‌ల్చుకుంటూ కృష్ణ క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. నేను పోగోట్టుకున్న జీవితం నాకు కావాలి. మురారి త‌న‌కు ద‌క్కాల‌ని ముకుంద త‌న‌తో అన్న మాట‌ల గురించి ప‌దే ప‌దే ఆలోచిస్తుంటుంది రేవ‌తి. కొడుకు కాపురం నిల‌బెట్టాలా? ముకుంద‌కు న్యాయం చేయాలా? అర్థం కానీ స్థితిలో ఉండిపోతుంది. ఇంత‌లోనే మురారి ఆమెకు ఎదురుప‌డ‌తాడు. అత‌డివైపు కోపంగా చూస్తుంది రేవ‌తి. త‌ల్లికి ముకుంద నిజం చెప్పిసింద‌నే భ‌యంతో ఆమెతో ఏం మాట్లాడ‌కుండా అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు మురారి.

కృష్ణ మ‌న‌సులో ఏముందో...

కృష్ణ‌ను రెస్టారెంట్‌కు తీసుకెళ్లి అక్క‌డే త‌న మ‌న‌సులో ఉన్న మాటను ఆమెతో చెప్పాల‌ని మురారి నిర్ణ‌యించుకుంటాడు. కృష్ణ మ‌న‌సులో కూడా ఏముందో క‌నుక్కోవాల‌ని అనుకుంటాడు. త‌మ అగ్రిమెంట్ పీరియ‌డ్ ఏడాది కాకుండా జీవితాంతం పొగిడించాల‌ని కోరుకుంటాడు. కృష్ణ ద‌గ్గ‌ర‌కు వెళ్లి అదే మాట చెబుతాడు.

రెస్టారెంట్‌కు ఎందుకు త‌న‌తో ఏదైనా మాట్లాడాల‌ని అనుకుంటున్నారా అని మురారిని అడుగుతుంది కృష్ణ‌. అవును అని అత‌డు స‌మాధానం చెబుతాడు. తాను ప్రేమించిన అమ్మాయి గురించి చెప్ప‌డానికే మురాని త‌న‌ను రెస్టారెంట్‌కు తీసుకెళుతున్నాడ‌ని కృష్ణ అపోహ‌ప‌డుతుంది. మురారి డ‌ల్ అవుతాడు. అత‌డిని త‌న తింగ‌రిత‌నంతో న‌వ్విస్తుంది కృష్ణ‌. ఈ న‌వ్వులు శాశ్వ‌తం కావాల‌ని మురారి కోరుకుంటాడు.

మురారి టెన్ష‌న్‌...

రెస్టారెంట్‌కు వెళ్ల‌డానికి త‌న‌కో మంచి డ్రెస్‌ను సెలెక్ట్ చేయ‌మ‌ని కృష్ణ‌ను కోర‌తాడు మురారి. కానీ అదే రాక్‌లో త‌న డైరీ ఉండ‌టంతో అది ఎక్క‌డ కృష్ణ కంట‌ప‌డుతుందో అని భ‌య‌ప‌డ‌తాడు. త‌న‌ డ్రెస్‌ను తానే సెలెక్ట్ చేసుకుంటాన‌ని మాట మారుస్తాడు. కానీ కృష్ణ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌దు.

డ్రెస్‌ను తానే సెలెక్ట్ చేస్తాన‌ని ప‌ట్టుప‌డుతుంది. డైరీ విష‌యంలోనే కంగారు ప‌డుతున్నాడ‌ని కృష్ణ గ్ర‌హిస్తుంది కానీ తాను డైరీ చ‌దివిన విష‌యాన్ని దాచిపెడుతుంది. మురారితో క‌లిసి తాను బ‌య‌ట‌కు వెళ్తున్న‌ట్లు రేవ‌తితో చెబుతుంది కృష్ణ‌. మురారి మాత్రం ఏ మాట్ల‌డ‌డు. ఏదో త‌ప్పు చేసిన వాడిలా త‌న నుంచి మురారి త‌ప్పించుకోవ‌డంతో రేవ‌తి ఆశ్చ‌ర్య‌పోతుంది.

ముకుంద భ‌యం...

ప్రేమించిన వాడిని ఎదురుగా పెట్టుకొని అదే ఇంట్లో ఉండ‌టం త‌న వ‌ల్ల కావ‌డం లేద‌ని స్నేహితురాలితో త‌న బాధ‌ను పంచుకుంటుంది ముకుంద‌. కృష్ణపై మురారి చూపిస్తున్న ప్రేమ‌ను చూస్తుంటే భ‌య‌మేస్తుంద‌ని అంటుంది. ఇద్ద‌రికి ఒక‌రిపై మ‌రొక‌రికి ప్రేమ పెరిగితే త‌న ప‌రిస్థితి ఏమ‌వుతుందోన‌ని టెన్ష‌న్ ప‌డుతుంటుంది.

అందుకే మురారిని తాను ప్రేమించిన విష‌యాన్ని అత‌డి త‌ల్లితో చెప్పిన‌ట్లు ఫ్రెండ్‌తో అంటుంది ముకుంద‌. కృష్ణ వెళ్లిపోగానే మురారితో త‌న పెళ్లికి త‌ప్ప‌కుండా రేవ‌తి ఒప్పుకుంటుంద‌ని అనుకుంటుంది. ముకుంద ప్లాన్ బాగుంద‌ని ఆమె స్నేహితురాలు మెచ్చుకుంటుంది.

ఒకే రెస్టారెంట్‌లో...

కృష్ణ మురారిల‌తో బ్రేక‌ప్ రీల్ ప్లాన్ చేస్తాడు మ‌ధుక‌ర్‌. స్క్రిప్ట్ రెడీ చేసి ఇద్ద‌రిని ఒప్పించాల‌ని అనుకుంటాడు. మురారి, కృష్ణ వెళ్లిన రెస్టారెంట్‌లోనే వారికి ముకుంద క‌నిపిస్తుంది. ముకుంద‌ను అక్క‌డ చూసి మురారి షాక్ అవుతాడు. ఆమెకు దూరంగా కృష్ణ మురారి కూర్చుంటారు. మురారి, కృష్ణల‌ క్లోజ్‌నెస్ చూసి వారిద్ద‌రు ప్రేమ‌లో ప‌డ‌టం ఖాయ‌మ‌ని స్నేహితురాలు ముకుంద‌ను బెదిరిస్తుంది. అక్క‌డితో నేటి కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్ ముగిసింది. మురారి, కృష్ణ అగ్రిమెంట్ మ్యారేజీ చేసుకున్నార‌నే నిజం రేవ‌తితో ముకుంద చెబుతుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌ది సోమ‌వారం ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

IPL_Entry_Point