Krishna Mukunda Murari June 2nd Episode: ముకుంద వల్ల రేవతి ముందు దోషిగా మారిన మురారి - ఏసీపీ సార్‌కు డ‌బుల్ షాక్‌-krishna mukunda murari june 2nd episode krishna mukunda murari today episode mukunda shocks to murari ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari June 2nd Episode Krishna Mukunda Murari Today Episode Mukunda Shocks To Murari

Krishna Mukunda Murari June 2nd Episode: ముకుంద వల్ల రేవతి ముందు దోషిగా మారిన మురారి - ఏసీపీ సార్‌కు డ‌బుల్ షాక్‌

HT Telugu Desk HT Telugu
Jun 02, 2023 09:24 AM IST

Krishna Mukunda Murari June 2nd Episode: మ్యారేజ్ అగ్రిమెంట్ ముగిసి కృష్ణ త‌న‌కు ఎక్క‌డ దూరం అవుతుందో అని మురారి బాధ‌ప‌డుతోంటాడు. కృష్ణ‌ను ప్రేమిస్తోన్న విష‌యాన్ని ఆమెకు చెప్ప‌లేక‌, ఆమె మ‌న‌సులో ఏముందో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతుంటాడు. ఆ త‌ర్వాత నేటి కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే...

కృష్ణ ముకుంద మురారి
కృష్ణ ముకుంద మురారి

Krishna Mukunda Murari June 2nd Episode: మురారి, కృష్ణ ఆఫీస్‌కు వెళ్తోన్న స‌మ‌యంలో ఓ జంట గొడ‌వ‌ప‌డుతూ వారికి క‌నిపిస్తారు. ఆ జంట‌ను క‌లిపే విష‌యంలో త‌మ మ‌ధ్య జ‌రుగుతోన్న సంఘ‌ర్ష‌ణ‌ను బ‌య‌ట‌పెడ‌తారు కృష్ణ, మురారి. ప్రేమించ‌డం త‌ప్పు కాద‌ని, కానీ ఆ ప్రేమ‌ను ముందే చెప్ప‌క‌పోవ‌డం త‌ప్పు అంటూ ఆ జంట‌కు స‌ల‌హా ఇస్తుంది కృష్ణ‌. మ‌న‌సులో ఒక‌సారి ప్రేమ ప‌డుతే అది పుట్టుమ‌చ్చ‌లా శాశ్వ‌తంగా ఉండిపోతుంది. ప్రేమించిన వాళ్లు దూర‌మైనా, వారు మాత్రం మ‌న‌సులోనే శాశ్వ‌తంగా ఉండిపోతార‌ని మురారి అంటాడు.

కృష్ణ‌ను ఉద్దేశించి అత‌డు ఆ మాట చెబుతాడు. కానీ కృష్ణ మాత్రం డైరీలో పేర్కొన్న త‌న ప్రియురాలి గురించే ఆ మాట చెప్పాల‌ని అపోహ‌ప‌డుతుంది. ఆ జంట లాగే తాము విడిపోయే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ఇద్ద‌రు భ‌య‌ప‌డుతుంటారు. భార్య‌ను ఏడిపించ‌బోయి మ‌రోసారి ఆమె చేతిలో దెబ్బ‌లు తిన‌బోతాడు మ‌ధుక‌ర్‌. చివ‌రి కాంప్ర‌మైజ్ అవుతాడు.

మురారి కోసం ఎదురుచూసిన ముకుంద‌...

మురారి ఆఫీస్ నుంచి తిరిగి రాగానే అత‌డి కోసం ఇంటి బ‌య‌ట ముకుంద ఎదురుచూస్తు క‌నిపిస్తుంది. నీ కోస‌మే వెయిట్ చేస్తున్నాన‌ని మురారిని ఇంట్లోకి వెళ్ల‌కుండా ఆపుతుంది ముకుంద‌. పెళ్ల‌యినా స్త్రీ భ‌ర్త కోస‌మే ఎదురుచూడాల‌ని మురారి ఆమెతో ఉంటాడు. నాకు మాన‌సికంగా ఎప్పుడో నీతో పెళ్ల‌యింద‌ని అత‌డికి స‌మాధ‌న‌మిస్తుంది ముకుంద‌. ఆమె ఆన్స‌ర్‌కు మురారి చిరాకు ప‌డ‌తాడు. నాకో భార్య‌ ఉంద‌ని ముకుంద‌తో స‌మాధానం చెబుతాడు. అది నాకు తెలుసు అని ముకుంద అత‌డితో అంటుంది. అది తెలిసి నాకోసం ఎదురుచూడ‌టంలో అర్థం లేద‌ని అంటాడు మురారి.

మురారికి షాక్‌...

మ‌న ప్రేమ గురించి రేవ‌తి అత్త‌య్య‌కు తెలిసిపోయింద‌ని మురారిని భ‌య‌పెడుతుంది ముకుంద‌. ఆమె మాట‌ల‌కు మురారి షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు మా అమ్మ‌కు ఎలా తెలుస్తుంద‌ని ముకుంద‌తో అంటాడు మురారి. ఎవ‌రో ఒక‌రు చెబితినే తెలుస్తుంది. ఆ ఒక‌రు నేను అని చెప్పి మురారికి షాకుల మీద షాకిస్తుంది.

అవిడ‌కు మన ప్రేమ విష‌యం ముందే తెలుసున‌ని, నిజ‌మేనా అని అడిగితే అవున‌ని చెప్పాన‌ని ముకుంద అంటుంది. ఈ నిజం చెప్ప‌డం వ‌ల్ల నీకు ఒరిగేది ఏది లేద‌ని మురారి ఆమెకు స‌మాధాన‌మిస్తాడు. ఆవిడ‌కు తెలిసిన నిజాన్ని నిజం అని చెప్ప‌డం వ‌ల్ల కొంప‌లు మునిగిపోయేది ఏది ఉండ‌ద‌నే నిజం చెప్పాన‌ని ముకుంద అంటుంది. ఈ ఇంట్లో నీకు ఎప్పుడూ విలువ ఉంటుంద‌ని, నాకే విలువ లేకుండా పోతుంద‌ని, అందుకే జ‌రిగిన దాంట్లో త‌న త‌ప్పు లేద‌ని రేవ‌తితో చెప్పాన‌ని అంటుంది ముకుంద‌.

కృష్ణ వెళ్లిపోతే…

కృష్ణ‌తో త‌న అగ్రిమెంట్ మ్యారేజీ గురించి కూడా అమ్మ‌తో చెప్పావా అని ముకుంద‌ను ప్ర‌శ్నిస్తాడు మురారి. అది త‌న జాబ్ కాదంటూ ముకుంద అంటుంది. నా ప్రేమ‌ను ద‌క్కించుకోవ‌డానికే ఇక్క‌డ ఉన్నాన‌ని, కృష్ణ వెళ్లిపోయిన త‌ర్వాత మ‌న క‌లుస్తామ‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని మురారితో అంటుంది ముకుంద‌. కృష్ణ వెళ్లిపోతుంద‌ని ప‌దే ప‌దే అన‌కు అంటూ ఆమెపై చిరాకు ప‌డ‌తాడు మురారి.

విన‌డానికి క‌ష్టంగా ఉంటుంద‌ని అంటాడు. విన‌డానికి క‌ష్ట‌మైన‌వివింటున్నాను. చూడ‌టానికి క‌ష్ట‌మైన‌వి చూస్తున్నాన‌ని ముకుంద ఎమోష‌న్ అవుతుంది. ఇప్ప‌టికీ ఇంట్లో పెట్టిన చిచ్చు చాలు. ఇంకా నువ్వు అన‌డానికి రెడీగా ఉన్నా విన‌డానికి నేను లేన‌ని, న‌న్ను ఇలా బ‌త‌క‌నివ్వ‌మ‌ని ముకుంద‌కు దండ పెట్టి అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు మురారి. మ‌ధుక‌ర్ త‌న తండ్రి ప్ర‌సాద్‌ను డ‌బ్బులు అడుగుతాడు. కానీ అత‌డు మాత్రం ఇవ్వ‌న‌ని అంటాడు.

రేవతి పరధ్యానం…

ముకుంద త‌న‌తో అన్న మాట‌ల గురించి ఆలోచిస్తుంటాడు మురారి. మ‌రోవైపు కృష్ణ మ‌న‌సులో ఏముందో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతుంటాడు. కృష్ణ త‌న నుంచి దూరంగా వెళ్లిపోతుంద‌నే ఊహ‌ను భ‌రించ‌లేక‌పోతుంది. రేవ‌తి కూడా ముకుంద జీవితం గురించే ఆలోచిస్తుంటుంది. కృష్ణ వ‌చ్చి పిల‌వ‌డంతో ఒక్క‌సారిగా ఆలోచ‌న‌ల నుంచి బ‌య‌ట‌ప‌డుతుంది.

అలాగే ఇన్నాళ్లు మురారి మ‌న‌సులో తానే ఉన్నాన‌నుకొని భ్ర‌మ‌ప‌డ్డాన‌ని, షూటింగ్‌ను అడ్డం పెట్టుకొని మ‌న‌సులో ఉన్న మాట‌ను అత‌డికి చెప్పి తొంద‌ర ప‌డ్డాన‌ని కృష్ణ కూడా బాధ‌ప‌డిపోతుంది. మురారికి ఎదురుప‌డ‌టానికి ఆమెకు ధైర్యం స‌రిపోదు. మురారి ప‌ల‌క‌రించ‌గానే మామూలుగా మారిపోతుంది.

కృష్ణ‌తో క‌లిసి రెస్టారెంట్‌కు వెళ్లాల‌ని అనుకుంటాడు మురారి. త‌న కోసం రాక్‌లో ఉన్న మంచి డ్రెస్ సెలెక్ట్ చేయ‌మ‌ని అంటాడు. ఆ డ్రెస్‌ల‌లోనే ముకుంద గురించి రాసిన డైరీ ఉంటుంది. ఆ డైరీ కృష్ణ కంట ఎక్క‌డ ప‌డుతుందో అని భ‌య‌ప‌డ‌తాడు. అక్క‌డితో నేటి కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్ ముగిసింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.