Krishna mukunda murari december 8th: కృష్ణ భర్త గురించి మురారీ ఆరా.. ముకుంద మీద అనుమానం, భవానీ ప్లాన్ తెలిసి రేవతి షాక్-krishna mukunda murari december 8th episode nandu informs revathi about bhavani plan against krishna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari December 8th Episode Nandu Informs Revathi About Bhavani Plan Against Krishna

Krishna mukunda murari december 8th: కృష్ణ భర్త గురించి మురారీ ఆరా.. ముకుంద మీద అనుమానం, భవానీ ప్లాన్ తెలిసి రేవతి షాక్

Gunti Soundarya HT Telugu
Dec 08, 2023 07:55 PM IST

krishna mukunda murari december 8th episode: కృష్ణకి పెళ్లి అయిపోయిందని భవానీ మురారీకి చెప్పడంతో షాక్ అవుతాడు. వేణి భర్త ఎవరో తెలుసుకోవాలని ఎంక్వైరీ మొదలుపెడతాడు.

వేణి భర్త గురించి ముకుందని అడిగిన మురారీ
వేణి భర్త గురించి ముకుందని అడిగిన మురారీ (disney plus hotstar )

కృష్ణకి పెళ్లి అయిపోయిందని చెప్పడంతో మురారీ బాధపడతాడు. అటు మురారీకి ఎక్కడ గతం గుర్తుకు వస్తుందోనని ముకుంద టెన్షన్ పడుతుంది. దేవుడి ముందు నిలబడి తన గోడు వెళ్లబోసుకుంటుంది.

ట్రెండింగ్ వార్తలు

మురారీకి గతం గుర్తు రాకూడదు

మురారీతో నా జీవితం పంచుకోవాలని అనుకున్నాను. కృష్ణని పెళ్లి చేసుకుని వచ్చిన దగ్గర నుంచి మురారీ గతం మర్చిపోయేంత వరకు ఎంత మానసిక సంఘర్షణ అనుభవించానో నీకు బాగా తెలుసు. నా బాధ చూసి కనికరించి మురారీని నాకిచ్చి పెళ్లి చేయబోతున్నావ్. పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఎలాంటి విఘ్నాలు కలగకుండా పెళ్లి జరిపించు. జీవితంలో మురారీకి గతం గుర్తుకు రాకూడదు. తనకి గతం గుర్తుకు వస్తే నా నుంచి దూరం అయిపోతాడు. ఆ విషయం తలుచుకుంటేనే తట్టుకోలేకపోతున్నా. ఇంకోసారి మురారీ దూరం అయితే నేను చచ్చిపోతాను. మురారీ నావాడు అయ్యేంత వరకు ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడమని ముకుంద దేవుడిని వేడుకుంటుంది.

అక్కడికి వచ్చిన సుమలత ముకుందని పలకరిస్తుంది. నచ్చిన మురారీని పెళ్లి చేసుకుంటున్నావ్ కదా ఇంత డల్ గా ఎందుకు ఉన్నావని అడుగుతుంది. రెచ్చ గొట్టాలని అలా మాట్లాడుతున్నావా చిన్నత్తయ్య అని ముకుంద అంటుంది. అదేం లేదు మా భవానీ అక్క నీకు తోడుగా ఉంది కదా. ఇక ఆ దేవుడు తప్ప ఇంకెవరూ పెళ్ళిని ఆపలేరని ధైర్యం చెప్తుంది. మురారీని తాను ప్రేమించినట్టుగా ఎవరూ ప్రేమించలేదని ముకుంద తనని తాను సమర్థించుకుంటుంది.

వేణి భర్త గురించి మురారీ ఆరా

మురారీ కృష్ణతో సన్నిహితంగా ఉన్న క్షణాలన్నీ ఆలోచించుకుంటాడు. వేణి గారి భర్త ఎవరో తెలుసుకోవాలని అనుకుంటాడు. పెళ్లి అయితే భర్త దగ్గర ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటూ ఉండగా గౌతమ్ వచ్చి పలకరిస్తాడు. మురారీ వేణి భర్త ఎవరో గౌతమ్ ని అడిగి తెలుసుకోవాలని ట్రై చేస్తాడు కానీ అడగకుండా మౌనంగా ఉండిపోతాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మధుకర్ వస్తాడు. వేణి భర్త ఎవరో మధుకి ఖచ్చితంగా తెలుస్తుందని అనుకుంటాడు.

కృష్ణ కంగారుగా మురారీతో కలిసి ఉన్న ఫోటోస్ కోసం వెతుకుతుంది కానీ కనిపించవు. రేవతి కూడా కృష్ణ గురించి ఆలోచిస్తుంది. కృష్ణ నమ్మకం ఏంటి? ఈ సమయంలో ఎవరైనా గొడవ చేస్తారు కానీ కృష్ణ మాత్రం మొగుడికి పెళ్లి జరుగుతుంటే పసుపు దంచడానికి వచ్చిందని ఆలోచిస్తూ ఉండగా నందిని వస్తుంది. కృష్ణ ఎలాగైనా పెళ్లి ఆపేస్తుందని రేవతి ధీమాగా అంటుంది. కానీ నందిని మాత్రం భవానీ వేసిన ప్లాన్ గురించి చెప్తుంది.

భవానీ ప్లాన్ తెలుసుకున్న రేవతి

ఇందాక మురారీ మీద అమ్మ తన బ్రహ్మాస్త్రం వదిలింది. అది మీకు అర్థం కాలేదా పిన్నీ. కృష్ణకి పెళ్లి అయిందని చెప్పేసింది. మురారీ గతం మర్చిపోయాడు కానీ సంస్కారం మర్చిపోలేదు. ఇప్పటి వరకు కృష్ణతో చనువుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు పెళ్లి అయ్యిందని తెలిసి కృష్ణకి దూరంగా ఉంటాడు ముకుందకి దగ్గర అవుతాడు. ఇదే అమ్మ రాజకీయమని నందిని చెప్తుంది. ఆ మాటకి రేవతి మరింత టెన్షన్ పడుతుంది. మురారీకి గతం గుర్తుకు రావడం తప్ప ఈ సమస్య నుంచి బయట పడేందుకు మరొక మార్గం లేదని అనుకుంటారు.

మధుకర్ కి ముకుంద వార్నింగ్

మధుకర్ మురారీతో కలిసి టీ తాగేందుకు బయటకి వస్తాడు. ఇదే కరెక్ట్ టైమ్ అనుకుని మురారీ వేణి గురించి అడుగుతాడు. నిజం చెప్పేయాలని ఇదే సరైన టైమ్ అని మధుకర్ డిసైడ్ అవుతాడు. వేణి భర్తని ఎప్పుడైనా చూశావా? అతను ఏం చేస్తూ ఉంటాడని మురారీ అడుగుతాడు. చూశానని మధు చెప్పేసరికి మురారీ షాక్ అవుతాడు.

మధుకి అప్పుడే ముకుంద వీడియో కాల్ చేసి ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. మురారీకి ఏదో చెప్పాలని తెగ ఆరాటపడుతున్నావ్. నోరు మూసుకుని తిన్నగా ఇంటికి రమ్మని వార్నింగ్ ఇస్తుంది. తన మాట వినకపోతే పెద్ద పెద్దమ్మకి చెప్తానని బెదిరిస్తుంది. దీంతో మధుకర్ మురారీ దగ్గరకి వెళ్ళి అర్జెంట్ గా ఇంటికి వెళ్లాలని చెప్తాడు. వేణి భర్త గురించి చెప్పకుండా మధు టాపిక్ డైవర్ట్ చేయడంతో మురారీకి డౌట్ వస్తుంది.

తనకి అన్యాయం చేయొద్దన్న ముకుంద

ఇంటి దగ్గర ముకుంద మురారీ వాళ్ళ కోసం టెన్షన్ గా ఎదురుచూస్తుంది. అప్పుడే మధుకర్ వాళ్ళు ఇంటికి వస్తారు. పెళ్లి కళ అసలు కనిపించడం లేదేంటని ముకుంద అడుగుతుంది. మురారీ రివర్స్ లో నీకు మాత్రం ఉందా? మొహంలో టెన్షన్ తప్ప ఇంకేం కనిపించడం లేదని అంటాడు. గతంలో ముకుంద ప్రేమలో ఉన్నావని భవానీ చెప్పిన మాటలు గురించి మురారీ ఆలోచిస్తాడు. తన పక్కన ఉన్నప్పుడు ప్రేమ అనే ఫీలింగ్ కలగడం లేదు ఎందుకని మనసులో మాట్లాడుకుంటాడు. నేనంటే నీకు ఇష్టం కదా ఒకటి అడుగుతాను.. అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాలని అంటాడు. ఏం అడుగుతాడోనని ముకుంద టెన్షన్ పడుతుంది.

ముకుంద మీద అనుమానపడుతున్న మురారీ

వేణి గారికి పెళ్లి అయ్యిందని చెప్పారు కదా ఆయన భర్త ఎక్కడ ఉంటాడని అడుగుతాడు. కోపంగా నాకు తెలియదు.. తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పెళ్లి గురించి ఆలోచించు. నీమీద ఆశలు పెట్టుకుని బతుకుతున్న నాకు అన్యాయం చేయకని చెప్పేసి ముకుంద వెళ్ళిపోతుంది. మురారీ గదిలోకి వెళ్ళిన తర్వాత కూడా వేణి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మధుని అడిగితే తెలుసని అన్నాడు, ముకుందని అడిగితే ఇరిటేట్ అయ్యింది. ముకుంద కాల్ కి వేణి గారి భర్తకి ఏదో లింకు ఉందని అనుమానిస్తాడు. సరిగ్గా అప్పుడే మధు అటుగా వెళ్తుంటే పిలిచి మళ్ళీ వేణి గారి భర్త ఎవరని అడుగుతాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.