Krishna Mukunda Murari Today Episode: త‌న భ‌ర్త ఎవ‌రో చెప్పిన కృష్ణ - నిజాన్ని న‌మ్మ‌ని మురారి - భ‌వానీ సూప‌ర్‌ స్కెచ్-krishna mukunda murari december 8th episode krishna reveals truth with murari ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari December 8th Episode Krishna Reveals Truth With Murari

Krishna Mukunda Murari Today Episode: త‌న భ‌ర్త ఎవ‌రో చెప్పిన కృష్ణ - నిజాన్ని న‌మ్మ‌ని మురారి - భ‌వానీ సూప‌ర్‌ స్కెచ్

Nelki Naresh Kumar HT Telugu
Dec 08, 2023 11:45 AM IST

Krishna Mukunda Murari Today Episode: పెళ్లి ప‌నుల పేరుతో మురారికి గ‌తం గుర్తుచేయాల‌ని అనుకున్న కృష్ణ ప్లాన్ వ‌ర్క‌వుట్ కావ‌డంతో ముకుంద భ‌య‌ప‌డుతుంది. భ‌వానీ ద్వారా ఆమె ప్లాన్‌కు చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. ఆ త‌ర్వాత నేటి కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?

కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌
కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌

Krishna Mukunda Murari Today Episode: ముకుంద‌, మురారిల పెళ్లి ప‌నుల‌న్నింటిని తానే ద‌గ్గ‌రుండి చేస్తుంది కృష్ణ‌. పెళ్లి ప‌నుల పేరుతో మురారికి మ‌రింత ద‌గ్గ‌ర‌వుతుంది. మ‌ధుక‌ర్‌తో రీల్స్ చేస్తుంది కృష్ణ. ఆ రీల్స్ ద్వారా మురారికి కొద్ది కొద్దిగా గ‌తం గుర్తుకువ‌స్తుంది. అది చూసి కృష్ణ‌, రేవ‌తి ఆనంద‌ప‌డ‌తారు. మురారికి గ‌తం గుర్తుచేసి ముకుంద‌తో అత‌డి పెళ్లిని ఎలాగైనా ఆపాల‌ని వాళ్లు అనుకుంటారు.

ట్రెండింగ్ వార్తలు

ముకుంద భయం…

మురారికి గ‌తం గుర్తొస్తే త‌న భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందోన‌ని ముకుంద టెన్ష‌న్ ప‌డుతుంది. త‌న బాధ‌ను భ‌వానీతో పంచుకుంటుంది. గ‌తం గుర్తుకురాక‌ముందే కృష్ణ చుట్టూ తిరుగుతోన్న మురారి గ‌తం గుర్తొస్తే త‌న‌ను వ‌దిలిపెట్టి వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటుంది. ముకుంద మాయ మాట‌ల‌కు భ‌వానీ క‌రిగిపోతుంది. తాను ఉన్నాన‌ని ధైర్యం చెబుతుంది.

మురారికి గ‌తం గుర్తు చేయ‌డానికే కృష్ణ పెళ్లి ప‌నులు చేస్తోంద‌ని గ్ర‌హించిన భ‌వానీ ఆమెను పంపించేందుకు మాస్ట‌ర్ ప్లాన్ వేస్తుంది. భ‌వానీ ఎత్తుగ‌డ‌ను కృష్ణ ఊహించ‌లేక‌పోతుంది. భ‌వానీ ప‌న్నాగానికి కృష్ణ ఎలా బ‌లైంది? మురారికి దూరం కాకుండా ఉండేందుకు ఆమె ఏం చేసింది అన్న‌ది నేటి కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌లో చూడాల్సిందే.

కృష్ణ‌ నిజం చెప్పనుందా?

కృష్ణ‌కు పెళ్లైంద‌నే నిజాన్ని మురారి జీర్ణించుకోలేక‌పోతాడు. ఆమె భ‌ర్త ఎవ‌రు? పెళ్లైన కృష్ణ త‌న‌కు ఎందుకు ద‌గ్గ‌ర కావాల‌ని అనుకుంటుందో అంతుప‌ట్ట‌దు. కార్తిక పౌర్ణ‌మి సంద‌ర్భంగా కోనేటిలో దీపాలు వ‌ద‌ల‌డానికి వెళ్లాల‌ని అనుకున్న కృష్ణ అక్క‌డే మురారి త‌న భ‌ర్త అనే నిజాన్ని చెప్పాల‌ని ఫిక్స్ అవుతుంది. డైరెక్ట్‌గా మాట‌ల రూపంలో కాకుండా చేత‌ల ద్వారా త‌న మెడ‌లో మూడు ముళ్లు వేసింది మురారినే అని చూపించాల‌ని డిసైడ్ అవుతుంది.

ఆమెకు నందు, రేవ‌తితో పాటు మ‌ధుక‌ర్ కూడా స‌పోర్ట్ చేస్తారు. కృష్ణ చెప్పిన‌ట్లుగానే మురారి కోనేటి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడా? అత‌డికి కృష్ణ నిజం చెప్పిందా? ఆమెను త‌న భార్య‌గా మురారి అంగీక‌రించాడా? కృష్ణ ప్లాన్‌ను భ‌వానీ, ముకుంద అడ్డుకోవ‌డానికి ఏం చేశార‌న్న‌ది నేటి ఎపిసోడ్‌లో ఆస‌క్తిక‌రంగా మార‌నుంది.

ప్రభాకర్ ను కలిసిన మురారి…

కృష్ణ‌ను భ‌వానీ పెద్ద‌మ్మ చుల‌క‌న‌గా చూడ‌టం వెనుక ఏదో కుట్ర ఉంద‌ని మురారి అనుమాన‌ప‌డ‌తాడు. వీట‌న్నింటికి స‌మాధానం దొర‌క‌లాంటే జైలులో ఉన్న పెద్ద‌ప‌ల్లి ప్ర‌భాక‌ర్‌ను క‌ల‌వాల‌ని అనుకుంటాడు. భ‌వానీ, ముకుంద‌ల‌కు తెలిస్తే జైలుకు వెళ్లొద్ద‌ని అంటార‌ని ఊహించిన మురారి వారికి తెలియ‌కుండా ప్ర‌భాక‌ర్ క‌ల‌వాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ప్ర‌భాక‌ర్‌ను మురారి క‌లిశాడా? మురారికి ప్ర‌భాక‌ర్ చెప్పిన నిజాలేమిటి? ముకుంద నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డిందా? లేదా? అన్న‌ది నేటి కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.