Krishna mukunda murari december 20th: శ్రీనివాస్ కిడ్నాప్.. మురారి ముందుకొచ్చిన దేవ్, ముకుందపై కృష్ణ అనుమానం
Krishna mukunda murari december 20th: మురారికి నిజం చెప్పనివ్వకుండా శ్రీనివాస్ ని దేవ్ కిడ్నాప్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Krishna mukunda murari december 20th: మురారి డ్యూటీలో జాయిన్ అవుతానని అంటే కమిషనర్ కుదరదని చెప్తాడు. రెండు నెలలు కనిపించకుండా వేరే రూపంతో రావడం కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఉన్నతాధికారులతో మాట్లాడాలని అంటాడు. ఏసీపీ సర్ కి వేరే పెళ్లి చేయడానికి మా పెద్దత్తయ్య రెడీ అయిపోయింది. ఏదో ఒక రకంగా స్ట్రాంగ్ రీజన్ ఉంది కానీ అది మాకు ఇష్టం లేదని కృష్ణ చెప్తుంది. మీరు డ్యూటీలో జాయిన్ కాకపోయినా కేసు సాల్వ్ చేయడానికి పర్మిషన్ ఇస్తాడు కమిషనర్. తనకి సర్జరీ చేసిన వ్యక్తి పేరు శేఖర్. సర్జరీకి కావాల్సిన డబ్బులు ఇచ్చాడు. అతన్ని పట్టుకుంటే కేసు సాల్వ్ అవుతుందని మురారి చెప్తాడు.
ముకుందకి మధుకర్ సలహా
ఇవాల్టి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేయమని కమిషనర్ వాళ్ళకి చెప్తాడు. భవానీ దగ్గరకి ముకుంద వచ్చి తన మనసు అంతా టెన్సిన్ గా ఉందని అంటుంది. ఒకవేళ మురారి కేసు ఛేదిస్తే తన పరిస్థితి ఏంటని అడుగుతుంది. పాజిటివ్ గా ఆలోచించమని చెప్పి పంపించేస్తుంది. మధుకర్ ముకుందని ఆపి మాట్లాడతాడు.
నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం అయ్యింది. కృష్ణ చిన్నాన్న ఈ పని చేయలేదని నీకు తెలుసు కానీ పెద్ద పెద్దమ్మ అండగా ఉందని ఇలా చేశావ్. కానీ ఇప్పుడు మురారికి గతం గుర్తుకు వచ్చింది. నువ్వు ప్యాక్ కావడం తప్ప వేరే దారి లేదు. మురారి నిన్ను పెళ్లి చేసుకోడని అంటాడు. అత్తయ్య చెప్తే చేసుకుంటాడని ముకుంద అంటుంది. ఆత్మహత్య చేసుకోమంటే చేసుకుంటాడు కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోడు. ఊహల్లో బతకడం ఆపేయ్. నీ గౌరవం పెరుగుతుంది. డ్రాప్ అయిపో అనేసి చెప్తాడు.
సర్జరీ చేయించిన వ్యక్తి పేరు చెప్పిన మురారి
అప్పుడే కృష్ణ, మురారి ఇంటికి వస్తారు. మురారి గుడ్ న్యూస్ అని చెప్తాడు. పెద్దమ్మ నేను పరిమళ డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. నాకు సర్జరీ చేయించిన అతని పేరు చెప్పారు. తన డీటైల్స్ కూడా చెప్పారని చెప్పేసరికి ముకుంద భయపడుతుంది. ఎవరు అతను, అతని పేరు ఏంటని భవానీ అడుగుతుంది. శేఖర్ అని చెప్తాడు. అంటే దేవ్ పేరు మార్చాడు. దేవ్ శేఖర్ అని తెలియడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. ఈలోపు పెళ్లైపోతుంది. దేవ్ కూడా నాకు అదే చెప్పాడు కదా అని ముకుంద మనసులో అనుకుంటాడు.
శేఖర్ అనే వ్యక్తి మన ఫ్యామిలిలో ఎవరైనా ఉన్నారా? అని మురారి అడిగితే లేరని చెప్తాడు. అసలు ఆ శేఖర్ ఆన్ని లక్షలు ఖర్చు పెట్టి నీకు సర్జరీ చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని ప్రసాద్ అంటాడు. ఆ కోణంలో ఆలోచించమని సుమతల అంటుంది. టాపిక్ డైవర్ట్ చేయాలని ముకుంద డిసైడ్ అవుతుంది.
ముకుంద మీద అనుమానపడిన కృష్ణ
ఎవరికీ తెలియకుండా గుప్త దానాలు చేస్తారు కదా ఇది అలాంటిదే అయి ఉండవచ్చు కదా అంటుంది. ముకుంద చెప్పింది ఆలోచించాల్సిందే అంటే భవానీ మాత్రం ఇప్పుడే ఏ నిర్ణయానికి రాలేనని చెప్తుంది. ముకుంద చెప్పింది నిజమే అయితే ఫేక్ డెడ్ బాడీ ఇంటికి ఎందుకు పంపిస్తారని కృష్ణ లాజిక్ గా అడుగుతుంది. అలా బాడీని ఇంటికి పంపించి గుప్త దానం చేయడం రుణం తీర్చుకోవడం అనరు. పగ తీర్చుకోవడం అంటారు. ఏదో స్వార్థం, కుట్రతో చేశారని అనిపిస్తుందని కృష్ణ చెప్తుంది.
ముకుంద టెన్షన్ పడటం కృష్ణ గమనిస్తుంది. నేను అన్న మాటలకి ముకుంద టెన్షన్ పడుతుంది. ఇందులో ముకుంద హస్తం ఏమైనా ఉందా అని అనుమానపడుతుంది. ఎవరినైనా మోసం చేయవచ్చు కానీ కృష్ణని చేయలేము. ఈ టెన్షన్ తో దేవ్ కాదు నేనే దొరికిపోయేలా ఉన్నాను మొదటికే మోసం వచ్చేలా ఉందని ముకుంద మనసులో అనుకుంటుంది. చేసింది కృష్ణ వాళ్ళ చిన్నాన్న కాదని తేలిపోయింది. ఇక కండిషన్లు అన్నీ లేనట్టే కదా అని రేవతి అడుగుతుంది.
కృష్ణ చిన్నాన్న చేయించాడన్న భవానీ
శేఖర్ అనేవాడు పెద్దపల్లి ప్రభాకర్ మనిషి అయి ఉండవచ్చు కదాని భవానీ అనేసరికి కృష్ణ కోపంగా చూస్తుంది. అక్షరం ముక్క రాని వాడికి సర్జరీ గురించి ఏం తెలుసు. ఎవరితో అయినా చేయించి ఉండవచ్చని భవానీ అంటుంది. అంత పని ప్రభాకర్ మావయ్య చేస్తాడని అనుకోలేదని మురారి చెప్తాడు. వచ్చే శుక్రవారం లోపు అసలు దోషి ఎవరో ఖచ్చితంగా కనిపెట్టి తీరుతానని అంటాడు.
కృష్ణ ముకుంద ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉండగా రేవతి వచ్చి మాట్లాడుతుంది. అప్పుడే మురారి కూడా వస్తాడు. ఈ పని త్వరగా అయిపోతే బాగుండు అందరం కలిసి ఉంటే బాగుంటుందని కృష్ణ అంటుంది. మీరేగా దూరంగా ఉంటామని ఫోజు కొట్టారని రేవతి తిడుతుంది.
బెయిల్ మీద బయటికొచ్చిన దేవ్
శ్రీనివాస్ బాబాయ్ గురించి ఆలోచిస్తున్నానని కృష్ణ చెప్తుంది. బాబాయ్ కన్నకూతురు ముకుంద. తన జీవితానికి నేను అడ్డం వస్తున్నానని నా మీద కోపం పెంచుకోవాలి కానీ ఆయన నాకు అండగా నిలబడ్డారు. అది ఆయన మంచితనం. నాకు ముకుంద కన్నా బాబాయ్ హ్యాపీ నెస్ ముఖ్యం. అందుకే ముకుందకి ఒకదారి చూపించేవరకు ఇక్కడే ఉండాలని అనుకుంటున్నట్టు చెప్తుంది. దేవ్ శ్రీనివాస్ ఇంటికి వస్తాడు. జైలు నుంచి బయటకి వచ్చిన కొడుకుని చూసి షాక్ అవుతాడు.
రాననుకున్నావా.. రాలేననుకున్నావా శ్రీనివాస్. నాకు బెయిల్ వచ్చింది శ్రీనివాస్ అంటాడు. మురారికి గతం గుర్తుకు వచ్చిందని చెప్పేసరికి దేవ్ షాక్ అవుతాడు. ఇక నీ ఆటలు సాగవు. ఆ మురారీ నీ ఆట కట్టిస్తాడని మురారికి ఫోన్ చేస్తుంటే వద్దని దేవ్ ఆపుతాడు. ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంటే దేవ్ ఫోన్ లాగేసుకుంటాడు. ఇద్దరు రౌడీలు శ్రీనివాస్ ని బలవంతంగా కిడ్నాప్ చేయిస్తాడు. ముకుంద, మురారి పెళ్లి చేయించిన తర్వాత ఫామ్ హౌస్ కి తీసుకొస్తానని దేవ్ చెప్తాడు.
మురారీ కృష్ణ దగ్గరకి వచ్చి త్వరగా బట్టలు సర్దుకో ఇంటికి వెళ్దామని అంటాడు. మురారి, కృష్ణ మాట్లాడుకుంటూ ఉండగా ముకుంద దేవ్ ని తీసుకొచ్చి పరిచయం చేస్తుంది. దేవ్ మంచివాడుగా మురారి ముందు నటిస్తాడు.