Krishna mukund murari march 21st: ప్లాన్ మార్చిన శ్రీనివాస్, మురారి అరెస్ట్.. ముకుందకి అండగా నిలిచిన ఆదర్శ్-krishna mukund murari serial march 21st episode krishna breaks down after the police arrest murari for mukunda demise ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukund Murari March 21st: ప్లాన్ మార్చిన శ్రీనివాస్, మురారి అరెస్ట్.. ముకుందకి అండగా నిలిచిన ఆదర్శ్

Krishna mukund murari march 21st: ప్లాన్ మార్చిన శ్రీనివాస్, మురారి అరెస్ట్.. ముకుందకి అండగా నిలిచిన ఆదర్శ్

Gunti Soundarya HT Telugu
Mar 21, 2024 07:33 AM IST

Krishna mukund murari serial march 21st episode: ముకుంద చెప్పినట్టుగా చేయకుండా శ్రీనివాస్ మురారిని అరెస్ట్ చేయిస్తాడు. ముకుంద ఆత్మహత్యకి మురారి కారణమని ఆదర్శ్ పూర్తిగా నమ్మేస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 21వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 21వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

Krishna mukund murari serial march 21st episode: సర్జరీ జరిగిన తర్వాత ముకుంద తన మొహం అద్దంలో చూసుకుని నవ్వుకుంటుంది. ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. కృష్ణ, మురారి కాచుకోండని మనసులో అనుకుంటుంది. శ్రీనివాస్ ముకుందని చూడటానికి వస్తాడు. కూతురు మొహం చూసి షాక్ అవుతాడు. నమ్మలేకపోతున్నావ్ కదా నేనే ముకుంద అని కొంచెం కూడ అనుమానం రాలేదు కదా అంటే లేదని అంటాడు. నన్ను కన్న నీకే నేను ముకుంద అని అనుమానం రాలేదంటే ణా ప్లాన్ వంద శాతం సక్సెస్ కాబోతుంది. నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది నువ్వు నా ముకుందవి కాదని అంటాడు.

yearly horoscope entry point

రూపం గొంతు మార్చుకున్న ముకుంద

ఇంక ఆ మొహం లేదు మారిపోయింది. నీ అనుమానం ఏంటని అడుగుతుంది. రూపం మార్చుకుంటే గొంతు మారిపోతుందా? ఏంటని అడుగుతాడు. రూపమే కాదు నా గొంతు కూడా మారిపోయింది. మురారి రూపం మారిపోయినా తన గొంతు వల్ల తనని గుర్తు పట్టారు. కానీ నా విషయంలో అలా జరగకూడదు. అందుకే గొంతు కూడ మార్చుకున్నాను. అప్పుడే నా పగని సాధించుకోగలగుతాను. మళ్ళీ ఒకసారి ఆలోచించు కొత్త రూపంతో కొత్త జీవితం ప్రారంభించకుండా మళ్ళీ ఎందుకు చిక్కుల్లోకి అని అంటాడు. ఎందుకంటే నా బతుకు నా మనసు అక్కడే చిక్కుకుపోయి ఉన్నాయి. ఇంతకు తెగించి నన్ను నేను ఎందుకు మార్చుకున్నాను వెనకడుగు వేయడానికి కాదు. ఇప్పుడు నువ్వు నా చావుకు కృష్ణ కారణమని చెప్పి తనని అరెస్ట్ చేయించమని చెప్తుంది.

కృష్ణ ఏం చేసింది తను చాలా మంచిది నేను ఆ పని చేయలేనని శ్రీనివాస్ చెప్తాడు. నేను ఏం అడిగినా చేస్తానని చెప్పి ఇప్పుడు మాట తప్పుతావా అంటే ఇంకేదైనా అడుగు చేస్తాను. ఇది మాత్రం చేయలేనని చెప్పేస్తాడు. మురారి నాకు దక్కడం న్యాయం. కృష్ణ మీద పగ తీర్చుకోవడానికి నేనేమీ అరెస్ట్ చేయమనడం లేదు. మురారికి దగ్గర కావడానికి అలా చేయమంటున్నాను. నేను ఇప్పుడు తన దగ్గరకి వెళ్ళి నీ మనసులో నాకు చోటు ఇవ్వు అంటే ఇస్తాడా? తను ప్రేమించిన ముకుంద రూపానికి ఛాన్స్ ఇవ్వలేదు ఈ రూపాన్ని పట్టించుకుంటాడా? పట్టించుకునేలా చేయాలంటే ఇలా చేయాలి. కృష్ణని అరెస్ట్ చేయిస్తే మురారి తనని బయటకి తీసుకొచ్చే పనిలో పడతాడు. నేను తనకి సాయం చేసి దగ్గర అవుతాను కృష్ణని బయటకి తీసుకొస్తాను . నీ కూతురు ఆ ఇంట్లో తిరిగి అడుగు పెట్టాలంటే కృష్ణ జైలుకి పోవాల్సిందేనని ముకుంద తేల్చి చెప్తుంది.

మురారిని లాకప్ డెత్ చేయించమన్న శ్రీనివాస్

శ్రీనివాస్ ముకుంద మాటలకు తల వంచుతాడు. శ్రీనివాస్ తన స్నేహితుడు హోమ్ మినిస్టర్ ని కలుస్తాడు. ఒక పోలీసాఫీసర్ ని చితక్కోట్టి వీలైతే లాకప్ డెత్ చేయాలని ఆవేశంగా చెప్తాడు. ఏం చేశాడని మినిస్టర్ అడిగితే నా కూతురు జీవితంతో ఆడుకున్నాడని జరిగింది చెప్తాడు. నేను ఒక ఇన్స్పెక్టర్ పేరు చెప్తాను కంప్లైంట్ రాసి తనకి ఇవ్వమని మినిస్టర్ చెప్తాడు. పోలీసాఫీసర్ పేరు ఏంటని అంటే మురారి అంటాడు. రేవతి ముకుంద ఫోటో చూసి తనని తిట్టుకుంటుంది. కృష్ణ వాళ్ళు శ్రీనివాస్ ఇంటికి వెళ్లాలని బయల్దేరతారు. ఈ సమయంలో అక్కడికి ఎందుకని రేవతి అంటుంది. ఇక్కడ నన్ను ఆదర్శ్ అపార్థం చేసుకున్నాడు అక్కడ శ్రీనివాస్ బాబాయ్ మురారిని అపార్థం చేసుకున్నాడు. తనకి ముకుంద తప్ప ఎవరు లేరని కృష్ణ అంటుంది.

అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇస్తారు. మురారిని అరెస్ట్ చేయడానికి వచ్చామని చచెప్పడంతో అందరూ కంగారుపడతారు. ఏం తప్పు చేశారని అరెస్ట్ చేస్తున్నారని కృష్ణ అడుగుతుంది. ముకుంద చావుకి కారణం అయినందుకని పోలీస్ చెప్తాడు. నేను ముకుంద చావుకి కారణం ఏంటి తను సూసైడ్ చేసుకుందని మురారి అంటే తను సూసైడ్ చేసుకోవడానికి కారణం మీరే కదా ఎస్సై అంటాడు. తను ఆత్మహత్య చేసుకుంది తన చావుకి ఎవరికి ఏ సంబంధం లేదని కృష్ణ అంటే ఆదర్శ్ వచ్చి మురారికి మాత్రమే కాదు కృష్ణకి కూడా సంబంధం ఉంది. వీళ్ళు ఇద్దరూ కలిసి నా ముకుందని చంపేశారని అంటాడు. నీ కోపం చూపించుకునే సమయం ఇదేనా అని రేవతి కొప్పడుతుంది. ఇది వీళ్ళు చేసిన పాపం పండిన సమయమని అంటాడు. నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదని మధు వార్నింగ్ ఇస్తాడు.

మురారి అరెస్ట్

ముకుంద ప్రాణాలు తీసి నన్ను జీవశ్చవం చేశారు శిక్ష అనుభవించాల్సిందే. వీళ్లిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లండి. ముకుంద ఆత్మహత్యతో వీళ్ళు ఇద్దరికీ సంబంధం ఉందని ఆదర్శ్ పోలీసులకు చెప్తాడు. మాకు మురారిని మాత్రమే అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయని పోలీస్ చెప్తాడు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని చెప్పి మురారి చేతికి సంకెళ్ళు వేసి తీసుకెళ్తారు. కృష్ణ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. పోలీసుల కారు వెంట పరుగులు పెడుతూ ఏడుస్తుంది. ఏసీపీ సర్ ని తీసుకెళ్తున్నారు ఏదో ఒకటి చేయమని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఎవరు కంప్లైంట్ ఇచ్చి ఉంటారని రేవతి అంటే ముకుంద వాళ్ళ నాన్న ఇచ్చి ఉంటాడని మధు అంటాడు.

కూతురు చావుకి కారణం అయిన వారిని ఏ కన్నతండ్రి వదిలిపెట్టడు కదాని ఆదర్శ్ సపోర్ట్ గా మాట్లాడతాడు. పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతానని నందిని తిడుతుంది. ఇంటికి వచ్చి అన్నయ్యని అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మంచిగా జరిగిందని సంబరపడుతున్నావ్ సిగ్గుగా లేదాని నిలదీస్తుంది. అందరూ పోలీస్ స్టేషన్ కి వెళ్దామని అంటే ఆదర్శ్ వస్తానని అంటాడు. నువ్వు ఎందుకు తనని మళ్ళీ లోపలికి వేయించడానికా?అని అడుగుతుంది. ముకుంద చావుకి నువ్వు కారణమని నేను నమ్ముతాను మురారి కాదు. కానీ పోలీసులు ఏవో ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా వాటిని చూద్దాం. మురారి తప్పు చేయకపోతే నా ప్రాణం అడ్డు పెట్టి అయినా కాపాడతాను కానీ తనే కారణం అయితే మాత్రం ఆ దేవుడు కూడా కాపాడలేడని ఆదర్శ్ అంటాడు.

ముకుంద మరణ వాంగ్మూలం

మురారి సెల్ లో ఉండి తనని ఎందుకు అరెస్ట్ చేశారని గట్టిగా అడుగుతాడు. ఎస్సై మురారిని నోటికొచ్చినట్టు తిడతాడు. కృష్ణ వాళ్ళు స్టేషన్ కి వస్తారు. మురారి మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారంటే ముకుంద నాన్న శ్రీనివాస్ అని ఎస్సై చెప్తాడు. ఆయనకి నా కొడుకు అంటే పడదు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదని నా కొడుకు మీద పీకల దాకా కోపం ఉందని రేవతి బతిమలాడుతుంది. సరైన ఆధారాలతో అరెస్ట్ చేశామని చెప్పి ఎస్సై ఒక లెటర్ చూపిస్తాడు. ముకుంద చనిపోయే ముందు సూసైడ్ లెటర్ రాసిందని చెప్పి లెటర్ చూపిస్తాడు. తన చావుకి మురారి కారణమని చెప్పి ముకుంద చనిపోవడానికి ముందు రాసిన మరణ వాంగ్మూలమని అంటాడు. ముకుంద అలా రాయదని కృష్ణ అంటుంది. ఇది ముకుంద రాసింది కాదని ఎవరో కుట్ర చేశారని కృష్ణ కొట్టి పడేస్తుంది.

టెస్ట్ చేయించాము అది ముకుంద హ్యాండ్ రైటింగ్ కావాలంటే చూడామని లెటర్ కృష్ణకి ఇస్తాడు. మురారిని ప్రేమించాను తనతో కలిసి బతకాలని కలలు కన్నాను. కానీ మురారి నన్ను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి తన ఫ్రెండ్ తో పెళ్లి చేశాడు. నాకోసమే ఆలోచిస్తానని పెళ్లి కూడా చేసుకొనని మాయ మాటలు చెప్పి కృష్ణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. నాకోసమే ఆలోచిస్తానని చెప్పి కృష్ణని ఎందుకు పెళ్లి చేశావని నిలదీశాను. నాతో సమాధానం చెప్పలేక నాకు దూరంగా ఉన్న నా భర్తని తీసుకొచ్చారు. నేను మురారిని మర్చిపోలేక నా భర్తకి దగ్గర కాలేక నరకం అనుభవించాను. నా భర్త కోసం నా కోసం ఎంతలా తపించారో చూసి ఆయన్ని బాధపెట్టడం ఇష్టం లేక శోభనం రోజు నా భర్తతో కొత్త జీవితం మొదలు పెట్టాలని చూశాను.

ఆదర్శ్ అపార్థం

మురారి తర్వాత ఏం చెప్పాడో తెలుసా? అని చదివి కృష్ణ ఇది అబద్ధం ఆదర్శ్ తో ఎప్పుడు ముకుంద బతుకు పంచుకోవాలని అనుకోలేదని అంటుంది. కానీ ఆదర్శ్ మాత్రం లెటర్ మొత్తం చదువు నిజాలు బయట పడాలని అంటాడు. లెటర్ ఆదర్శ్ తీసుకుని చదువుతాడు. నేను కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటే మురారి మాత్రం నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. ఇదే మాట ఆదర్శ్ కి చెప్పు తను వెళ్లిపోతాడు. మురారి చెప్పమన్నట్టే శోభనం గదిలో చెప్పాను. కృష్ణ అన్న మాటలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాను. ఇందులో కృష్ణ తప్పు లేదు మొత్తం మురారి చేశాడని ఉంటుంది. ముకుంద చావుకి మురారి కారణం అనడానికి ఇంతకన్నా రుజువు అవసరం లేదని చెప్పేసి ఆదర్శ్ వెళ్ళిపోతాడు.

తరువాయి భాగంలో..

కృష్ణ ముకుంద మురారి సీరియల్ రేపటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే కృష్ణ శ్రీనివాస్ దగ్గరకి వచ్చి మురారిని విడిపించమని ఏడుస్తుంది. అది విని ముకుంద స్టేషన్ కి వచ్చి మురారిని రిలీజ్ చేయమని చెప్తుంది. దెబ్బలతో ఉన్న మురారిని చూసి ముకుంద బాధపడుతుంది.

Whats_app_banner