కోటి కోటి తారల్లోన పాట రిలిక్స్: ప్రేయసికి జీవితాంతం తోడుంటానని చెప్పేందుకు పర్‌ఫెక్ట్ సాంగ్.. లిరిక్స్ ఇవే.. పాడుకోండి!-koti koti tarallona song lyrics from yeto vellipoyindhi manasu movie nani samantha romantic love song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కోటి కోటి తారల్లోన పాట రిలిక్స్: ప్రేయసికి జీవితాంతం తోడుంటానని చెప్పేందుకు పర్‌ఫెక్ట్ సాంగ్.. లిరిక్స్ ఇవే.. పాడుకోండి!

కోటి కోటి తారల్లోన పాట రిలిక్స్: ప్రేయసికి జీవితాంతం తోడుంటానని చెప్పేందుకు పర్‌ఫెక్ట్ సాంగ్.. లిరిక్స్ ఇవే.. పాడుకోండి!

కోటి కోటి తారల్లోన పాట లిరిక్స్: ప్రేయసి అలిగితే బుజ్జిగించేందుకు ప్రియుడు పాట పాడడం మరింత బాగుంటుంది. ఇందుకోసం కొన్ని సినిమా పాటలు బాగా సూటవుతాయి. వాటిలో ఒక సాంగ్ గురించి ఇక్కడ చూడండి. లిరిక్స్ చదువుతూ పాడుకోండి.

ప్రేయసి అలక తీర్చేందుకు, జీవితాంతం తోడుంటానని చెప్పేందుకు పర్‌ఫెక్ట్ సాంగ్ ఇది.. లిరిక్స్ ఇవే

నేచురల్ స్టార్ నాని, సమంత హీరోహీరోయిన్లుగా ‘ఏటో వెళ్లి పోయింది మనసు’ సినిమా 2012 డిసెంబర్‌లో వచ్చింది. ఈ లవ్ రొమాంటిక్ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ చాలా మంది హృదయాల్లో నిలిచిపోయింది. ఈ సినిమాకు ఇసైజ్ఞాని ఇళయరాజా ఇచ్చిన మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని కొన్ని పాటలు క్లాసిక్‍గా నిలిచిపోయాయి.

కోటి కోటి తారల్లోన..

ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రంలోని ‘కోటి కోటి తారల్లోన’ సాంగ్ బాగా పాపులర్ అయింది. ఈ పాటకు మంచి మెలోడియస్ ట్యూన్ ఇచ్చారు ఇళయరాజ. ఈ సాంగ్‍ను కార్తీక్ పాడారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ ఇచ్చారు. ఈ పాటలో సాహిత్యం ఆకట్టుకుంటుంది. చాలా రోజుల ఎడబాటు తర్వాత ప్రేయసి నిత్య (సమంత)ను కలిసేందుకు వరుణ్ కృష్ణ (నాని) ప్రయాణిస్తున్న సందర్భంలో సినిమాలో ఈ పాట వస్తుంది. ఏమైనా జీవితాంతం తోడు ఉంటానని ప్రేయసికి చెప్పేందుకు సూటయ్యే మాటలు ఈ పాటలో ఉంటాయి.

ప్రేమలో ఉన్న వారు మధ్య అప్పుడప్పుడు గొడవలు జరగడం, ప్రేయసి అలగడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఆమె అలక తీర్చేందుకు ఈ పాట బాగా సూటవుతుంది. జీవితాంతం నీతోనే ఉంటానని చెప్పేందుకు పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూస్తూ పాడేసుకోండి.

‘కోటి కోటి తారల్లోన’ పాట లిరిక్స్

కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు

నీ మనసులో నేనుంటానే..

కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు

నీ మనసులో నేనుంటానే...

నీటి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్లు

నీ తపస్సునే చేస్తుంటానే...

గాలిలోన ఆరోప్రాణం…

కలవకుండ ఉన్నన్నాళ్లు...

గాలిలోన ఆరోప్రాణం

కలవకుండ ఉన్నన్నాళ్లు...

నిన్ను నేనే ఆరాధిస్తా

నీకోసం ఆరాతీస్తా...

కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు

నీ మనసులో నేనుంటానే...

నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్లు

నీ తపస్సునే చేస్తుంటానే...

ఏడువింతలున్నన్నాళ్లు

నీకు తోడునై ఉంటా...

పాలపుంత ఉన్నన్నాళ్లు

నన్ను పంచి నేనుంటా...

పాదమున్ననాళ్లు.. నీ నడక లాగా నేనుంట

కోరుకున్న చోటల్లా చేర్చుతా...

చేతుల్లున్ననాళ్లు

నీ.. గీత లాగా నేనుంట

జాతకాన్ని అందంగా మార్చుతా...

అంకెలింక ఉన్నన్నాళ్లు నీ వయసు సంఖ్యవనా...

సంఖ్యలళ్లె బంధిస్తుంటా వంద ఏళ్లిలా..

హేహేహేహే..

కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు

నీ మనసులో నేనుంటానే…

నీటి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్లు

నీ తపస్సునే చేస్తుంటానే...

భాషనేది ఉన్నన్నాళ్లు

నిన్ను పొగిడి నేనుంటా...

ధ్యాసనేది ఉన్నన్నాళ్లు

నిన్ను తలచి నేనుంటా...

వెలుగు ఉన్నన్నాళ్లు

నీ వెనుక నేను వేచుంటా ...

నువ్వేటేపు వెళుతున్నా సాగనా...

మసక ఉన్నన్నాళ్లు

నీ.. ముందుకొచ్చి నించుంటా...

నువ్వెలాగా ఉన్నావో చూడనా...

నీకు దూరం ఉన్నన్నాళ్లు జ్ఞాపకంగా వెంటుంటా...

మళ్లీమళ్లీ గుర్తొస్తుంటా ముందు జన్మలా..

హేహేహేహె...

కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు

నీ మనసులో నేనుంటానే..

నీటి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్లు

నీ తపస్సునే చేస్తుంటానే...

గాలిలోన ఆరోప్రాణం…

గాలిలోన ఆరోప్రాణం కలవకుండ ఉన్నన్నాళ్లు...

నిన్ను నేనే ఆరాధిస్తా

నీకోసం ఆరాతీస్తా...

కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు

నీ మనసులో నేనుంటానే..

నీటి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్లు

నీ తపస్సునే చేస్తుంటానే...

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం