OTT Korean Horror Movie: ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Korean Horror Movie: కొరియన్ హారర్ సినిమా ‘హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్’ ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన ఏడేళ్లకు ఇండియాలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులో ఉంది.

కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్‍లకు ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంటుంది. ఓటీటీల్లో కొరియన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్ని చూసినా ఇంకా మిగిలే ఉన్నాయనేంత కొరియన్ కంటెంట్ వస్తుంటుంది. కే డ్రామాలకు ఆడియన్స్ కూడా అంతే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కొరియన్ చిత్రాలను ఇష్టపడే వారి కోసం మరో చిత్రం ఓటీటీలో ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది.
స్ట్రీమింగ్ వివరాలివే..
హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. కొరియన్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లోనూ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.
‘హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్’ చిత్రం కొరియన్‍లో థియేటర్లలో 2017లోనే రిలీజ్ అయింది. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ బాగా పాపులర్ అయింది. థియేటర్లలో రిలీజైన ఏడేళ్లకు ఇండియాలో ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.
హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్ గురించి..
హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్ మూవీకి లిమ్ డీ వూంగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యుంజిన్ కిన్, కే పాప్ స్టార్ ఓకే టయిక్ ఇయాన్, జా జయీ యూన్, పార్క్ సంగ్ హూన్ ప్రధాన పాత్రలు పోషించారు. రిత్మికల్ గ్రీన్, జియాన్ ఎంటర్‌టైన్‍మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి కిమ్ వూ గెయిన్ సంగీతం అందించారు.
స్టోరీ లైన్
భర్త, కొడుకును హత్య చేశారనే తప్పుడు అభియోగం నిరూపణ కావటంతో మీ హీ (యుంజిన్ కిమ్) 25 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తుంది. ఆ తర్వాత బయటికి వచ్చి తన ఇంటికి తిరిగి వెళుతోంది. తన భర్త, కొడుకు మరణానికి కారణాలేంటో కనుగొనేందుకు ప్రయత్నిస్తుంది. దీని చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా ఉత్కంఠభరితంగా ఈ చిత్రం ఉంటుంది.
మీర్జాపూర్ 3 వచ్చేస్తోంది
మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్‍ను అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకొస్తోంది. ఈ సీజన్ జూలై 5వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‍లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, రసిక దుగల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్, శ్వేత త్రిపాఠి శర్మ మెయిన్ రోల్స్ చేశారు. మీర్జాపూర్ రెండు సీజన్లు భారీగా సక్సెస్ అయ్యాయి. దీంతో మూడో సీజన్ కోసం ప్రేక్షకులు చాలా ఎదురుచూశారు. రెండో సీజన్ వచ్చిన నాలుగేళ్లకు మూడో సీజన్‍ను ప్రైమ్ వీడియో తీసుకొస్తోంది. జూలై 5వ తేదీ నుంచి ప్రైమ్ వీడియోలో మీర్జాపూర్ మూడో సీజన్ స్ట్రీమింగ్ కానుంది.