OTT Crime Thriller: తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన సూపర్ హిట్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.. ఎక్కడ చూడొచ్చు!
OTT Korean Crime Thriller: కొరియన్ సినిమా ‘ది రౌండప్: పనిష్మెంట్’ ఓటీటీలోకి వచ్చేసింది. సూపర్ హిట్ అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ షూరూ అయింది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
ఓటీటీల్లో కొరియన్ చిత్రాలకు ఓ రేంజ్‍లో క్రేజ్ ఉంటుంది. స్ట్రీమింగ్‍కు కొత్త కొరియన్ సినిమాలు ఏవి వస్తాయా అని చాలా మంది ఎదురుచూస్తుంటారు. తాజాగా ఓ కొరియన్ క్రైమ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ‘ది రౌండప్: పనిష్మెంట్’ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మా డాంగ్ సియోక్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీకి హియో మ్యుంగ్ హయెంగ్ దర్శకత్వం వహించారు.కొరియన్‍తో థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ ‘ది రౌండప్: పనిష్మెంట్’ స్ట్రీమింగ్ అవుతోంది.
స్ట్రీమింగ్ ఎక్కడ..
‘ది రౌండప్: పనిష్మెంట్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. కొరియన్‍తో పాటు ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళంలోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
బ్లాక్‍బస్టర్ కలెక్షన్లు
ది రౌండప్: పనిష్మెంట్ చిత్రం ముందుగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ప్రదర్శితమైంది. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీన కొరియన్‍లో థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ కమర్షియల్‍గా మంచి విజయం సాధించింది. సుమారు 83.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో దుమ్మురేపింది. 2024లో అత్యధిక వసూళ్లు సాధించన కొరియన్ మూవీగా నిలిచింది. బ్లాక్‍బస్టర్ కొట్టింది. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. తెలుగులోనూ చూసేయవచ్చు.
ఆన్‍లైన్ గ్యాంబ్లింగ్, క్రిప్టో కరెన్సీ మోసాలు చేసే గ్యాంగ్ ఆట కట్టించేందుకు ఓ డిటెక్టివ్ చేసే ప్రయత్నాల చుట్టూ ది రౌండప్: పనిష్మెంట్ సినిమా సాగుతుంది. 2015లో థాయ్‍ల్యాండ్‍లో జరిగిన పట్టాయా మర్డర్ కేస్ స్ఫూర్తి ఈ చిత్రం తెరకెక్కింది. డైరెక్టర్ హియో మ్యుంగ్ హయెంగ్ ఈ మూవీని గ్రిప్పింగ్‍గా తెరకెక్కించారు. దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. యాక్షన్, క్రైమ్, థ్రిలింగ్ సీన్లతో ఈ మూవీ రూపొందింది.
ది రౌండప్: పనిష్మెంట్ మూవీలో మా డాంగ్ సియోక్‍తో పాటు కిమ్ మూ మియోల్, పార్క్ జి హ్వాన్, లీ డంగ్ హ్వి, పార్క్ బో క్యుంగ్ కీలకపాత్రలు చేశారు. ఈ మూవీని బింగ్‍పంచ్ ఫిల్మ్స్, హాంగ్ ఫిల్మ్, బీఏ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యాన్ర్లు నిర్మించాయి. యూన్ సాంగ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా కమర్షియల్‍గా సక్సెస్ అవడంతో పాటు ప్రశంసలు కూడా దక్కించుకుంది. స్టోరీలైన్ గ్రిప్పింగ్‍గా ఉండటంపై పాజిటివ్ రివ్యూలను దక్కించుకుంది. ఈ మూవీకి లీ సంగ్ జీ సినిమాటోగ్రఫీ చేయగా.. కిమ్ సున్ మిన్ ఎడిటింగ్ చేశారు.
సంబంధిత కథనం