OTT Crime Thriller Movie: ఓటీటీలోకి వస్తున్న కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. చంపడమే అతడి ఉద్యోగం-korean crime thriller movie hit man to stream on lionsgate play ott from 28th march ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller Movie: ఓటీటీలోకి వస్తున్న కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. చంపడమే అతడి ఉద్యోగం

OTT Crime Thriller Movie: ఓటీటీలోకి వస్తున్న కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. చంపడమే అతడి ఉద్యోగం

Hari Prasad S HT Telugu

OTT Crime Thriller Movie: ఓటీటీలోకి ఇప్పుడో కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. చంపడమే ఉద్యోగంగా భావించే ఓ క్రిమినల్ స్టోరీ ఇది. తొలిసారి ఇప్పుడు ఇండియన్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

ఓటీటీలోకి వస్తున్న కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. చంపడమే అతడి ఉద్యోగం

OTT Crime Thriller Movie: క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కు ఓటీటీలో ఫుల్ డిమాండ్. అందులోనూ కొరియన్ కంటెంట్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడీ రెండింటి కాంబినేషన్ లో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు హిట్ మ్యాన్ (Hit Man).

హిట్ మ్యాన్ ఓటీటీ రిలీజ్ డేట్

హిట్ మ్యాన్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా చాలా రోజుల తర్వాత ఇండియన్ ఓటీటీలోకి వస్తోంది. లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో మార్చి 28 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

సమాజంలోని అవినీతి, జాతి వివక్ష, వ్యవస్థీకృత నేరాలు, అన్యాయం, అసమానతలాంటి అంశాలను అందరూ మెచ్చేలా తీయడంతో కొరియన్ ఫిల్మ్ మేకర్స్ అందరి కంటే ముందుంటారు. అలా వచ్చిందే ఈ హిట్ మ్యాన్ మూవీ కూడా. సుమారు రెండున్నరేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీ ద్వారా భారతీయ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

హిట్ మ్యాన్ మూవీ గురించి..

హిట్ మ్యాన్ నవంబర్, 2022లో రిలీజైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కాంగ్ టే-హో డైరెక్ట్ చేశాడు. గంటా 31 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు థియేటర్లలో ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. జియాంగ్ జీ వూ, పార్క్ జీ సూ, వోన్ సుక్ కోలాంటి వాళ్లు నటించారు.

ఈ సినిమా హిట్ మ్యాన్ అని పిలిచే ఓ ప్రొఫెషనల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. చంపడాన్నే ఓ ఉద్యోగంగా అతడు భావిస్తాడు. ఎవరినైనా చంపడానికి అతడు సుపారీ తీసుకున్నాడంటే ఆ వ్యక్తితో సంబంధం ఉన్న వాళ్లందరినీ కూడా చంపేయడం అతని అలవాటు.

అయితే అనుకోకుండా వచ్చే ఓ ట్విస్ట్ అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఓరోజు ఓ బామ్మ అతని దగ్గరికి వస్తుంది. తన మనవరాలి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తుంది. ఓ అగ్ని ప్రమాదంలో ఆమె చనిపోయిందని, అయితే అది ప్రమాదం కాకపోవచ్చని, ఏదో జరిగి ఉంటుందని అంటుంది.

అసలు ఏం జరిగిందో తెలుసుకొని, ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నట్లు ఆ బామ్మ హిట్ మ్యాన్ తో చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మూవీలో చూడాలి. ఇప్పుడీ మూవీ మార్చి 28 నుంచి లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ కు రానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం