Konda Devara Song Lyrics: మోతమోగేలా గేమ్ ఛేంజర్ ‘కొండ దేవర’ పాట.. లిరిక్స్ ఇవే
Konda Devara Song Lyrics - Game Changer: గేమ్ ఛేంజర్ సినిమాలోని కొండ దేవర పాట అదిరిపోయింది. ఫోక్ ట్యూన్‍తో ఉన్న ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి కొండ దేవర సాంగ్ రిలీజ్ అయింది. జానపదంలా ఉన్న ఈ సాంగ్ అదరగొడుతోంది. ఈ సినిమా మరో రెండు రోజుల్లో జనవరి 10వ తేదీన విడుదల కానుంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ తరుణంలో మిగిలిన పాటలను క్రమంగా విడుదల చేస్తోంది మూవీ టీమ్. శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా కొండ దేవర అనే పాట వచ్చింది.
అదరగొట్టేలా సాంగ్
గేమ్ ఛేంజర్ నుంచి వచ్చిన కొండ దేవర పాటకు జానపదం లాంటి ట్యూన్ ఇచ్చారు థమన్. ఈ పాటను థమన్, శ్రావణ భార్గవి ఆలపించారు. కాసర్ల శ్యామ్.. లిరిక్స్ రాశారు. మంచి పల్లె పదాలతో ఈ పాటను రాశారు శ్యామ్. ఇది జాతర సమయంలో వచ్చే పాటలా అనిపిస్తోంది. ఈ సాంగ్ ప్రస్తుతం అదరగొడుతోంది. నెటిజన్లు ఈ పాటను ప్రశంసిస్తున్నారు. మొత్తంగా ఈ సాంగ్ మోతమోగేలా కనిపిస్తోంది. ఈ కొండ దేవర పాట లిరిక్స్ ఇక్కడ చూసేయండి.
కొండ దేవర పాట లిరిక్స్ ఇవే
నెత్తురంత ఉడుకుతున్న ఊరువాడ జాతర
వాడు మీద పడ్డడంటే ఊచ ఊచ కోతరా
కొండ దేవర.. కొండ దేవర
ఎత్తుకెళ్ల వచ్చినోళ్ల దండు ఉప్పుపాతర
తన్ని తన్ని దుండగుల్ని తరుముదాము పొలిమేర
కొండ దేవర.. కొండ దేవర
కొండ దేవర.. కొండ దేవర
కొండ దేవర.. నేల, గాలి మాది
కొండ దేవర.. మట్టి తల్లి మాది
కొండ దేవర.. నీరు, నిప్పు మాది
కొండ దేవర.. కొండ, కోన మాది
ఎర్రఎర్ర సూర్యున్నేమో బొట్టునాల దిద్ది
వెలుగు నింపినావు బతుకునా..
నల్లనల్ల మబ్బులోన ఎండి ఎన్నెలద్ది.. ఊయపినావు జోలనా..
మా నిన్న మొన్న మనమంటే.. నువ్వే
వేయి కన్నులున్న బలగం నువ్వే
నువ్వు ఉంటావమ్మా.. ఇయ్యాల రేపు
మా వెన్నుదన్ను మార్గం చూపే
పాడు కళ్ళుచూడు తల్లి గుండేదాకా ఈడకొచ్చినయిరా
హే ఎల్లగొట్టుదాము… విల్లు ఎత్తినాము.. బెల్లుమంటూ దూకగా..
కొండ దేవర.. కొండ దేవర
కొండ దేవర.. కొండ దేవర
కొండ దేవర.. నేల, గాలి మాది
కొండ దేవర.. మట్టి తల్లి మాది
కొండ దేవర.. అండ నీవురా..
కొండ దేవర.. గుండె నీదిరా..
కొండ దేవర.. అండ నీవురా..
కొండ దేవర.. గుండె నీదిరా..
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్‍చరణ్ డ్యుయల్ రోల్ చేస్తున్నారు. ఈ కొండ దేవర పాట ప్లాష్‍బ్యాక్‍లో ఉండనుంది. రామ్‍చరణ్ పోషించిన అప్పన్న పాత్రకు ఈ పాట ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో అంజలి, కియారా అడ్వానీ హీరోయిన్లుగా నటించారు. ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు. పొటిలికల్ యాక్షన్ డ్రామాగా గేమ్ ఛేంజర్ మూవీని శంకర్ తెరకెక్కించారు. జనవరి 10న తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం
టాపిక్