SS Thaman: అతన్ని జూనియర్ తమన్ అని పిలుస్తాంటాం.. రైటర్ కోన వెంకట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Geethanjali Malli Vachindi Trailer Launch: హీరోయిన్ అంజలి నటిస్తున్న మరో సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఘనంగా చేశారు. ఈ ఈవెంట్‌లో రచయిత కోన వెంకట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Geethanjali Malli Vachindi Kona Venkat: బ్యూటిఫుల్ హీరోయిన్ అంజలి (Anjali) తన సినీ కెరీర్‌లో 50వ సినిమాగా వస్తున్న మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు శివ తుర్లపాటి దర్శతక్వం వహిస్తున్నారు. MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ (Kona Venkat) నిర్మించారు. హారర్ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇటీవల గీతాంజలి మళ్లీ వచ్చింది ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా గీతాంజలి మళ్లీ వచ్చింది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు. ఈ ఈవెంట్‌లో రైటర్ కోన వెంకట్ ఆసక్తిర కామెంట్స్ చేశారు. "గీతాంజలి మాకెంతో స్పెషల్ మూవీ. గీతాంజలి మళ్లీ వచ్చింది ఇంకా చాలా స్పెషల్ సినిమా. ఎందుకంటే ఇది అంజలికి 50వ సినిమా. ఆమెను అభినందించాల్సిందే. ఓ తెలుగు అమ్మాయి 50 సినిమాలు చేయడటమంటే గొప్ప విషయం. ఇప్పుడింకా గొప్పగా రాబోతుంది" అని రచయిత కోన వెంకట్ అన్నారు.
"గీతాంజలి ఐడియాను నా దగ్గరకు తెచ్చింది శ్రీనివాస్ రెడ్డినే. ఆ సినిమా సక్సెస్ మా టీమ్‌ను కలిపింది. నేను 55 సినిమాలకు రైటర్‌గా వర్క్ చేశాను. అన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది మాత్రం భాను, నందు. సామజవరగమన, భైరవకోన సినిమాలకు వాళ్లు వర్క్ చేశారు. ఈ స్క్రిప్ట్‌లో కీలక పాత్రను పోషించారు. కథను నేనిచ్చినా.. వాళ్లు దాన్ని 10 మెట్లు ముందుకు తీసుకెళ్లారు" అని కోన వెంకట్ తెలిపారు.
"ప్రవీణ్ లక్కరాజుని జూనియర్ తమన్ (SS Thaman) అని పిలుస్తుంటాం. మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఛోటా కె.ప్రసాద్ చాలా కీలక పాత్రను పోషించాడు. డైరెక్టర్ శివకి ఇదొక బెస్ట్ మూవీ అవుతుంది. ఏప్రిల్ 11న మూవీని రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నాం. ట్రైలర్‌లో చూసింది కొంతే.. సినిమా ధమ్ బిర్యానీలా ఉంటుంది" అని రైటర్, డైరెక్టర్ కోన వెంకట్ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు (Praveen Lakkaraju)సంగీతం అందించారు.
"గీతాంజలి మళ్లీ వచ్చింది.. డబుల్ ఎంటర్‌టైనర్, డబుల్ హారర్ ఎలిమెంట్స్‌తో మెప్పిస్తుంది. చాలా రోజుల నుంచి బ్యాగ్రౌండ్ స్కోర్ మీద వర్క్ చేస్తున్నాను. అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉన్నాం. అంజలిగారి 50వ సినిమా అని స్పెషల్ సాంగ్ చేశాం" అని సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు అన్నారు. "అంజలి గారికి ముందుగా కంగ్రాట్స్ చెబుతున్నాను. ఈ సినిమా తర్వాత ఆమె 50 నుంచి డబుల్ సెంచరీ వరకు వెళ్లిపోతుంది. అలాగే కోనగారి స్టైల్లో తెరకెక్కిన గీతాంజలి. డైరెక్టర్ శివ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇది టీమ్ అందరికీ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది" అని ఎడిటర్ ఛోటా కే ప్రసాద్ తెలిపారు.
"గీతాంజలి మళ్లీ వచ్చింది ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. సినిమా అంతకు మించి ఉంటుంది. అందరి సపోర్ట్‌తో ఇక్కడి వరకు చేరుకున్నాం. శీనన్న, రాజేషన్న, శంకర్, యాదంరాజు సహా అందరికీ థాంక్స్. ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్, ప్రవీణ్ లక్కరాజు మంచి మ్యూజిక్‌తో పాటు మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఏప్రిల్ 11న మూవీ రిలీజ్. సినిమా చూసి ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాం" అని డైరెక్టర్ శివ తుర్లపాటి కోరారు.