Kona Venkat: హారర్ మూవీ అతని వల్లే పుట్టింది.. వాళ్ల ఆకలి ఇంకా తీరలేదు: రైటర్ కోన వెంకట్-kona venkat comments in geethanjali malli vachindi teaser launch about srinivas reddy geethanjali movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kona Venkat Comments In Geethanjali Malli Vachindi Teaser Launch About Srinivas Reddy Geethanjali Movie

Kona Venkat: హారర్ మూవీ అతని వల్లే పుట్టింది.. వాళ్ల ఆకలి ఇంకా తీరలేదు: రైటర్ కోన వెంకట్

Sanjiv Kumar HT Telugu
Feb 26, 2024 10:19 AM IST

Kona Venkat Speech Geethanjali Malli Vachindi: తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి రైటర్‌గా పేరు తెచ్చుకున్న రచయిత కోన వెంకట్ నిర్మాతగా మారి అనేక సినిమాలు నిర్మించారు. వాటిలో గీతాంజలి మూవీ మంచి హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది ప్రేక్షకుల ముందుకు రానుంది.

హారర్ మూవీ అతని వల్లే పుట్టింది.. వాళ్ల ఆకలి ఇంకా తీరలేదు: రైటర్ కోన వెంకట్
హారర్ మూవీ అతని వల్లే పుట్టింది.. వాళ్ల ఆకలి ఇంకా తీరలేదు: రైటర్ కోన వెంకట్

Kona Venkat About Geethanjali: తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి రచయితగా కోన వెంకట్ పేరు తెచ్చుకున్నారు. అనేక సినిమాల్లో తన రచనా శైలీతో ఎంతో ఆకట్టుకున్నారు. అనంతరం నిర్మాతగా మారి సినమాలు తెరకెక్కిస్తున్నారు. అద్భుతమైన అభినయంతో ఆకట్టుకునే అందాల నటి అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ ఎంటర్‌టైనర్ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను నిర్మిస్తున్నారు కోన వెంకట్. 2014లో తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్.

కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ బ్యానర్స్‌పై కోన వెంకట్ నిర్మిస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చిందికి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతాంజలి మళ్లీ వచ్చింది మార్చి 22న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను శనివారం ఫిబ్రవరి (24) రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌‌కు దర్శకుడు బుచ్చిబాబు, బాబీ, గోపీచంద్ మలినేని, హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథులుగా వచ్చారు.

ఈ ఈవెంట్‌లో "అంజలికి ఇది 50వ సినిమా. ఇది ఆమెకు ఎంతో ప్రత్యేకం. పదేళ్ల క్రితం గీతాంజలి వచ్చింది. అదొక ట్రెండ్ సెట్టర్. అన్ని భాషల్లో ఈ చిత్రం అప్పట్లో హిట్ అయింది. రూ. 3.5 కోట్లతో తీసిన గీతాంజలి అన్ని భాషల్లో విజయవంతం అయింది. గీతాంజలి మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు, లిరిక్ రైటర్ శ్రీజో ఇలా ఎంతో మంది పరిచయం అయ్యారు. ఓ మూవీ సక్సెస్ అయితే ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అవుతారు" అని కోన వెంకట్ తెలిపారు.

"మళ్లీ గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాను తీయడానికి పదేళ్లు పట్టింది. నాలుగేళ్ల క్రితం ఓ పాయింట్ తట్టింది. దాన్ని డెవలప్ చేసేందుకు ఇంత టైం పట్టింది. నందు, భాను వల్ల ఈ సినిమా ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. టెక్నీషియన్స్ అనే వాళ్లకి ఆకలి ఉండాలి. కొత్తలో ఆ ఆకలి ఉంటుంది. ఇక్కడకు వచ్చిన బాబీ, గోపీ ఇంకా ఆ ఆకలితోనే ఉన్నారు. నందు, భాను అలానే ఆకలితో ఉంటారు. శ్రీనివాస్ రెడ్డి వల్లే గీతాంజలి మొదలైంది. అతనే రాజ్ కిరణ్ దర్శకుడిని నా వద్దకు తీసుకొచ్చాడు. హారర్‌గా ఉన్న కథను.. హారర్ కామెడీగా మార్చాను. శ్రీను వల్లే గీతాంజలి పుట్టింది" అని కోన వెంకట్ అన్నారు.

"గీతాంజలి సినిమాలో ఒక్క రోజు షూట్‌ కోసం వచ్చాడు. ఈ చిత్రంలో అలీ పాత్ర ఎక్స్‌ట్రార్డనరీగా ఉండబోతోంది. ఈ సినిమాలోని ప్రతీ పాత్ర ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. డీఓపీ సుజాత సిద్దార్థ్ విజువల్స్ బాగున్నాయి. శివ తుర్లపాటిని అమెరికా నుంచి పట్టుకొచ్చాం. ప్రవీణ్, శివ, శ్రీజో ఇలా చాలా మందిని ఇంపోర్ట్ చేశాం. శివకు ఈ సినిమా మంచి పేరు తీసుకు రావాలి" అని కోన వెంకట్ పేర్కొన్నారు.

"మార్చి 22న శ్రీ విష్ణు ఓం భీం బుష్ రిలీజ్ అవుతోంది. మా సినిమా కూడా అప్పుడే వస్తోంది. అయినా కూడా మా ఈవెంట్‌కు వచ్చిన శ్రీ విష్ణుకి థాంక్స్. ఇలాంటి వారి వల్లే ఇండస్ట్రీ చాలా హెల్దీగా ఉంటుంది. ప్రేక్షకులందరూ మా సినిమాను చూసి ఆదరించండి" అని కోన వెంకట్ తన స్పీచ్ ముగించారు.

WhatsApp channel