Shivaji Passed Away: ప్రముఖ తమిళ నటుడు ఆర్ఎస్ శివాజీ కన్నుమూత - ఆయన నటించిన తెలుగు సినిమాలు ఎవంటే?
Shivaji Passed Away:ప్రముఖ తమిళ నటుడు ఆర్ఎస్ శివాజీ శనివారం కన్నుమూశాడు. కమల్‌హాసన్ హీరోగా నటించిన పలు సినిమాల్లో ఆర్ఎస్ శివాజీ కమెడియన్‌గా. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు.
Shivaji Passed Away: ప్రముఖ తమిళ నటుడు, కమల్‌హాసన్ సన్నిహితుడు ఆర్ఎస్ శివాజీ (66) శనివారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. తమిళంలో వందకుపైగా సినిమాల్లో నటించారు ఆర్ఎస్ శివాజీ.
కమల్ సినిమాల్లోనే…
అగ్ర నటుడు కమల్‌హాసన్‌తో శివాజీకి చక్కటి స్నేహసంబంధాలున్నాయి.ఆ సాన్నిహిత్యంతోనే కమల్‌హాసన్ సినిమాల్లోనే ఎక్కువగా కనిపించేవారు శివాజీ. కమల్‌హాసన్ హీరోగా నటించిన విక్రమ్, సత్య, అపూర్వ సగోదరగళ్, మైఖేల్ మదన కామరాజు, గుణ, చాచి 420, అన్బేశివంతో పాటు పలు సినిమాల్లో శివాజీ కామెడీ ప్రధాన పాత్రల్లో నటించాడు. ఈ సినిమాలన్నీ తెలుగులోనూ అనువాదమై శివాజీకి మంచి పేరుతెచ్చిపెట్టాయి.
జగదేకవీరుడు అతిలోక సుందరి…
చిరంజీవి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు ఆర్ఎస్ శివాజీ. మాలోకం అనే కానిస్టేబుల్ పాత్రలో నటించాడు. ఈ సినిమాతో పాటు తేజ దర్శకత్వంలో రూపొందిన 100 అబద్దాలు సినిమాలో శివాజీ కీలక పాత్రలో కనిపించాడు. తెలుగులో ఈ రెండు సినిమాలు మాత్రమే చేశారు శివాజీ. గత ఏడాది సాయిపల్లవి హీరోయిన్‌గా తెరకెక్కిన గార్గి సినిమాలో ఆమె తండ్రి పాత్రలో శివాజీ నటనకు ప్రశంసలు దక్కాయి.
సినిమాలతో పాటు కొన్ని టీవీ సీరియల్స్‌లో శివాజీ కీలక పాత్రలు పోషించాడు. టైమ్ ఎన్న బాస్ అనే వెబ్‌సిరీస్‌లో ముఖ్య పాత్రలో శివాజీ తన నటనతో మెప్పించాడు. శివాజీ మరణంతో కోలీవుడ్‌లో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆర్ఎస్ శివాజీ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ శివాజీ సోదరుడు సంతాన భారతి తమిళంలో అగ్ర దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతోన్నాడు.
టాపిక్