OTT Thriller: ఓటీటీలోకి త‌మిళ్ థ్రిల్ల‌ర్ మూవీ - భార్య మొబైల్‌లో స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే?-kollywood thriller movie athomugam will be premiere on aha tamil ott from january 10th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thriller: ఓటీటీలోకి త‌మిళ్ థ్రిల్ల‌ర్ మూవీ - భార్య మొబైల్‌లో స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే?

OTT Thriller: ఓటీటీలోకి త‌మిళ్ థ్రిల్ల‌ర్ మూవీ - భార్య మొబైల్‌లో స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే?

Nelki Naresh Kumar HT Telugu
Jan 09, 2025 06:05 AM IST

OTT Thriller: త‌మిళ్ థ్రిల్ల‌ర్ మూవీ అథోముగం థియేట‌ర్ల‌లో రిలీజైన తొమ్మిది నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. జ‌న‌వ‌రి 10 నుంచి ఆహా త‌మిళ్‌ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. అథోముగం సినిమాలో సిద్ధార్థ్‌, చైత‌న్య ప్ర‌తాప్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్నారు.

ఓటీటీ థ్రిల్లర్
ఓటీటీ థ్రిల్లర్

OTT Thriller: త‌మిళ థ్రిల్ల‌ర్ మూవీ అథోముగం ఓటీటీలోకి వ‌స్తోంది. జ‌నవ‌రి 10 నుంచి (శుక్ర‌వారం) ఆహా త‌మిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ త‌మిళ మూవీ రెంట‌ల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా త‌మిళ్ ఓటీటీలో మాత్రం ఫ్రీస్ట్రీమింగ్ రూపంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. థియేట‌ర్ల‌లో రిలీజైన దాదాపు తొమ్మిది నెల‌ల త‌ర్వాత అథోముగం సినిమా ఓటీటీలోకి వ‌స్తోంది.

yearly horoscope entry point

గ‌త ఏడాది థియేట‌ర్ల‌లో రిలీజ్‌...

అథోముగం సినిమాలో ఎస్‌పి సిద్ధార్థ్‌, చైత‌న్య ప్ర‌తాప్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. అనంత్ నాగ్‌, అరుణ్ పాండియ‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సిద్ధార్థ్ దేవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ గ‌త ఏడాది మార్చి 1న థియేట‌ర్ల‌లో రిలీజైంది.

మిక్స్‌డ్ టాక్‌...

స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన అథోముగం మూవీ థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ సినిమాతోనే సిద్ధార్థ్‌, చైత‌న్య‌ప్ర‌తాప్ హీరోహీరోయిన్లుగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. త‌మిళంతో పాటు మ‌ల‌యాళంలో ఒకే రోజు ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది.

స్పై యాప్‌...

ఆధునిక సాంకేతిక‌త మ‌నుషుల‌ను ఎలా ప్ర‌మాదంలో ప‌డేస్తుంద‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ దేవ్ ఈ క‌థ‌ను రాసుకున్నాడు. మార్టిన్ (సిద్ధార్థ్‌) లీనా(చైత‌న్య ప్ర‌తాప్‌) ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. సిద్ధార్థ్ ఓ టీ ఎస్టేట్‌లో ప‌నిచేస్తుంటాడు. వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా లీనాను స‌ర్‌ప్రైజ్ చేయాల‌ని సిద్ధార్థ్ అనుకుంటాడు. భార్య మొబైల్‌లో ఆమెకు తెలియ‌కుండా హిడెన్ ఫేస్ అనే స్పై యాప్‌ను డౌన్‌లోడ్ చేస్తాడు.

ఆ యాప్ ద్వారా లీలా ఏం చేస్తుంది? ఎక్క‌డికి వెళుతుంద‌నే విష‌యాల్ని సిద్ధార్థ్ తెలుసుకుంటూ ఉంటాడు. ఆ యాప్ కార‌ణంగా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితం చిక్కుల్లో ప‌డుతుంది. భార్య‌కు సంబంధించిన ఓ షాకింగ్ నిజం సిద్ధార్థ్‌కు తెలుస్తుంది? అదేమిటి? లీలా స‌మ‌స్య‌ల వ‌ల‌యంలో ఎలా చిక్కుకుంది? భార్య‌ను అనుమానించిన సిద్ధార్థ్ చివ‌ర‌కు ఏం చేశాడు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ఐఎమ్‌డీబీలో...

అథోముగం సినిమాకు మ‌ణికంద‌న్ ముర‌ళి, స‌ర‌ణ్ రాఘ‌వ‌న్ మ్యూజిక్ అందించారు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 7 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. అగ్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ఈ సినిమాను త‌మిళంలో రిలీజ్ చేసింది. కాన్సెప్ట్‌, యాక్టింగ్ బాగున్నా...స్క్రీన్‌ప్లేలో ఆస‌క్తి లోపించ‌డం, కొత్త న‌టీన‌టుల కార‌ణంగా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ యావ‌రేజ్‌గా నిలిచింది.

Whats_app_banner