Ajith Hospitalized: హాస్పిటల్‌లో చేరిన కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ - ఆందోళనలో ఫ్యాన్స్
Ajith Hospitalized: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హాస్పిటల్‌లో చేరినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయన జాయిన్ అయినట్లు సమాచారం.
Ajith Hospitalized: కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ హాస్పిటల్‌లో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో గురువారం అజిత్ చేరిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. అజిత్ హాస్పిటల్ పాలవ్వడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అజిత్‌కు ఏమైందోనని ఫ్యాన్స్ కంగారు పడుతోన్నారు. అజిత్ కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే అజిత్ ప్రైవేట్ హాస్పిటల్‌కు వచ్చినట్లు తెలిసింది. డాక్టర్ల చెకప్‌లో కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడైందని చెబుతున్నారు. డాక్టర్ల సూచన మేరకు అజిత్ హాస్పిటల్‌లో జాయిన్ అయినట్లు చెబుతోన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అజిత్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
అవన్నీ పుకార్లే...
అజిత్ అనారోగ్య సమస్యలంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన సన్నిహిత వర్గాలు కొట్టిపడేశాయి. అజిత్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్ కోసం త్వరలోనే విదేశాలకు వెళ్లబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మెడికల్ ఫార్మాలిటీస్‌ను కంప్లీట్ చేయడానికే అజిత్ హాస్పిటల్‌కు వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతోన్నారు. ఈ ఫార్మాలిటీస్ పూర్తయిన వెంటనే అజిత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారని అంటున్నారు. ఈ పుకార్లను అభిమానులు నమ్మవద్దని ఆయన టీమ్ తెలిపింది.
అరవై కోట్లకు ఓటీటీ రైట్స్…
ప్రస్తుతం అజిత్ విదా ముయార్చి సినిమా చేస్తోన్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.షూటింగ్ పూర్తికాకముందే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. దాదాపు 60 కోట్లకు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం.
అజిత్...త్రిష...
విదా ముయార్చిలో అజిత్‌కు జోడీగా త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. అజిత్, త్రిష కోలీవుడ్‌లో సూపర్ హిట్ కాంబోగా పేరుతెచ్చుకున్నారు. వీరిద్దరి కలయికలో ఇప్పటివరకు ఆరు సినిమాలొచ్చాయి. చివరగా అజిత్, త్రిష కలిసి 2015లో ఎన్నై అరిందాళ్ అనే సినిమా చేశారు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత విదా మూయార్చి కోసం మళ్లీ జోడీకట్టబోతున్నారు.
105 కోట్ల రెమ్యునరేషన్...
విదా ముయార్చి కోసం అజిత్ 105 కోట్ల రెమ్యునరేషన్ స్వీకరించినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీతో సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల్లో ఒకరిగా అజిత్ నిలిచాడు. కోలీవుడ్‌లో రజనీకాంత్, విజయ్ తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా అజిత్ నిలిచాడు.
అజిత్ హీరోగా నటిస్తోన్న 63వ సినిమా ఇది. తొలుత ఈ సినిమాను విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కించాలని భావించారు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. కానీ అజిత్ ఇమేజ్‌కు తగ్గ కథ సిద్ధం చేయడంలో విఘ్నేష్ విఫలం కావడంతో అనౌన్స్‌మెంట్‌తోనే సినిమా ఆగిపోయింది. విఘ్నేష్ శివన్ స్థానంలో మాగిజ్ తిరుమేనికి దర్శకుడిగా అజిత్ అవకాశం ఇచ్చారు.
రెజీనా మెయిన్ రోల్...
విదా మూయార్చి సినిమాలో రెజీనా, అర్జున్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అనిరుధ్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. గత ఏడాది తునివు సినిమా చేశాడు అజిత్. బ్యాంక్ రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.