OTT Thriller: ఈ కోలీవుడ్ థ్రిల్లర్ మూవీ టైటిల్ 54321 - థియేటర్లలో రిలీజైన తొమ్మిదేళ్ల తర్వాత ఓటీటీలోకి!
OTT Thriller: తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 54321 థియేటర్లలో విడుదలైన తొమ్మిదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో 99 రూపాయల రెంటల్‌తో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కోలీవుడ్ మూవీలో ఆర్విన్, షబ్బీర్, పవిత్రా గౌడ హీరోహీరోయిన్లుగా నటించారు.
OTT Thriller: తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 54321 థియేటర్లలో రిలీజైన తొమ్మిదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయల రెంటల్‌తో మేకర్స్ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు.
హాలీవుడ్ మూవీ స్ఫూర్తి...
ఈ థ్రిల్లర్ మూవీలో ఆర్విన్, షబ్బీర్, పవిత్రా గౌడ, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. రాఘవేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించాడు. వెరైటీ టైటిల్‌తో అప్పట్లో కోలీవుడ్ ఆడియెన్స్‌లో ఈ మూవీ క్యూరియాసిటీని కలిగించింది. ఐదుగురు వ్యక్తులు, నాలుగు కథలు, మూడు హత్యలు, రెండు గంటలు ఒక రివేంజ్ అంటూ మేకర్స్ టైటిల్‌కు జస్టిఫికేషన్ ఇచ్చారు.
హాలీవుడ్ మూవీ బబేల్ స్ఫూర్తితో దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఐడియా కొత్తగా ఉన్నా ప్రజెంటేషన్‌లో దర్శకుడు తడబడటంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఐఎమ్‌డీబీలో 5.8 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
54321 కథ ఇదే...
విక్రమ్, వినోద్ అన్నదమ్ములు. వినోద్‌పై తల్లిదండ్రులు అంతులేని ప్రేమను కురిపిస్తుంటారు. దాంతో విక్రమ్‌లో అసూయద్వేషాలు మొదలవుతాయి. సోదరుడితో పాటు తల్లిదండ్రులపై పగను పెంచుకుంటాడు. విక్రమ్ పగ ఎలాంటి పరిణామాలకు దారితీసింది? రెండు గంటల్లో మూడు హత్యలు ఎవరు చేశారు? విక్రమ్...వినోద్‌లలో ఎవరు ఎవరిపై ప్రతీకారం తీర్చుకున్నారన్నదే ఈ మూవీ కథ.
పిజ్జా అసిస్టెంట్ డైరెక్టర్...
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన పిజ్జా మూవీకి రాఘవేంద్ర ప్రసాద్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ అనుభవంతోనే కేవలం రెండు గంటల నిడివితో ప్రయోగాత్మకంగా 54321 మూవీ తెరకెక్కించాడు. ఈ మూవీకి జోష్వా శ్రీధర్ మ్యూజిక్ అందించాడు.
నాగార్జున నా సామిరంగ
54321లో హీరోగా నటించిన షబ్బీర్....నాగార్జున నా సామిరంగ మూవీలో విలన్‌గా కనిపించాడు. ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తమిళంలో 54321తో పాటు పేట్, ది రోడ్, సర్పాట్ట పరంపరై లాంటి సినిమాలు చేశాడు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోతా మూవీలో నెగెటివ్ షేడ్ క్యారెక్టర్ చేశాడు.