Thriller OTT: ఓటీటీలోకి కోలీవుడ్ హైపర్‌లింక్ థ్రిల్లర్ మూవీ - నాలుగు కథలు..మైండ్‌బ్లాక్ ట్విస్ట్‌లతో..
Thriller OTT: తమిళ థ్రిల్లర్ మూవీ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. జనవరి 17 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. నాలుగు కథలతో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో భరత్, అభిరామి, పవిత్రా లక్ష్మి కీలక పాత్రల్లో నటించారు.
Thriller OTT: తమిళ థ్రిల్లర్ మూవీ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్ ఓటీటీలోకి వస్తోంది. హైపర్‌లింక్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈమూవీలో భరత్, అభిరామి, పవిత్రా లక్ష్మి, అంజలి నాయర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ సినిమాకు ప్రసాద్ మురుగన్ దర్శకత్వం వహించాడు. డిసెంబర్ సెకండ్ వీక్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. మోస్తారు వసూళ్లను మాత్రమే రాబట్టింది.

ఆహా ఓటీటీలో...
వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్ ఓటీటీలోకి వస్తోంది. జనవరి 17 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. ఈ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది.
డైరెక్టర్ కన్ఫ్యూజన్...
వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్ సినిమా కాన్సెప్ట్, భరత్‌తో పాటు ప్రధాన పాత్ర ధారుల యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. దర్శకుడికి ఇదే తొలి సినిమా కావడంతో అనుభవలేమి కారణంగా హైపర్‌లింక్ కాన్సెప్ట్‌ను కన్ఫ్యూజన్స్ లేకుండా చెప్పడంలో తడబడటంతో ఆశించిన స్థాయిలో ఈ మూవీ విజయాన్ని సాధించలేకపోయింది.
నాలుగు కథలతో…
ఓ గన్ కొందరి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పిందనే కాన్సెప్ట్‌తో దర్శకుడు ప్రసాద్ మురుగన్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్ సినిమాను రూపొందించాడు. రాజా (భరత్) భార్య అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆమె ట్రీట్‌మెంట్ కోసం భారీగా డబ్బు అవసరమవుతుంది. ఆ డబ్బు కోసం క్రైమ్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతాడు రాజ్. లోన్ ఏజెంట్ బారి నుంచి తన కూతురిని కాపాడుకోవాలని సావిత్రి (అభిరామి) ఫిక్సవుతుంది. ఇందుకోసం ఆమె ఏం చేసింది అన్నది మరో కథ.
తన కూతురు అనిత (పవిత్రా లక్ష్మి) మరో కులం వ్యక్తిని ప్రేమించడం ఓ తండ్రికి నచ్చదు. కూతురి ప్రేమను అపార్థం చేసుకున్న తండ్రి ఏం చేశాడన్నది తలవాసల్ విజయ్ ట్రాక్ ద్వారా దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు. మది (అంజలి నాయర్) తన భర్తపై రివేంజ్ తీర్చుకోవాలని ఎందుకు అనుకున్నది, ఆమెకు గన్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఇంకో కథ. మొత్తం నాలుగు కథల్ని ఒకదానికొకటి లింక్ చేస్తూ దర్శకుడు వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్ సినిమాను తెరకెక్కించారు.