OTT Horror: ఓటీటీలోకి వస్తోన్న కోలీవుడ్ హారర్ ఫాంటసీ మూవీ - ఐఎమ్‌డీబీలో 8.4 రేటింగ్
OTT Horror: తమిళ్ హారర్ మూవీ ఆరగన్ ఓటీటీలోకి వస్తోంది. జనవరి 3 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ హారర్ మూవీలో మైఖేల్ తంగదురై, కవిప్రియ మనోహరన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.4 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
OTT Horror: తమిళ్ మూవీ ఆరగన్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. హారర్ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 3 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది.థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకివస్తోంది.
థియేటర్లలో రిలీజ్...
ఆరగన్ మూవీలో మైఖేల్ తంగదురై, కవిప్రియ మనోహరన్, శ్రీరంజని కీలక పాత్రల్లో నటించారు. ఆరుణ్ కేఆర్ దర్‌శకత్వం వహించారు. అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ హారర్ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
కాన్పెప్ట్ డిఫరెంట్‌గా ఉన్న డైరెక్టర్ అనుభవలేమి కారణంగా ఆడియెన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ట్విస్ట్‌లతో పాటు ముఖైల్, కవి ప్రియ కెమిస్ట్రీ బాగుందనే కామెంట్స్ వినిపించాయి. మాత్రం బాగున్నాయనే కామెంట్స్ వినిపించాయి. ఐఎమ్‌డీబీలో ఆరగన్ మూవీ 8.4 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
హిల్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో...
ఓ హిల్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు అరుణ్ కేఆర్ ఆరగన్ మూవీని తెరకెక్కించాడు. శరవణన్ (మైఖేల్ తంగదురై), మాగిజిని (కవిప్రియ) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. హిల్ స్టేషన్‌లో శరవణన్‌కు జాబ్ వస్తుంది. జాబ్ కోసం అక్కడకి వెళ్లిన కొత్త జంటకు అక్కడ అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి. అవేమిటి?
సెల్‌ఫోన్ సిగ్నల్న్ కూడా అందుబాటులోని ఓ ప్లేస్‌లో మాగిజిని ఎందుకు బందీగా మారుతుంది? ఆమెను బందీని చేసింది ఎవరు? భర్త శరవణన్ గురించి మాగిజినికి ఎలాంటి నిజాలు తెలిశాయి? ఆ హిల్ స్టేషన్ నుంచి ఆమె ప్రాణాలతో ఎలా బయటపడింది అనే పాయింట్‌తో ఆరగన్ మూవీ తెరకెక్కింది.
డ్యాన్సర్‌గా..
డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన మైఖేల్ తంగదురై ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తమిళంలో కనిమోళి, బర్మా, సభానాయగన్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. ఆరగన్ దర్శకుడిగా అరుణ్‌కు ఫస్ట్ మూవీ. చిన్న సినిమాగా రిలీజైన ఆరగన్ మోస్తారు వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఆరగన్ మూవీకి వివేక్‌జస్వంత్ మ్యూజిక్ అందించాడు.