Tollywood: టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న కోలీవుడ్ డైరెక్టర్ కొడుకు - మూవీ టైటిల్ ఇదే...
Tollywood: కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. కలవరం పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. రొమాంటిక్ లవ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ శనివారం అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది.
Tollywood: కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. కలవరం పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. ఈ సినిమాలో విజయ్ కనిష్కకు జోడీగా గరిమ చౌహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ లవ్ థ్రిల్లర్ మూవీకి శశాంక్ కథని అందించగా హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వం వహిస్తోన్నాడు. దేవిశ్రీ ప్రసాద్ దగ్గర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తోన్న వికాస్ బాడిస మ్యూజిక్ అందిస్తోన్నాడు.
శనివారం లాంఛ్...
కలవరం మూవీ శనివారం హైదరాబాద్‌లో లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలకు నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
హిట్ లిస్ట్ తర్వాత...
ఈ సందర్భంగా విజయ్ కనిష్క మాట్లాడుతూ “మా నాన్న విక్రమన్ తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో వసంతం, చెప్పవే చిరుగాలి సినిమాలు చేశారు. హీరోగా ఇదివరకు హిట్‌లిస్ట్ అనే మూవీ చేశా. తెలుగులోనూ డబ్ అయిన ఈ మూవీ చక్కటి ఆదరణను సొంతం చేసుకున్నది. కలవరం హీరోగా నన్ను మరో మెట్టు ఎక్కిస్తుందనే నమ్మకముంది. లవ్, థ్రిల్లర్, రొమాన్స్‌తో పాటు కమర్షియల్ హంగులన్నీ ఉంటాయి” అని అన్నాడు.
ప్రభుత్వం ఆదుకోవాలి...
బాలచందర్, భాగ్య రాజా వంటి క్రియేటివ్ డైరెక్టర్స్ తీయగలిగే మంచి స్కోప్ కథ ఉన్న కథతో ఈ మూవీ తెరకెక్కుతోందని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటిదాకా చిన్న సినిమాలను పట్టించుకున్న ప్రభుత్వం లేదని చదలవాడ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పుడున్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలైన చిన్న సినిమాలకు తోడ్పాటు కల్పిస్తూ లిమిటెడ్ బడ్జెట్ మూవీస్‌కు షోలు ఎక్కువ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని చదలవాడ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇప్పటివరకు తెలుగు తెరపై వచ్చిన లవ్‌స్టోరీస్‌కు భిన్నంగా కలవరం మూవీ సాగుతుందని దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి అన్నారు.
పుష్ప ఫేమ్...
నిర్మాత శోభారాణి గారు మాట్లాడుతూ “కలవరం అనే టైటిల్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ చిత్రంలో 70 మంది ఆర్టిస్టులు ఉన్నారు. వారి గురించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం” అని తెలిపారు.ఈ సినిమాలో పుష్ప ఫేమ్ రాజ్ తిరందాసు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
విజయ్, సూర్య
విక్రమన్ తమిళంలో దర్శకుడిగా విజయ్ కాంత్, కార్తీక్ నుంచి దళపతి విజయ్, సూర్య వరకు కోలీవుడ్ అగ్ర హీరోలందరితో సినిమాలు చేశాడు. తెలుగులో వెంకటేష్ వసంతం, వేణు చెప్పవే చిరుగాలి సినిమాలకు దర్శకత్వం వహించాడు. అతడు దర్శకత్వం వహించిన సూర్యవంశంతో పాలు పలు తమిళ సినిమాలు తెలుగులోకి రీమేక్ అయ్యాయి.