Crime Comedy OTT: ఓటీటీలోకి వ‌చ్చిన కోలీవుడ్ క్రైమ్ కామెడీ సీక్వెల్ మూవీ - రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌-kollywood crime thriller sequel movie soodhu kavvum 2 streaming now on amazon prime video and aha tamil ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Crime Comedy Ott: ఓటీటీలోకి వ‌చ్చిన కోలీవుడ్ క్రైమ్ కామెడీ సీక్వెల్ మూవీ - రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌

Crime Comedy OTT: ఓటీటీలోకి వ‌చ్చిన కోలీవుడ్ క్రైమ్ కామెడీ సీక్వెల్ మూవీ - రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 14, 2025 10:04 AM IST

Crime Comedy OTT: లేటెస్ట్ త‌మిళ్‌ సీక్వెల్ మూవీ సూదుక‌వ్వం 2 ఓటీటీలోకి వ‌చ్చింది. క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా త‌మిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సూదుక‌వ్వం 2 మూవీలో మిర్చి శివ హీరోగా న‌టించాడు.

క్రైమ్ కామెడీ ఓటీటీ
క్రైమ్ కామెడీ ఓటీటీ

Crime Comedy OTT: విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించిన త‌మిళ మూవీ సూదు క‌వ్వం క్రైమ్ కామెడీ జాన‌ర్‌లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీకి సూదు క‌వ్వం 2 పేరుతో సీక్వెల్ వ‌చ్చింది. ఈ సీక్వెల్ మూవీలో మిర్చి శివ హీరోగా న‌టించాడు. క‌రుణాక‌ర‌ణ్‌, హ‌రీషా, రాధార‌వి కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎస్‌జే అర్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

yearly horoscope entry point

మిక్స్‌డ్ టాక్‌...

థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న సూదుక‌వ్వం 2 మూవీ తాజాగా ఓటీటీలోకి వ‌చ్చింది. ఒకే రోజు రెండు ఓటీటీల‌లో రిలీజైంది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా త‌మిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

కామెడీ...ట్విస్ట్‌లు...

పొలిటిక‌ల్ అంశాల‌కు క్రైమ్ కామెడీ ఎలిమెంట్స్ జోడించి ద‌ర్శ‌కుడు ఎస్‌జే అర్జున్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. సూదుక‌వ్వం 2 మూవీకి ఎడ్విన్ లూయిస్ విశ్వ‌నాథ్‌, హ‌రి ఎస్ఆర్ మ్యూజిక్ అందించారు. సూదుక‌వ్వం స్థాయిలో సీక్వెల్ విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. కామెడీతో పాటు ట్విస్ట్‌లు పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం సీక్వెల్‌కు మైన‌స్‌గా మారింది. డిసెంబ‌ర్ 13న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ స‌రిగ్గా నెల రోజుల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది.

విజ‌య్ సేతుప‌తి...

సూదుక‌వ్వం సీక్వెల్‌లో విజ‌య్ సేతుప‌తితో పాటు ఫ‌స్ట్ పార్ట్‌లో న‌టించిన అశోక్ సెల్వ‌న్‌, ర‌మేష్ తిల‌క్‌, బాబీ సింహా, సంచితా శెట్టి గెస్ట్ రోల్స్‌లో క‌నిపించారు.

ఫైనాన్స్ మినిస్ట‌ర్ కిడ్నాప్‌...

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అక్ర‌మ మార్గాల్లో విజ‌యాన్ని సాధించి తిరిగి అధికారంలోకి రావాల‌ని స్టేట్ ఫైనాన్స్ మినిస్ట‌ర్ (క‌రుణాక‌ర‌ణ్‌) ప్లాన్స్ వేస్తాడు. కానీ గురునాథ్ అలియాస్ గురు (మిర్చి శివ‌) వ‌ల్ల అత‌డి ప్లాన్ మొత్తం రివ‌ర్స్ అవుతుంది. ఫైనాన్స్ మినిస్ట‌ర్‌ను గురు గ్యాంగ్ ఎందుకు కిడ్నాప్ చేశారు? ఫైనాన్స్ మినిస్ట‌ర్‌పై గురు ప‌గ‌తో ర‌గిలిపోవ‌డానికి కార‌ణం ఏమిటి? మినిస్ట‌ర్ అక్ర‌మాల్ని గురు గ్యాంగ్ ఎలా బ‌య‌పెట్టారు అన్న‌దే సూద క‌వ్వం మూవీ క‌థ‌.

రెడీయో జాకీగా...

రేడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించిన మిర్చి శివ ఆ త‌ర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చెన్నై 600028, తామిజ్ పాదం, క‌ళాక‌ల‌ప్పుతో పాటు ప‌లు కామెడీ సినిమాల‌తో విజ‌యాల్ని అందుకున్నాడు. హీరోగానే కాకుండా రైట‌ర్‌గా, లిరిసిస్ట్‌, సింగ‌ర్‌గా త‌న టాలెంట్‌ను నిరూపించుకున్నాడు.

Whats_app_banner