OTT Telugu Web Series: ఓటీటీలోకి మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ట్రైలర్ రిలీజ్-kobali web series ott release date telugu crime revenge thriller web series to stream on hotstar from 4th february ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Web Series: ఓటీటీలోకి మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ట్రైలర్ రిలీజ్

OTT Telugu Web Series: ఓటీటీలోకి మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ట్రైలర్ రిలీజ్

Hari Prasad S HT Telugu
Jan 17, 2025 04:36 PM IST

OTT Telugu Web Series: ఓటీటీలోకి మరో తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు కోబలి. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేస్తూ.. శుక్రవారం (జనవరి 17) మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఓటీటీలోకి మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలోకి మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ట్రైలర్ రిలీజ్

OTT Telugu Web Series: తెలుగులో మరో ఇంట్రెస్టింగ్ రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. చాలా రోజుల కిందటే ఈ సిరీస్ ను అనౌన్స్ చేసిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ శుక్రవారం (జనవరి 17) ట్రైలర్ రిలీజ్ చేసింది. అంతేకాదు స్ట్రీమింగ్ తేదీని కూడా వెల్లడించింది. రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే వార్ గా ఈ సిరీస్ ఉండబోతోందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ప్రముఖ నటుడు రవిప్రకాశ్ లీడ్ రోల్లో నటిస్తున్న సిరీస్ ఇది.

కోబలి వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్

కోబలి పేరుతో ఒకప్పుడు పవన్ కల్యాణ్ మూవీ తెరకెక్కాల్సిన ఉన్నా.. తర్వాత అటకెక్కిన విషయం తెలుసు కదా. ఇప్పుడదే పేరుతో ఓ రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెలుగులో రానుంది. ఈ వెబ్ సిరీస్ ను ఫిబ్రవరి 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేయనుంది.

రవిప్రకాశ్, శ్యామల, రాకీ సింగ్, జబర్దస్త్ నవీన్, యోగి ఖత్రిలాంటి వాళ్లు నటించారు. రేవంత్ లెవక డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ శుక్రవారం (జనవరి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కోబలి ట్రైలర్ ఎలా ఉందంటే?

కోబలి వెబ్ సిరీస్ ట్రైలర్ కేవలం ఒక నిమిషం 27 సెకన్లు మాత్రమే ఉంది. ఈ ట్రైలర్ రవిప్రకాశ్ వాయిస్ ఓవర్ తో మొదలువుతుంది. "ఏ పురాణం సదివినా.. ఏ కథిన్నా.. అన్నిట్ల స్వార్థం, ద్వేషం.. వీటి వల్లే యుద్ధాలు జరిగినయ్.. రాజులంతా సంకనాకిపోయిన్రు.. అయినా నెత్తికెక్కలే.. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే పంచాయితీ" అంటూ రవిప్రకాశ్ వాయిస్ సాగుతుండగా.. రెండు గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది.

ఇక ఆ తర్వాత ట్రైలర్ మొత్తం వయోలెన్స్, బూతు డైలాగులతో సాగిపోయింది. బ్యాక్‌గ్రౌండ్లో బలి.. బలి.. బలి.. అంటూ సాగే ఇంటెన్స్ మ్యూజిక్ ఈ ట్రైలర్ లో హైలైట్ గా నిలుస్తోంది. ఇదో రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా కనిపిస్తోంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో వస్తున్న మరో తెలుగు వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్ ఫిబ్రవరి 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

Whats_app_banner