ఇన్‌స్టాలో కేఎల్ రాహుల్ డాటర్ ఫస్ట్ ఫొటో.. పేరు ఇదే.. అర్థం ఏమిటంటే?-kl rahul athiya shetty daughter named as ivara first photo of her in instagram goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఇన్‌స్టాలో కేఎల్ రాహుల్ డాటర్ ఫస్ట్ ఫొటో.. పేరు ఇదే.. అర్థం ఏమిటంటే?

ఇన్‌స్టాలో కేఎల్ రాహుల్ డాటర్ ఫస్ట్ ఫొటో.. పేరు ఇదే.. అర్థం ఏమిటంటే?

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్- అతియా శెట్టి దంపతులు తమ కుమార్తె ఫొటోను ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ చిన్నారి పేరును కూడా రివీల్ చేశారు. ఆ పేరు ఏమిటో? దాని అర్థం ఏమిటో? చూసేయండి.

కుమార్తెతో కేఎల్ రాహుల్, అతియా

కేఎల్ రాహుల్, అతియా శెట్టి దంపతుల కూతురు ఇన్‌స్టాగ్రామ్‌ డెబ్యూ చేసింది. ఆ చిన్నారి ఫొటోను ఈ కపుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాహుల్ ఆ పాపను ఎత్తుకుని ఉండగా.. ఆమె ముఖాన్ని ప్రేమతో చూస్తున్న అతియా స్టిల్ అదిరిపోయింది. అయితే ఆ పాప ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు. కేఎల్ రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం (ఏప్రిల్ 18) తమ పాప పేరును కూడా వీళ్లు వెల్లడించారు.

పాప పేరు ఇదే

కేఎల్ రాహుల్, అతియా తమ పాపకు ‘ఇవారా’ అనే పేరు పెట్టారు. ‘మా చిన్నారి పాప. మా సర్వస్వం. ఇవారా.. దేవుని బహుమతి’ అని వీళ్లు ఫొటోతో పాటు చిన్నారి పేరును ఇన్‌స్టాగ్రామ్‌లొ అనౌన్స్ చేశారు. ఇవారా అంటే దేవుని బహుమతి అని అర్థం. మార్చి 24న కేఎల్ రాహుల్-అతియా దంపతులకు పాప జన్మించిన సంగతి తెలిసిందే. భార్య డెలివరీ కోసం ఐపీఎల్ 2025 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ కు కేఎల్ రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే.

సెలబ్రిటీల రియాక్షన్

పాప ఫొటోతో ఉన్న పోస్టుకు, క్రీడా సినీ సెలబ్రిటీలు రియాక్టవుతున్నారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, సినిమా రంగం నుంచి వాణీ కపూర్, సమంత, అనుష్క శర్మ, మలైకా అరోరా కామెంట్లు పెట్టారు. హార్ట్ ఎమోజీలు పోస్టు చేశారు.

ఆ పోస్ట్ తో

కొంతకాలం డేటింగ్ తర్వాత కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లితో ఒకటయ్యారు. ఈ జోడీ జనవరి 23, 2023న పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ అగ్ర నటుడు సునీల్ శెట్టి కూతురే అతియా శెట్టి. అతియా ప్రెగ్నెన్సీ విషయాన్ని 2024లో అనౌన్స్ చేశారు. ఈ ఏడాది మార్చిలో వీళ్లకు పాప పుట్టింది. అప్పుడు అతియా రెండు హంసల చిత్రాన్ని పోస్ట్ చేసి బేబీ గర్ల్ పుట్టిందని పోస్ట్ చేసింది.

గర్వంగా తాత

ఇటీవల అతియా తండ్రి సునీల్ శెట్టి తన మనవరాలి గురించి లింక్డ్ఇన్ పోస్ట్‌లో రాశారు. "జీవితం ఎలా పనిచేస్తుందో అనేది సరదాగా ఉంటుంది. సంతోషంగా ఉంచుతాయనే విషయాల కోసం ఏళ్లుగా వెతుకుతూనే ఉంటారు. సరైన పాత్ర, సరైన ఒప్పందాలు, పెద్ద కార్యాలయం, ఎక్కువ డబ్బు, పరిపూర్ణ రీఎంట్రీ, ఎక్కువ గుర్తింపు. కానీ నిజమైన ఆనందం సింపుల్ విషయాల నుంచే వస్తుంది.

"ఇటీవల తాతయ్య కావడం అనేది నేను వివరించలేని అనుభూతి. దీనికి ప్రపంచంలో ఏదీ సాటిరాదు. దీన్ని ఏదీ తాకలేదు. సినిమాలు తీయడం, వ్యాపారం నెలకొల్పడం కోసం దశాబ్దాలుగా కష్టపడ్డా. అందుకు గర్వపడుతున్నా. కానీ నా మనవరాలి చేతి వేలు పట్టుకున్నప్పుడు అవేవీ అసలు ముఖ్యం కాదనే తెలిసింది’’ అని సునీల్ శెట్టి పేర్కొన్నారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం