KL Rahul Athiya Shetty: కేఎల్ రాహుల్‌కు ప్రమోషన్.. తండ్రయిన స్టార్ క్రికెటర్.. పాప పుట్టిందంటూ పోస్ట్
KL Rahul Athiya Shetty: కేఎల్ రాహుల్, అతియా శెట్టి జంటకు పాప జన్మించింది. ఈ విషయాన్ని వీళ్లు సోమవారం (మార్చి 24) సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. ఈ కారణంగా రాహుల్ ఐపీఎల్లో లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
KL Rahul Athiya Shetty: క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి పేరెంట్స్ గా ప్రమోషన్ పొందారు. గతేడాది తాను ప్రెగ్నెంట్ అని చెప్పిన అతియా.. తాజాగా సోమవారం (మార్చి 24) పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వీళ్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
రాహుల్, అతియా.. ఓ పాప
బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అతియా శెట్టి, టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కు పాప పుట్టింది. బ్లెస్డ్ విత్ ఎ బేబీ గర్ల్ అంటూ ఈ జంట తమ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. రెండు హంసలు ఉన్న ఓ పెయింటింగ్ ను పోస్ట్ చేస్తూ ఈ విషయం తెలిపారు.
సోమవారం (మార్చి 24) ఈ పాప జన్మించింది. వాళ్లకు ఇదే తొలి సంతానం. ఈ పోస్టుపై అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అతియా ప్రసవానికి సిద్ధంగా ఉండటంతో ఐపీఎల్లో ఢిల్లీ, లక్నో మ్యాచ్ కు రాహుల్ దూరమయ్యాడు. ఈ కొత్త సీజన్లో అతడు లక్నోని వీడి ఢిల్లీ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
పెళ్లయిన రెండేళ్లకు..
అతియా, రాహుల్ లవ్ స్టోరీ 2019లోనే మొదలైంది. వీళ్లు ఓ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారు. తర్వాత వీళ్ల స్నేహం కాస్తా ప్రేమగా మారింది. కొన్నేళ్లపాటు డేటింగ్ చేశారు. మొత్తానికి 2023లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఖండాలాలోని సునీల్ శెట్టి ఫామ్ హౌజ్ లో వీళ్ల పెళ్లి జరిగింది. వీళ్ల పెళ్లికి కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
ఇక గతేడాది నవంబర్ లో అతియా తన తొలి ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. 2025లో తమ తొలి సంతానం రాబోతున్నట్లు ఈ జంట తెలిపింది. ఇక ఇప్పుడు పాప పుట్టినట్లు వీళ్లు అనౌన్స్ చేశారు.
ఐపీఎల్లో కేఎల్ రాహుల్
ఐపీఎల్లో కేఎల్ రాహుల్ గత మూడు సీజన్ల పాటు లక్నో సూపర్ జెయింట్స్ కు కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. అయితే గత సీజన్ తర్వాత ఆ ఫ్రాంఛైజీ అతన్ని రిటెయిన్ చేసుకోలేదు. తర్వాత మెగా వేలంలో రాహుల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఈసారి కెప్టెన్సీ కూడా అతనికే దక్కుతుందని భావించినా.. అక్షర్ పటేల్ కు ఆ బాధ్యతలు అప్పగించారు.
ఐపీఎల్ కొత్త సీజన్లో భాగంగా సోమవారం (మార్చి 24) లక్నోతో ఢిల్లీ తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండబోనని ముందుగానే కేఎల్ రాహుల్ చెప్పాడు.
సంబంధిత కథనం