KL Rahul Athiya Shetty: తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్.. గుడ్ న్యూస్ షేర్ చేసిన సెలబ్రిటీ కపుల్
KL Rahul Athiya Shetty: కేఎల్ రాహుల్ తండ్రి కాబోతున్నాడు. బాలీవుడ్ నటి అతియా శెట్టిని పెళ్లి చేసుకున్న అతడు.. తమ తొలి సంతానాన్ని వచ్చే ఏడాది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లు ఓ క్యూట్ పోస్ట్ తో వెల్లడించడం విశేషం.
KL Rahul Athiya Shetty: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ ఇద్దరూ కలిసి తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ విషయం తెలిపారు. 2025లో తాను బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు అతియా తెలిపింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు, నటి అయిన అతియాను రాహుల్ గతేడాది జనవరిలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
తండ్రి కాబోతున్న రాహుల్
మరో క్రికెట్, బాలీవుడ్ జంట పేరెంట్స్ గా ప్రమోషన్ పొందబోతున్నారు. కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి తాను ప్రెగ్నెంట్ అని శుక్రవారం (నవంబర్ 8) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
"మా బ్యూటీఫుల్ బ్లెస్సింగ్ త్వరలోనే రాబోతోంది. 2025" అనే క్యాప్షన్ తోపాటు పక్కనే బుడి బుడి అడుగుల ఎమోజీతో ఆమె ఈ విషయం తెలిపింది. కింద అతియా, రాహుల్ ఇద్దరి పేర్లూ ఉన్నాయి.
రాహుల్, అతియా పెళ్లి
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి 2019లో తొలిసారి కలుసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాత వీళ్లు డేటింగ్ లో ఉండటం, చాలా రోజుల పాట ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచడం, తరచూ కలిసి ఈవెంట్స్ కు వెళ్తుండటం జరిగిపోయాయి.
గతేడాది జనవరిలో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అతియా శెట్టి ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు. రాహుల్, అతియా ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకొని ప్రేమలో పడ్డారు.
కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాలో..
కొన్నాళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. ఈ మధ్యే న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లోనూ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో కాస్త ముందుగానే ఆస్ట్రేలియా వెళ్లి ఐదు టెస్టుల సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే ఆస్ట్రేలియా ఎతో ఇండియా ఎ ఆడుతున్న అనధికారిక 4 రోజుల మ్యాచ్ లోనూ అతడు విఫలమయ్యాడు.
అతడు రెండు ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా వచ్చి.. 4, 10 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో అతడు ఔటైన విధానం కూడా విమర్శలకు దారి తీసింది. ఓ స్పిన్నర్ బౌలింగ్ లో లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని ఆడకుండా వదిలేయడంతో అది అతని కాళ్ల మధ్యలో నుంచి వెళ్లి వికెట్లను తాకింది. దీంతో రాహుల్ షాక్ తిన్నాడు.
ఈ వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండనున్నాడన్న వార్తల నేపథ్యంలో రాహుల్ తో ఓపెనింగ్ చేయించాలని టీమ్ భావిస్తోంది. అయితే ఈ వైఫల్యంతో వాళ్లు ఏం చేయబోతున్నారన్న సందేహం నెలకొంది.