అబ్బవరం ఇస్తా వరం.. అదిరిపోయిన కె ర్యాంప్ ట్రైలర్.. అటు మాస్.. ఇటు రొమాన్స్.. మధ్యలో కామెడీ-kiran abbavarams upcoming movie k ramp trailer released romantic action comedy film ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  అబ్బవరం ఇస్తా వరం.. అదిరిపోయిన కె ర్యాంప్ ట్రైలర్.. అటు మాస్.. ఇటు రొమాన్స్.. మధ్యలో కామెడీ

అబ్బవరం ఇస్తా వరం.. అదిరిపోయిన కె ర్యాంప్ ట్రైలర్.. అటు మాస్.. ఇటు రొమాన్స్.. మధ్యలో కామెడీ

కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ మూవీతో ఆడియన్స్ ను మరోసారి ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. రొమాన్స్, యాక్షన్, కామెడీ ఇలా అన్ని అంశాలతో ట్రైలర్ అదిరిపోయింది.

కె ర్యాంప్ ట్రైలర్ లో స్టిల్ (youtube)

గతేడాది ‘క’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత దిల్ రూబా అంటూ లవ్ స్టోరీ చేశాడు. ఇప్పుడు ‘కె ర్యాంప్’తో ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు వచ్చేస్తున్నాడు. ఇవాళ (అక్టోబర్ 12) రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ను తెగ అట్రాక్ట్ చేసేలా ఉంది.

కె ర్యాంప్ ట్రైలర్

కిరణ్ అబ్బవరం అప్ కమింగ్ యూత్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘కె ర్యాంప్’ ట్రైలర్ శనివారం రిలీజైంది. ఇది యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు కలగలిసిని పూర్తి కమర్షియల్ సినిమాగా అనిపిస్తోంది. ‘‘కాళ్లు ఊపకూడదు దరిద్రం’’ అని బామ్మ అంటే.. ‘‘నేను ఊపట్లేదు బామ్మ నా గర్ల్ ఫ్రెండ్ ను తలుచుకుంటే వాటికవే ఊగుతున్నాయి’’అని హీరో అనడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఎంసెట్ ఎగ్జామ్ రాయలేదంట కదా అంటే తాగి పడిపోవాల్సి వచ్చిందంటాడు.

వరమిస్తానని

కె ర్యాంప్ సినిమాలో ‘రిచెస్ట్ చిల్లర్ గాయ్’గా కుమార్ పాత్రలో కనిపించనున్నాడు కిరణ్ అబ్బవరం. తాగడం, అల్లరి చేయడం, గొడవలు చేయడం కనిపించింది ట్రైలర్ లో. అబ్బవరం ఇస్తా వరం అంటూ వెంటపడుతున్నాడని హీరోయిన్ చెప్పడం వైరల్ గా మారింది. లవ్ చేస్తే లైఫ్ ఇస్తాననే వరమిచ్చా సర్ అని అంటాడు కుమార్.

లిప్ కిస్

ట్రైలర్ మధ్యలో రొమాన్స్ కూడా అదిరిపోయింది. మధ్యలో లిప్ కిస్ కూడా ఉంది. ఆ తర్వాత హీరోయిన్ అబ్ నార్మల్ గా బిహేవ్ చేయడం.. బెదిరించి మరీ ఐలవ్యూ టూ చెప్పించుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా అలరించేలా ఉన్నాయి. చివరకు కళ్లు మింగాయా అవి కన్నీళ్లే అని కుమార్ క్యారెక్టర్ చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది. కె ర్యాంప్ ట్రైలర్ చూస్తే కిరణ్ అబ్బవరం మరోసాని తనదైన స్టైల్ కామెడీ, యాక్షన్ తో అదరగొట్టాడని తెలుస్తోంది.

కేరళ అమ్మాయితో

రిచెస్ట్ పర్సన్ కొడుకైన కుమార్ కేరళలో కాలేజీలో జాయిన్ అవుతాడు. అక్కడ మెస్సీతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత హీరోయిన్ అబ్ నార్మల్ గా బిహేవ్ చేస్తుంది. మరి చివరకు ఏమైంది? హీరోయిన్ అలా ఎందుకు ప్రవర్తిస్తుంది? లవ్ స్టోరీలో వచ్చే ట్విస్ట్ లు ఏంటో తెలుసుకోవాలంటే కె ర్యాంప్ మూవీ చూడాలి. దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఈ సినిమాతో జైన్స్ నాని డైరెక్టర్ గా డెబ్యూ చేస్తున్నాడు. చెన్నై అందం యుక్తి తరేజా హీరోయిన్. కె ర్యాంప్ మూవీలో నరేష్, సాయి కుమార్, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్, అలీ తదితరులు నటించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం