KA Movie TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ థ్రిల్లర్ చిత్రం.. టెలికాస్ట్ ఎప్పుడంటే..
KA Movie TV Premiere: ‘క’ చిత్రం థియేటర్లలో సూపర్ హిట్ అయింది. ప్రశంసలతో పాటు కమర్షియల్‍గానూ అదరగొట్టింది. ఈ థ్రిల్లర్ చిత్రం టీవీ ఛానెల్‍లో ప్రసారానికి రెడీ అయింది. టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలు ఇవే..
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. వరుసగా ప్లాఫ్‍లు ఎదుర్కొన్న కిరణ్ ఈ మూవీతో మళ్లీ సక్సెస్ బాటపట్టాడు. ‘క’ చిత్రం టైటిల్‍తోనే ఆసక్తిని పెంచేసింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గతేడాది అక్టోబర్ 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని.. ఈ చిత్రం అదరగొట్టింది. అంచనాలను మించి కలెక్షన్లను దక్కించుకుంది. క చిత్రం ఇప్పుడు టీవీ ప్రీమియర్‌కు అడుగుపెట్టబోతోంది. టెలికాస్ట్ వివరాలు వెల్లడయ్యాయి.

‘క’ టెలికాస్ట్ ఎప్పుడు..
క సినిమా ఈటీవీ ఛానెల్‍లో జనవరి 26వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. తొలిసారి ఈ చిత్రం టీవీ ఛానెల్‍లో అడుగుపెట్టనుంది. రిపబ్లిక్ డే స్పెషల్‍గా క సినిమాను ప్రసారం చేయనుంది ఈటీవీ ఛానెల్.
క చిత్రం ఇప్పటికే ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. గత నవంబర్ 28వ తేదీన ఓటీటీలోకి ఈ మూవీ వచ్చింది. ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్‍లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి మంచి వ్యూస్ దక్కాయి. జనవరి 26న ఈటీవీలో ప్రసారం కానున్న ఈ చిత్రానికి టీఆర్పీ ఏ మేరకు వస్తుందో చూడాలి.
క సినిమా కలెక్షన్లు
క సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపంది. సుమారు రూ.20 కోట్లతో ఈ చిత్రం రూపొందింది. మొత్తంగా రూ.53కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకొని సత్తాచాటింది. కిరణ్‍కు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ దక్కింది. రిలీజ్‍కు ముందు నుంచి ఈ చిత్రంపై కిరణ్ చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకు తగ్గట్టుగా ఈ మూవీ వసూళ్లలో అదరగొట్టింది. ప్రశంసలను దక్కించుకోవటంతో పాటు మంచి కలెక్షన్లను సాధించి బ్లాక్‍బస్టర్ అయింది.
క చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. కొత్త కాన్సెప్ట్, సస్పెన్స్‌ఫుల్ కథనంతో ఈ మూవీని తెరకెక్కించారు. ప్రేక్షకులను మెప్పించారు. పీరియాడిక్ విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారికా హీరోయిన్‍గా నటించారు. తన్వి రామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్‍స్లే, అజయ్, అన్నపూర్ణ, శరణ్య ప్రదీప్ కీలకపాత్రలు పోషించారు.
క మూవీని శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‍మెంట్స్, క ప్రొడక్షన్ బ్యానర్లపై చింతా గోపాలకృష్ణా రెడ్డి, వినీశ్ రెడ్డి, రాజశేఖరరెడ్డి ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి సామ్ సీఎస్ సంగీతం ఇచ్చారు. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ అయింది.
సంబంధిత కథనం