KA Movie OTT: కిరణ్ అబ్బవరం ‘క’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే..
KA Movie OTT Rights: ‘క’ చిత్రం రేపు (అక్టోబర్ 31) థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే నేటి సాయంత్రమే ప్రీమియర్ షోలు పడ్డాయి. దీంతో ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఏదో వెల్లడైంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ చిత్రంపై మంచి హైప్ నెలకొంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ క్యూరియాసిటీ పెంచింది. దీంతో అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని, కొత్తగా ఉంటుందని ప్రమోషన్ ఈవెంట్లలో కిరణ్ గట్టిగా చెప్పారు. ప్రీమియర్ షోలతోనే నేడు (అక్టోబర్ 30) క చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీపావళి సందర్భంగా రేపు (అక్టోబర్ 31) థియేటర్లలో పూర్తిస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.
‘క’ సినిమా ప్రీమియర్ షోలు పడటంతో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏ ఓటీటీ తీసుకుందో సమాచారం బయటికి వచ్చింది. శాటిలైట్ రైట్స్ సమాచారం కూడా వెల్లడైంది.
ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇదే
'క' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. అలాగే, శాటిలైట్ హక్కులను కూడా ఈటీవీ దక్కించుకుంది. మొత్తంగా ఈ చిత్రం ఓటీటీ, శాటిలైట్ రైట్స్‌ను ఈటీవీ గ్రూప్ దక్కించుకుంది.
థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత ‘క’ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇది థియేట్రికల్ రన్‍పై ఆధారపడి ఉంటుంది. ఈ మూవీకి లాంగ్ థియేట్రికల్ రన్ కొనసాగితే.. స్ట్రీమింగ్‍కు రావడం ఆలస్యం కావొచ్చు.
క సినిమా డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్ హక్కులను మొత్తంగా సుమారు రూ.10కోట్లకు ఈటీవీ గ్రూప్ దక్కించుకుందని తెలుస్తోంది. ఈ చిత్రంపై ముందు నుంచి హైప్ బాగా ఉంది. టైటిల్ నుంచి ట్రైలర్ వరకు ఈ మూవీ క్యూరియాసిటీని పెంచింది. దీంతో మంచి ధరకే ఈ సినిమా హక్కులను ఈటీవీ దక్కించుకుంది.
క సినిమాకు సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. పీరియడ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. మధ్యాహ్నమే చీకటి పడే గ్రామంలో ఈ సినిమా స్టోరీ సాగుతుంది. ఈ చిత్రంలో పోస్ట్‌మ్యాన్ పాత్ర పోషించారు కిరణ్ అబ్బవరం. ఈ మూవీలో తన్వి రామ్, నయని సారిక హీరోయిన్లుగా నటించారు. శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై చింతా గోపాలకృష్ణా రెడ్డి ఈ మూవీని నిర్మించారు. సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విశ్వాస్ డానియెల్, సతీశ్ రెడ్డి ఈ మూవీకి సినిమాటోగ్రఫీ చేయగా.. శ్రీ వరప్రసాద్ ఎడిటింగ్ చేశారు.
ఎమోషనల్ అయిన అబ్బవరం
క సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్‍గా మాట్లాడారు. తన కుటుంబ పరిస్థితితో పాటు తాను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో చెప్పుకొచ్చారు. అలాగే, తనపై ట్రోలింగ్ చేసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారో తెలియడం లేదని, ఎదగనివ్వరా అంటూ ప్రశ్నించారు. భావోద్వేగంతో మాట్లాడారు. ‘క’ చెడ్డ సినిమా అని ఎవరికైనా అనిపిస్తే తాను చిత్రాలు చేయడం మానేస్తానంటూ తెలిపారు. మొత్తంగా ఈ చిత్రంపై తాను ఎంత నమ్మకంతో ఉన్నానో అబ్బవరం వెల్లడించారు. ఈ ఈవెంట్‍కు యువ సామ్రాట్ హీరో అక్కినేని నాగచైతన్య అతిథిగా హాజరయ్యారు. కిరణ్ జర్నీకి తాను నంబర్ వన్ ఫ్యాన్ అని అన్నారు. కిరణ్‍కు చాలా శక్తి ఉందంటూ ధైర్యం చెప్పారు.