Kiran Abbavaram: క మూవీ బాలేదని మీకనిపిస్తే సినిమాలు వదిలేస్తానన్న కిరణ్ అబ్బవరం.. మా ఆయన కోసం చూడండన్న భార్య రహస్య
Kiran Abbavaram: క మూవీ బాలేదని అనిపిస్తే సినిమాలు వదిలేస్తానని ఛాలెంజ్ విసిరాడు కిరణ్ అబ్బవరం. అటు అతని భార్య రహస్య గోరక్ అయితే మా ఆయన గురించి మూవీ చూడండి అని అభిమానులను అడగడం విశేషం. క మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం (అక్టోబర్ 29) ఘనంగా జరిగింది.
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ క (KA). ఈ సినిమాపై అతడు భారీ ఆశలే పెట్టుకున్నాడు. దీపావళి సందర్భంగా లక్కీ భాస్కర్, అమరన్ లాంటి సినిమాలతో పోటీ పడుతూ గురువారం (అక్టోబర్ 31) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగగా.. అందులో కిరణ్ ఎమోషనల్ అయ్యాడు. క మూవీ బాలేదనినిపిస్తే తాను సినిమాలే వదిలేస్తానని అనడం విశేషం.
క బాలేదనిపిస్తే సినిమాలు వదిలేస్తా
క మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం (అక్టోబర్ 29) హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అయ్యాడు. ఇండస్ట్రీలో తన జర్నీని గుర్తు చేసుకున్నాడు. ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగిన తీరును చెప్పుకున్నాడు. అంతేకాదు క మూవీని తనతోపాటు టీమ్ అంతా ఎంతో ఎఫర్ట్ పెట్టి తీసిందని, ఈ సినిమా బాలేదు అని మీకు అనిపిస్తే తాను సినిమాలు వదిలేస్తానని అన్నాడు.
ఈ క మూవీని కొన్నాళ్ల పాటు మీరు గుర్తు పెట్టుకుంటారని, ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా ఈ సినిమా తీసినట్లు కిరణ్ తెలిపాడు. అదే రోజు పెద్ద సినిమాలు అమరన్, లక్కీ భాస్కర్ లాంటివి రిలీజ్ అవుతున్నా.. మీరు చూసి ఆదరిస్తారన్న నమ్మకంతో క మూవీని అదే రోజు రిలీజ్ చేస్తున్నానని, పండగ రోజును ఎంపిక చేశామని అతడు వెల్లడించాడు.
కిరణ్ జర్నీకి నేను పెద్ద అభిమానిని: నాగ చైతన్య
క మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు నాగ చైతన్య చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరం జర్నీకి తాను నంబర్ వన్ అభిమానిని అని ఈ సందర్భంగా చైతన్య అనడం విశేషం. తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్, ప్రొటెక్షన్ తనకు ఉందని, కానీ కిరణ్ లాంటి వాళ్లు అవేవీ లేకుండా ఇలా ప్రయాణించడం మామూలు విషయం కాదని చైతూ అన్నాడు.
కిరణ్.. నువ్వెవరికీ భయపడాల్సిన పనిలేదని కూడా ఈ సందర్భంగా చెప్పాడు. ట్రోల్ చేసే వాళ్ల చేతుల్లో ఫోన్లు ఉంటాయి తప్ప బ్రెయిన్ లో ఏమీ ఉండదని కూడా చైతన్య పంచ్ వేశాడు. క మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ప్రీరిలీజ్ ఈవెంట్ కు తనను పిలవడం గర్వంగా ఉందని, ట్రైలర్ చాలా బాగుందని చైతన్య స్పష్టం చేశాడు. క మూవీ అంటే కిరణ్ అబ్బవరం సినిమానా అని అడుగుతున్నారని, అంటే తన పేరు తర్వాతే మూవీ టైటిల్ ను గుర్తిస్తున్నారని, ఇది గొప్ప విషయమని చైతూ చెప్పాడు.
మా ఆయన కోసం చూడండి: రహస్య
ఇక ఈ క మూవీ ప్రొడక్షన్ లో భాగమైన హీరోయిన్, కిరణ్ అబ్బవరం భార్య రహస్య గోరక్ కూడా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా మీ కోసం, టీమ్ కోసం, మా ఆయన కోసం చూడాలంటూ.. ప్రతిదానికీ ఎందుకు చూడాలో వివరణ ఇస్తూ వెళ్లింది. మూవీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని, మీకు పైసా వసూల్ అవుతుందని రహస్య చెప్పింది.
ఇక మూవీ గురించి టీమ్ అంతా చాలా కష్టపడిందని, ప్రతి ఒక్కరూ పూర్తి ఎఫర్ట్ పెట్టి పని చేశారని, టీమ్ కోసం చూడాలని అడిగింది. చివరిగా మా ఆయన కోసం చూడండి అని కూడా ఆమె చెప్పడం విశేషం. ఏడాదిన్నర పాటు అభిమానులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకొని, తమ పెళ్లి రోజు తప్ప మిగిలిన అన్ని రోజులూ ఈ క మూవీ గురించే ఆలోచిస్తూ గడిపినట్లు ఆమె తెలిపింది.