Rules Ranjan OTT Release Date: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి కిర‌ణ్ అబ్బ‌వ‌రం రూల్స్ రంజ‌న్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-kiran abbavaram rules ranjan to stream on amazon prime video on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Kiran Abbavaram Rules Ranjan To Stream On Amazon Prime Video On This Date

Rules Ranjan OTT Release Date: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి కిర‌ణ్ అబ్బ‌వ‌రం రూల్స్ రంజ‌న్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Nov 18, 2023 02:01 PM IST

Rules Ranjan OTT Release Date: కిర‌ణ్ అబ్బ‌వ‌రం రూల్స్ రంజ‌న్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

కిర‌ణ్ అబ్బ‌వ‌రం రూల్స్ రంజ‌న్
కిర‌ణ్ అబ్బ‌వ‌రం రూల్స్ రంజ‌న్

Rules Ranjan OTT Release Date: కిర‌ణ్ అబ్బ‌వ‌రం రూల్స్ రంజ‌న్ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబ‌ర్ 1 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. థియేట‌ర్ రిలీజ్‌కు ముందు ఈ చిన్న సినిమాపై మంచి బ‌జ్ ఉండ‌టంతో ఫ్యాన్సీ రేటుకు అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిట‌ల్‌ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

ల‌వ్ స్టోరీలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, కామెడీ ఆశించిన స్టాయిలో వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో రూల్స్ రంజ‌న్ డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకున్న‌ది. ఫ‌స్ట్ వీక్‌లోనే థియేట‌ర్ల‌లో క‌నిపించ‌కుండాపోయింది. థియేట‌ర్ రిజ‌ల్ట్ కార‌ణంగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆల‌స్య‌మైన‌ట్లు స‌మాచారం.

రూల్స్ రంజ‌న్ సినిమాలో నేహా శెట్టి తో పాటు మెహ‌ర్ చాహ‌ల్ హీరోయిన్లుగా న‌టించారు. సుబ్బ‌రాజు, హ‌ర్ష చెముడు, హైప‌ర్ ఆది కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాకు సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏఎమ్ ర‌త్నం త‌న‌యుడు జ్యోతి కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గ‌తంలో గోపీచంద్ ఆక్సిజ‌న్‌, నీ మ‌న‌సు నాకు తెలుసుతో పాటు మ‌రికొన్ని సినిమాల‌కు జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

మీట‌ర్‌, రూల్స్ రంజ‌న్‌ల‌తో బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఖాతాలో చేరాయి. దాదాపు నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రూల్స్ రంజ‌న్ థియేట‌ర్ల‌లో రిలీజైంది.

కేవ‌లం కోటిన్న‌ర వ‌ర‌కు మాత్ర‌మే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి నిర్మాత‌లుకు న‌ష్టాల‌ను మిగిల్చింది. మీట‌ర్‌, రూల్స్ రంజ‌న్ సినిమాల రిజ‌ల్ట్‌ల‌తో సంబంధం లేకుండా కిర‌ణ్ అబ్బ‌వ‌రం ప్ర‌స్తుతం మూడు సినిమాల్లో న‌టిస్తోన్నాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.