Romantic Thriller Movie: కిరణ్ అబ్బవరం రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ - ఎందులో చూడాలంటే?
Romantic Thriller Movie: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంటల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా ఈ మూవీ 4కే వెర్షన్‌ను యూట్యూబ్‌లో చూడొచ్చు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో సంజన ఆనంద్ హీరోయిన్‌గా నటించింది.
Romantic Thriller Movie: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ నేను మీకు బాగా కావాల్సిన వాడిని ఫ్రీ స్ట్రీమింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ తెలుగు మూవీ 4కే వెర్షన్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంటల్, సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఈ మూవీని ఫ్రీగా చూడొచ్చు.
కిరణ్ అబ్బవరం కథ...
2022లో థియేటర్లలో రిలీజైన ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీకి కిరణ్ అబ్బవరం స్వయంగా కథను అందించాడు. శ్రీధర్ గాదే దర్శకత్వం వహించాడు. ఎస్ఆర్ కళ్యాణమండపం తర్వాత కిరణ్ అబ్బవరం, శ్రీధర్ గాదే కాంబోలో సెకండ్ మూవీగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కోడి రామకృష్ణ కూతురు...
నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలో సంజన ఆనంద్ హీరోయిన్‌గా నటించింది. మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. ఈ సినిమాలో కోరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కమెడియన్‌గా కనిపించాడు.
లవ్ ఫెయిల్యూర్...
కిరణ్ అబ్బవరం యాక్టింగ్, కామెడీ బాగున్నా...కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకపోవడంతో నేను మీకు బాగా కావాల్సిన వాడిని ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. వివేక్ (కిరణ్ అబ్బవరం )లో లవ్ లో ఫెయిల్ అవుతాడు. క్యాబ్ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తేజు( సంజనా ఆనంద్)తో వివేక్‌కు పరిచయం ఏర్పడుతుంది. తేజును ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేస్తాడు. ఆ బాధను మర్చిపోవడానికి మందు తాగడం మొదలుపెడుతుంది.
వివేక్ పరిచయమైన తర్వాతే తేజులో మార్పు వస్తుంది. ఓ రోజు తేజును కిడ్నాప్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తారు? వారి బారి నుంచి తేజును వివేక్ కాపాడుతాడు. ఆ తర్వాతే ఏమైంది. తేజును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన వాళ్లు ఎవరు? తేజు లవ్ ఫెయిల్యూర్‌కు వివేక్‌కు ఎలాంటి లింక్ ఉంది? వివేక్‌ను తేజు ప్రేమించిందా? తమ ప్రేమను వివేక్, తేజు ఎలా నిలబెట్టుకున్నారు అన్నదే ఈ మూవీ కథ.
బిగ్గెస్ట్ హిట్...
ఇటీవల రిలీజైన క మూవీతోనే కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం దిల్‌రుబా పేరుతో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీ మూవీ చేస్తోన్నాడు. అలాగే క మూవీకి సీక్వెల్ కూడా చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించాడు.