టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన దిల్‍రూబా చిత్రం మంచి అంచనాలతో మార్చి 14న థియేటర్లలో విడుదలైంది. ‘క’ బ్లాక్‍బస్టర్ తర్వాతి చిత్రం కావడం, ఈ సినిమాపై కిరణ్ చాలా నమ్మకం వ్యక్తం చేయడంతో హైప్ పెరిగింది. కానీ దిల్‍రూబా మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకొని నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కాగా, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం వాయిదా పడింది.
దిల్‍రూబా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్‍కు తెచ్చేలా డీల్ జరిగిందని తెలిసింది. దీంతో ఈనెల ఏప్రిల్ రెండో వారం లేకపోతే మూడో వారంలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. డేట్‍లపై రూమర్లు వచ్చాయి. కానీ దిల్‍రూబా మాత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు ఇంకా అడుగుపెట్టలేదు.
దిల్‍రూబా ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో ఓటీటీ ప్లాట్‍ఫామ్ విషయంలో ట్విస్ట్ ఏమైనా ఉంటుందా అనే సందేహాలు నెలకొంటున్నాయి. ఈ చిత్రం స్ట్రీమింగ్ రైట్స్ ఆహా వద్ద ఉన్నాయి. స్ట్రీమింగ్‍కు ఇంకా రాకపోవటంతో ప్లాట్‍ఫామ్ ఏమైనా మారుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ చిత్రం ఎప్పుడు స్ట్రీమింగ్‍కు వస్తుందో.. ఆహాలోనే ఎంట్రీ ఇస్తుందా అనేది చూడాలి.
దిల్‍రూబా చిత్రానికి విశ్వ కరణ్ దర్శకత్వం వహించారు. లవ్ స్టోరీ, యాక్షన్ కలబోతతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రిక్సర్ థిల్లాన్ హీరోయిన్‍గా నటించారు. క్యాథీ డేవిడ్‍స్, జాన్ విజయ్, సత్య, రహమాన్ కీలకపాత్రలు పోషించారు.
దిల్‍రూబా సినిమా ప్రమోషన్లను టీమ్ జోరుగా చేసింది. ఈ చిత్రం సక్సెస్ అవుతుందని కిరణ్ అబ్బవరం కాన్ఫిడెంట్‍గా చెప్పారు. దీంతో మంచి బజ్ ఏర్పడింది. కానీ ఈ చిత్రానికి ఎక్కువగా నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మొదటి నుంచే చతికిలపడింది. కమర్షియల్‍గా డిజాస్టర్ అయింది. సుమారు రూ.20కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందినట్టు అంచనా. మొత్తంగా రూ.9కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును కూడా ఈ సినిమా దాటలేకపోయింది.
దిల్‍రూబా చిత్రాన్ని శివమ్ సెల్యూలాయిడ్, సరేగమా బ్యానర్లపై విక్రమ్ మెహరా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి ప్రొడ్యూజ్ చేశారు. సామ్ సీఎస్ సంగీతం అందించగా.. విశ్వాస్ డానియెల్ సినిమాటోగ్రఫీ చేశారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
సంబంధిత కథనం
టాపిక్