Kiran Abbavaram: ఆ హీరోయిన్ పేరు చెప్పగానే సిగ్గు పడిన కిరణ్ అబ్బవరం.. ప్రేమలో ఉన్నారా?: వీడియో వైరల్
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ఓ ఇంటర్వ్యూలో ఓ హీరోయిన్‍తో రిలేషన్ గురించి చెప్పకనే చెప్పారు. ఆమె పేరు చెప్పగానే సిగ్గు పడ్డాడు అబ్బవరం. ఆ వివరాలివే..
Kiran Abbavaram: ‘రాజావారు రాణిగారు’ సినిమాతో 2019లో వెండి తెరకు పరిచమైన హీరో కిరణ్ అబ్బవరం మంచి ఆరంభాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఆయన నటించిన ఎస్ఆర్ కల్యాణమండపం సూపర్ హిట్ అయింది. దీంతో కిరణ్ అబ్బవరం హీరోగా స్థిరపడ్డారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా.. ఏదీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. వరుస పరాజయాలను కిరణ్ చూశారు. ఇటీవలే వచ్చిన రూల్స్ రంజన్ సినిమా కూడా నిరాశపరిచింది. అయితే, తాజాగా కిరణ్ అబ్బవరం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన రిలేషన్‍షిప్ గురించి చెప్పకనే చెప్పారు.
రాజావారు.. రాణిగారు సినిమాలో తన సరసన హీరోయిన్‍గా నటించిన రహస్య గోరఖ్‍తో కిరణ్ అబ్బవరం ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. దీనిపైనే ఇంటర్వ్యూలో కిరణ్‍కు ప్రశ్న ఎదురైంది. హీరోయిన్ రహస్య గోరఖ్ పేరు చెప్పగానే కిరణ్ అబ్బవరం సిగ్గు పడ్డారు. అదేం లేదంటూనే ఏదో ఉందనే హింట్ ఇచ్చారు.
“రహస్య గోరఖ్.. మీరు రిలేషన్‍లో ఉన్నారు” అని హోస్ట్ అషూ రెడ్డి.. కిరణ్ అబ్బవరాన్ని క్వశ్చన్ చేశారు. దీంతో “లేదండి.. ఏదైనా ఉంటే చెప్తాం” అని కిరణ్ బదులిచ్చారు. చెప్తాం అంటే ఇద్దరు కలిసి ఒకేసారి డేట్ అనౌన్స్ చేస్తారా అని అషు అడిగారు. దీంతో సిగ్గు ఆపుకోలేకపోయారు కిరణ్ అబ్బవరం. తాను ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలోనూ ఇంత దొరికిపోలేదంటూ కిరణ్ అన్నారు.
రహస్య గోరఖ్ పేరు చెప్పగానే కిరణ్ సిగ్గుపడుతూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఎప్పుడూ ఇలా దొరిగిపోలేదు అన్న డైలాగ్ క్రమంగా మీమ్‍గానూ మారుతోంది. అయితే, తాను రహస్య గోరఖ్‍తో ప్రేమలో ఉన్నానని కిరణ్ చెప్పకనే చెప్పారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అయ్యాయి. అయితే, ఏది కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్‍లో సక్సెస్ కాలేదు. రూల్స్ రంజన్ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కాగా.. మిక్స్డ్ టాక్ వచ్చింది. నేహా శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటించారు. కిరణ్ - నేహా మధ్య ఈ చిత్రంలో కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అయితే, సినిమా కథ, కథనం పరంగా ఆకట్టకోలేకపోయిందన్న అభిప్రాయాలు వినిపించాయి.
టాపిక్