Kiran Abbavaram Movie Postponed: నేను మీకు బాగా కావాల్సినవాడినే సినిమా వాయిదా.. ఎప్పుడొస్తుందంటే?
Kiran Abbavaram NMBK: కిరణ్ అబ్బవరం నటించిన నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్రం విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. తొలుత సెప్టెంబరు 9న విడుదల చేయాలని భావించగా.. తాజాగా ఆ తేదీని మార్పు చేసింది.
NMBK on September 16: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో మరోసారి ఆడియెన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా అతడు నటించిన సరికొత్త చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఐటెం సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రత్యేక గీతంలో కిరణ్ తనదైన స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను సెప్టెంబరు 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. తాజాగా ఈ విడుదల తేదీని వాయిదా వేసింది.
ట్రెండింగ్ వార్తలు
నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్రాన్ని సెప్టెంబరు 9న విడుదల కావాల్సి ఉండగా.. తాజాగా వాయిదా వేసింది. సెప్టెంబరు 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో కిరణ్ రాడ్ పట్టుకుని మాస్ లుక్‌లో అదరగొట్టాడు.
శ్రీధర్ గాదే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరించారు. కిరణ్ అబ్బవరం సరసన సంజన ఆనంద్, సోనూ ఠాకూర్, దివ్యా రాధన్ హీరోయిన్లుగా చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసి సెప్టెంబరు 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.
ఇటీవల విడుదలైన ఐటెమ్ నెంబర్‌లో కిరణ్ అబ్బవరం దుమ్మురేపాడు. తనదైన శైలి స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. అట్టాంటి ఇట్టాంటి దాన్ని కాదు మామ అంటూ ఈ పాట ఆకట్టుకుంది. ఆ పాటను సాకేత్ కొమండూరి, కేతన శర్మ ఆలపించారు. కాసర్ల శ్యామ్ పాటకు సాహిత్యాన్ని అందించాడు.మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.
సంబంధిత కథనం