Rules Ranjan Trailer: నవ్వించేలా రూల్స్ రంజన్ ట్రైలర్.. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి టైమింగ్ సూపర్
Rules Ranjan Movie Trailer: అతి తక్కువ కాలంలో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. కానీ, అవి అంతగా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టట్లేదు. ఇటీవల వరుస ప్లాప్ల్ చూసిన కిరణ్ తాజాగా నటించిన సినిమా రూల్స్ రంజన్ ట్రైలర్‍ను శుక్రవారం విడుదల చేశారు.
రాజా వారు రాణి గారు సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం ఎస్‍ఆర్ కల్యాణ మండపం మూవీతో మంచి విజయం సాధించాడు. కానీ, ఆ తర్వాత చేసిన కిరణ్ అబ్బవరం చేసిన సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఎలాగైన హిట్ కొట్టేందుకు కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం రూల్స్ రంజన్. డీజే టిల్లు బ్యూటి నేహా శెట్టి హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే ట్రెండ్ అయ్యాయి. తాజాగా రూల్స్ రంజన్ ట్రైలర్‍ను సెప్టెంబర్ 8న విడుదల చేశారు మేకర్స్.
సుమారు 2 నిమిషాల 44 సెకన్లు ఉన్న రూల్స్ ట్రైలర్ ఆద్యంతం కామెడీతో నవ్వించేలా ఉంది. "ప్రతి తండ్రి నన్ను చూసి నేర్చుకోవాల. అమ్మ పాలిచ్చి పెంచుద్ది. అయ్యా మందిచ్చి ఓదార్చాలా. చెప్పు నాన్నా ఏం తాగుతావ్" అంటూ గోపరాజు రమతో చెప్పించే డైలాగే ఆకట్టుకోగా.. "బీరు ఓకే.." అని అమాయకంగా కిరణ్ అబ్బవరం చెప్పడం మరింత నవ్వించేలా ఉంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయినా రంజన్‍ను అంతా రూల్స్ రంజన్ అని పిలుస్తారు. అలాంటి వ్యక్తికి గతంలో దూరమైన అమ్మాయి (నేహాశెట్టి) మళ్లీ కలవడంతో రంజన్ జీవితం ఎలా మలుపు తిరిగింది వంటి కథాంశంతో లవ్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా అంశాలుగా రూల్స్ రంజన్ ఉన్నట్లు తెలుస్తోంది.
రూల్స్ రంజన్ ట్రైలర్‍లో వెన్నెల కిశోర్ కామెడీ, కిరణ్ టైమింగ్, నేహా శెట్టి బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రజన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా వెన్నెల కోశోర్, హైపర్ ఆది, వైవా హర్ష డైలాగ్స్ కడుపుబ్బ నవ్వించేలా ఉన్నాయి. ఇందులో నేహాశెట్టితోపాటు మెహర్ చాహల్ మరో హీరోయిన్‍గా నటిస్తోంది. ఆమె ఇదివరకు 7 డేస్ 6 నైట్స్ సినిమా చేసింది. ఏం ఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మాతలు. సెప్టెంబర్ 28న రూల్స్ రంజన్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.