Kiran Abbavaram Ka Movie: 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ - దుమ్ములేపుతోన్న కిరణ్ అబ్బవరం మిస్టరీ థ్రిల్లర్ మూవీ
Kiran Abbavaram Ka Movie: కిరణ్ అబ్బవరం క మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన మూవీగా కా నిలిచింది.
Kiran Abbavaram Ka Movie: కిరణ్ అబ్బవరం క మూవీ టీజర్, టైటిల్‌తోనే తెలుగు ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో దర్శకద్వయం సుజీత్, సందీప్ క మూవీని తెరకెక్కిస్తోన్నారు. ఈ మూవీతోనే వీరిద్దరు డైరెక్టర్లుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోన్నారు.
30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్...
పీరియాడిక్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న క మూవీ తెలుగు స్టేట్స్ రైట్స్ ను ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి. 12 కోట్లకు ఎన్ఆర్ఐ బేసిస్ లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమా ఇతర భాషల థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ దాదాపు 18 కోట్ల రూపాయల దగ్గర క్లోజ్ అయ్యేలా ఉన్నట్లు సమాచారం.
దీంతో 30 కోట్ల రూపాయలపైనే "క" సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగనున్నట్లు కనిపిస్తోంది. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ జరిగిన మూవీగా క నిలవనున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
ఇద్దరు హీరోయిన్లు...
. "క" సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మిస్టరీ పోస్ట్‌మ్యాన్‌గా కిరణ్ అబ్బవరం డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపిస్తోన్నాడు. అతడి క్యారెక్టర్‌లో పాజిటివ్‌తో పాటు నెగెటివ్ షేడ్స్ కనిపిస్తోన్నాయి.
రెండు ఎత్తైన కొండల నడుమ ఉండే కృష్ణగిరి అనే ఊరి బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ సాగనుంది. ఆ ఊరికి కొత్తగా వచ్చిన పోస్ట్‌మేన్ కథేమిటి? అతడు వచ్చిన తర్వాత ఊళ్లో ఎలాంటి పరిణామాలు జరిగాయి? అన్నదే ఈ మూవీ కథ. తీసుకురాబోతున్నారు.
టీజర్ డైలాగ్స్ హైలైట్...
ఇటీవల రిలీజైన క టీజర్‌లోని డిఫరెంట్ విజువల్స్, డైలాగ్స్‌తో ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఎవరు నవ్వు ఎక్కడి నుంచి వచ్చావు....పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఏంటి? నీకంటూ ఎవరూ లేరా? హత్యలు చేసేంత వరకు వెళ్లావు... అంటూ టీజర్‌లో వినిపించిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నాకు తెలిసిన నేను మంచి...నాకు తెలియని నేను... అంటూ తన క్యారెక్టర్ గురించి కిరణ్ అబ్బవరం సస్పెన్స్ క్రియేట్ చేశాడు.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు కనిపిస్తోంది. చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తోన్నాడు. త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. కిరణ్ అబ్బవరం ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఇదే కావడం గమనార్హం.
గత ఏడాది రెండు సినిమాలు...
ఏడాది లాంగ్ గ్యాప్ తర్వాత క మూవీతో కిరణ్ అబ్బవరం తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. క మూవీకి ముందు కిరణ్ అబ్బవరం నటించిన మీటర్. రూల్స్ రంజన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.కిరణ్ అబ్బవరం స్టోరీ సెలెక్షన్‌ఫై విమర్శలొచ్చాయి. ఈ ఫెయిల్యూర్స్‌తో కథల ఎంపికలో తన పంథాను మార్చాడు కిరణ్ అబ్బవరం. కొత్త పాయింట్‌తో క మూవీ చేస్తోన్నాడు.
ఆగస్ట్ లో పెళ్లి...
మరోవైపు కిరణ్ అబ్బవరం త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన తొలి సినిమా రాజావారు రాణిగారు హీరోయిన్ రహస్య గోరక్ మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. ఆగస్ట్ నెలాఖరున వీరి పెళ్లి జరుగనుంది. ఈ విషయాన్ని ఇటీవలే రహస్య గోరఖ్ స్వయంగా వెల్లడించింది.