తమిళ సినిమాలకు ఇక్కడ థియేటర్లు ఇస్తున్నప్పుడు మా సినిమాలకు ఎందుకు ఇవ్వరు.. ఇవ్వమని ముఖం మీదే చెప్పేశారు: కిరణ్ అబ్బవరం-kiran abbavaram k ramp promotions questions why telugu movies do not get theatres in tamilnadu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  తమిళ సినిమాలకు ఇక్కడ థియేటర్లు ఇస్తున్నప్పుడు మా సినిమాలకు ఎందుకు ఇవ్వరు.. ఇవ్వమని ముఖం మీదే చెప్పేశారు: కిరణ్ అబ్బవరం

తమిళ సినిమాలకు ఇక్కడ థియేటర్లు ఇస్తున్నప్పుడు మా సినిమాలకు ఎందుకు ఇవ్వరు.. ఇవ్వమని ముఖం మీదే చెప్పేశారు: కిరణ్ అబ్బవరం

Hari Prasad S HT Telugu

టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తన నెక్ట్స్ మూవీ కే ర్యాంప్ ప్రమోషన్లలో తమిళనాడు థియేటర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోకు ఇక్కడ థియేటర్లు ఇస్తున్నప్పుడు తమ సినిమాలకు తమిళనాడులో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించాడు.

తమిళ సినిమాలకు ఇక్కడ థియేటర్లు ఇస్తున్నప్పుడు మా సినిమాలకు ఎందుకు ఇవ్వరు.. ఇవ్వమని ముఖం మీదే చెప్పేశారు: కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం గతేడాది క మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మధ్యే వచ్చిన దిల్‌రుబాతో వచ్చినా అది నిరాశ పరిచింది. ఇక ఇప్పుడు కే ర్యాంప్ అనే సినిమా అక్టోబర్ 18న రానుండగా.. ఈ మూవీ ప్రమోషన్లలో కిరణ్ బిజీగా ఉన్నాడు. అయితే ఇందులో భాగంగా గలాటా ప్లస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కిరణ్ తమ సినిమాలకు తమిళనాడులో థియేటర్లు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

కిరణ్ అబ్బవరం ఏమన్నాడంటే?

దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానున్న ‘ కే ర్యాంప్’లో కిరణ్ అబ్బవరం నటించాడు. ఇటీవల గలాటా ప్లస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ యువ నటులకు తెలుగు నాట థియేటర్లు దక్కుతున్నా.. తన సినిమాలకు తమిళనాడులో థియేటర్లు దొరకడం లేదని కిరణ్ తన బాధను పంచుకున్నాడు. దీపావళికి విడుదలవుతున్న ప్రదీప్ రంగనాథన్ సినిమాతో అతడు పోల్చి చూశాడు.

"గతంలో నేను 'క' సినిమాను తమిళనాడులో విడుదల చేయడానికి ప్రయత్నించాను కానీ నాకు స్క్రీన్లు దొరకలేదు. ఏం జరిగిందో నాకు తెలియదు. పండుగ ఉన్నప్పుడు ఇతర హీరోలకు స్క్రీన్లు ఉండవని వారు నేరుగా చెప్పారు. 'క' మంచి సినిమా అని నేను అనుకున్నాను. కానీ తెలుగులో కూడా నాకు థియేటర్లు దొరకలేదు. కేవలం 10 స్క్రీన్లలో రిలీజ్ చేశాను. తర్వాత మెల్లగా పెరిగాయి. నాకు చాలా బాధగా అనిపించింది. ఒక యువ హీరోగా నా సినిమాలు తమిళంలో విడుదల కావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మేము తమిళ హీరోల సినిమాలన్నీ చూస్తున్నాము.. సెలబ్రేట్ చేసుకుంటున్నాము" అని అతడు అన్నాడు.

కిరణ్ అబ్బవరం ఇంకా మాట్లాడుతూ.. "'క' సినిమాకి అది జరగలేదు. తెలుగు ప్రేక్షకులు ఇతర సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. కానీ తెలుగు హీరోలు మంచి కంటెంట్ తీసినప్పుడు అక్కడ వాటిని పట్టించుకోవడం లేదు. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న 10 మంది తమిళ హీరోలు ఉన్నారు. కానీ అక్కడ మాత్రం ఇలా జరగడం లేదు. ప్రదీప్ రంగనాథన్‌కు తెలుగులో థియేటర్లు దొరికినట్లుగా 'కే ర్యాంప్' ను తమిళంలో విడుదల చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ నాకు దొరకట్లేదు" అని అన్నాడు.

భవిష్యత్తు ప్రణాళికపై కిరణ్

తరువాతి మూడు సంవత్సరాల ప్రణాళిక గురించి కిరణ్ మాట్లాడుతూ.. తాను వంద కోట్ల క్లబ్ వెంట పడటం లేదని, మూడు సినిమాలు విడుదల చేయాలని కోరుకుంటున్నానని చెప్పాడు.

"నేను సినిమాను ప్రమోట్ చేయడానికి సమయం తీసుకోవాలనుకుంటున్నాను. మంచి గ్యాప్‌ను ఇవ్వాలనుకుంటున్నాను. నేను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విషయాలను రూపొందించాలని, ప్రేక్షకులతో అనుబంధాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నాను" అని అన్నాడు.

కిరణ్ మూవీ కే ర్యాంప్ అక్టోబర్ 18న విడుదల కోసం సిద్ధమవుతోంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం కేరళలోని ఒక కళాశాలలో చేరి, ఒక అమ్మాయి ప్రేమలో పడే యువకుడి పాత్రను పోషిస్తున్నాడు. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యుక్తి తరేజా కథానాయికగా నటించింది. మరోవైపు ప్రదీప్ రంగనాథన్ చిత్రం 'డ్యూడ్' ఒక రోజు ముందు అంటే అక్టోబర్ 17న విడుదల అవుతోంది. దర్శకుడు కీర్తిస్వరన్ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు, శరత్‌కుమార్ తదితరులు కూడా నటిస్తున్నారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం