Kiran Abbavaram: రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నా - ఫెయిల్యూర్స్‌పై కిరణ్ అబ్బవరం క్లారిటీ
Kiran Abbavaram: మీటర్, రూల్స్ రంజన్ సినిమాలను రెమ్యునరేషన్ తీసుకోకుండా చేసినట్లు కిరణ్ అబ్బవరం తెలిపాడు. తన సినిమాల కారణంగా ప్రొడ్యూసర్లు నష్టపోతే వారిని ఒక్క రూపాయి కూడా తీసుకోనని చెప్పాడు. అతడి కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
Kiran Abbavaram: గత కొంతకాలంగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. అతడు హీరోగా నటించిన మీటర్, నేను మీకు బాగా కావాల్సిన వాడినితో పాటు రూల్స్ రంజన్ సినిమాలు డిజాస్టర్స్‌గా మిగిలాయి. బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ ఎఫెక్ట్ అతడి కెరీర్‌పై గట్టిగానే పడింది.
ఈ పరాజయాలపై కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మీటర్, రూల్స్ రంజన్‌తో పాటు నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాల కోసం రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలిపాడు. రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా పద్దతిలోనే తాను సినిమాలు చేస్తున్నట్లు కిరణ్ అబ్బవరం చెప్పాడు. సెబాస్టియన్ పీఎస్ 524 నుంచే ఈ రూట్‌ను ఫాలో అవుతున్నట్లు తెలిపాడు.
ఒకవేళ ప్రొడ్యూసర్లు నష్టపోతే వారిని ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ అడగనని కిరణ్ అబ్బవరం అన్నాడు. మీటర్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని రిజల్ట్‌ను తాను ముందే ఊహించినట్లు కిరణ్ అబ్బవరం చెప్పాడు. ఒకవేళ తానే ప్రొడ్యూసర్ అయితే ఆ సినిమాల్ని నిర్మించేవాడిని కాదని అన్నాడు.
మీటర్ కథ బాగానే ఉన్నా తన ఇమేజ్‌కు మించిన ఎలివేషన్స్, హీరోయిజం వల్ల సినిమా ఫెయిలైందని కిరణ్ అబ్బవరం అన్నాడు. గత సినిమాల ఫలితాల నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నట్లు కిరణ్ అబ్బవరం పేర్కొన్నాడు. కథలు, ఎగ్జిక్యూషన్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు చెప్పాడు.
తొందరపడి సినిమాలు చేయడం కాకుండా మంచి కథలను ఎంచుకోవాలని కెరీర్‌కు ఆరు నెలల పాటు బ్రేక్ తీసుకొంటున్నట్లు పేర్కొన్నాడు. ఫెయిల్యూర్స్‌ఫై కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
టాపిక్