Vishwa Karun: ఏ వార్త చూసినా వాటి గురించే ఉంటున్నాయి.. డైరెక్టర్ విశ్వ కరుణ్ కామెంట్స్-kiran abbavaram dilruba movie director vishwa karun comments on news articles and puri jagannadh phone call ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwa Karun: ఏ వార్త చూసినా వాటి గురించే ఉంటున్నాయి.. డైరెక్టర్ విశ్వ కరుణ్ కామెంట్స్

Vishwa Karun: ఏ వార్త చూసినా వాటి గురించే ఉంటున్నాయి.. డైరెక్టర్ విశ్వ కరుణ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Dilruba Director Vishwa Karun About News Articles: హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దిల్‌రూబా. ఈ సినిమాకు విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. ఇవాళ దిల్‌రూబా థియేటర్లలో విడుదలైంది. అయితే, మార్చి 13న నిర్వహించిన మీడియా మీట్‌లో విశ్వ కరుణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఏ వార్త చూసినా వాటి గురించే ఉంటున్నాయి.. డైరెక్టర్ విశ్వ కరుణ్ కామెంట్స్

Dilruba Director Vishwa Karun About News Articles: కిరణ్ అబ్బవరం, రుక్సార్ ధిల్లాన్, క్యాతీ డేవిసన్ హీరో హీరోయిన్స్‌గా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దిల్‌రూబా. శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమ నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మించిన దిల్‌రూబాకు రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా ఉన్నారు.

ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిల్‌రూబా సినిమాకు విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. ఇవాళ అంటే మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా దిల్‌రూబా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మార్చి 13న మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో దిల్‌రూబా డైరెక్టర్ విశ్వ కరుణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

డైరెక్టర్ విశ్వకరుణ్ మాట్లాడుతూ.. "దిల్‌రూబా సినిమా మరికొద్ది సేపట్లో థియేటర్స్‌లోకి వస్తోంది. మేమంతా ఎగ్జైటెడ్‌గా వేచి చూస్తున్నాం. మనం ఏ వార్త చూసినా మనుషుల మధ్య తగ్గిపోయిన విలువలు, బంధాల గురించే ఉంటున్నాయి. అవి చూశాక దిల్‌రూబా లాంటి కథ రాయాలని అనిపించింది. ఒక క్యారెక్టర్ కోసం బతికే వ్యక్తి హీరో" అని అన్నారు.

పూరి జగన్నాథ్ ఫోన్ చేశారు

"ఈ సినిమాలో నేను రాసిన డైలాగ్స్ బాగున్నాయని ప్రమోషనల్ కంటెంట్ చూసిన వారు చెబుతున్నారు. కథ డిమాండ్ చేసిన మేరకే నేను ఆ డైలాగ్స్ రాయగలిగాను. దిల్‌రూబా కంటెంట్ చూశాక పూరి జగన్నాథ్ గారు ఫోన్ చేసి మాట్లాడారు. అలాగే దర్శకుడు మెహర్ రమేష్ కూడా కంటెంట్ బాగుందని చెప్పారు. ఇలా పెద్ద వాళ్లు ఫోన్ చేసి మాట్లాడటం సంతోషంగా ఉంది" అని విశ్వ కరుణ్ చెప్పారు.

"కిరణ్ అబ్బవరం గారిని ఈ సినిమాలో కొత్తగా చూస్తారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి మీరు ఇచ్చే రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాం. దిల్‌రూబా రిలీజ్ తర్వాత నా కొత్త మూవీ గురించి చెబుతా" అని దిల్‌రూబా మూవీ డైరెక్టర్ విశ్వ కరుణ్ తెలిపారు.

ఎక్స్‌పీరియన్స్ బాగుంది

ఇక హీరోయిన్ క్యాతీ డేవిసన్ మాట్లాడుతూ.. "దిల్‌రూబా సినిమాలో నేను మ్యాగీ క్యారెక్టర్ చేశాను. ఇలాంటి మంచి రోల్‌తో మీకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. కిరణ్ అబ్బవరం గారితో పాటు మిగతా టీమ్ అందరితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. మీరంతా తప్పకుండా దిల్‌రూబా సినిమా చూడాలని కోరుకుంటున్నా. ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది. అలాగే ఎమోషనల్ ఫీల్ అవుతారు. దిల్ రూబా చూసి మీరు ఫీడ్ బ్యాక్ ఇస్తారని మా టీమ్ అంతా ఆశిస్తున్నాం" అని తెలిపింది.

డీవోపీ డేనియల్ విశ్వాస్ మాట్లాడుతూ.. "దిల్‌రూబా కథ విన్నప్పుడే ఈ చిత్రంలో కిరణ్ ఎంత బాగా నటిస్తాడు, డైరెక్టర్ ఎంత బాగా రూపొందిస్తాడు అనేది ఊహించగలిగాను. ఈ సినిమా ఫ్యామిలీ అందరికీ నచ్చేలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది" అని చెప్పారు.

మంచి క్వాలిటీతో

ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ మాట్లాడుతూ.. "దిల్ రూబా సినిమా కిరణ్ గారిని కొత్తగా చూపిస్తుంది. ఈ సినిమా మేకింగ్ మంచి క్వాలిటీతో ఉంటూ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇదొక యూత్‌ఫుల్ లవ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ. మంచి యాక్షన్ సీక్వెన్సులు, సాంగ్స్‌తో పాటు హీరో హీరోయిన్స్ పర్‌ఫార్మెన్స్‌లు హైలైట్‌గా నిలుస్తాయి" అని తెలిపారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం