Kiran Abbavaram: నేను చాలా మొండివాడిని, నా పని అయిపోయింది అన్నవాళ్లతోనే అనిపించుకుంటా.. హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్-kiran abbavaram comments on his failure movies in ka movie trailer release event kiran abbavaram speech ka trailer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kiran Abbavaram: నేను చాలా మొండివాడిని, నా పని అయిపోయింది అన్నవాళ్లతోనే అనిపించుకుంటా.. హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్

Kiran Abbavaram: నేను చాలా మొండివాడిని, నా పని అయిపోయింది అన్నవాళ్లతోనే అనిపించుకుంటా.. హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Published Oct 26, 2024 11:04 AM IST

Kiran Abbavaram In Ka Movie Trailer Release: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ డిఫరెంట్ మూవీ క. తాజాగా అక్టోబర్ 25న క మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

నేను చాలా మొండివాడిని, నా పని అయిపోయింది అన్నవాళ్లతోనే అనిపించుకుంటా.. హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్
నేను చాలా మొండివాడిని, నా పని అయిపోయింది అన్నవాళ్లతోనే అనిపించుకుంటా.. హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్

Kiran Abbavaram Comments: యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క" ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటించారు.

భారీ ప్రొడక్షన్ వాల్యూస్

శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్ మెంట్స్‌ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందించారు. క మూవీ అక్టోబర్ 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.

తాజాగా ‌"క" మూవీ ట్రైలర్‌ను అక్టోబర్ 25న విడుదల చేశారు. ఈ సందర్భంగా క మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ క ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అందరి సపోర్ట్‌తోనే

"ఈ రోజు మా ‌క సినిమా ట్రైలర్ రిలీజ్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. చాలా టైమ్ మీతో స్పెండ్ చేసే అవకాశం కలిగింది. నా ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఈవెంట్‌కు రావడం హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్‌తోనే నేను ఈ స్టేజీ మీద ఉన్నాను. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసే సినిమాలు మరిన్ని చేస్తాను" అని కిరణ్ అబ్బవరం చెప్పాడు.

"నేను చాలా మొండివాడిని. ఇబ్బందులు వచ్చినా మంచి సినిమాలు చేయాలనే నా ప్రయత్నం ఆపను. కిరణ్ అబ్బవరం పని అయిపోయింది అన్నవాళ్లతోనే బాగా చేశాడు అనిపించుకుంటా. చాలా కొత్త కంటెంట్‌తో క సినిమా చేశాను. గతంలో నా సినిమాలు అన్ని విషయాల్లో బాగున్నా కంటెంట్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండేది అనే కామెంట్స్ వచ్చాయి" అని కిరణ్ అబ్బవరం తెలిపాడు.

కొత్త వరల్డ్ చూస్తారు

"అందుకే కంటెంట్ మీద శ్రద్ధ తీసుకుని ‌క సినిమా చేశాం. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా కొత్తగా ప్రయత్నించాం. స్క్రీన్ ప్లే యూనిక్‌గా ఉంటుంది. ‌క మూవీలో ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు. వాసుదేవ్ ప్రపంచంలోకి వెళ్లి కథకు మీరు బాగా కనెక్ట్ అవుతారు. సినిమా చూస్తున్నంత సేపూ హ్యాపీగా ఫీలవుతారు" అని హీరో కిరణ్ అబ్బవరం పేర్కొన్నాడు.

"నా సినిమాలు ఎలా ఉన్నా మీరు నాతో మొహమాటం లేకుండా చెప్పవచ్చు. మీ సజెషన్స్ తీసుకుని బెటర్‌గా ప్రయత్నించిన చిత్రమే ‌క. నా కోసమైనా థియేటర్‌కు వెళ్లి క సినిమా చూడండి. నా సినిమాలు బాగా లేదు అని గతంలో చెప్పి వాళ్లే ఫస్ట్ డే ‌క సినిమా చూడాలని కోరుకుంటున్నా. మా సినిమాలో సీజీ వర్క్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. మంచి క్వాలిటీతో ఆ వర్క్ చేసేందుకు మా డైరెక్టర్ సందీప్ ఈ ఈవెంట్‌కు రాలేకపోయారు" అని కిరణ్ అబ్బవరం అన్నాడు.

ఎంటర్‌టైన్ చేస్తుంది

"మ్యూజిక్ చేసిన సామ్ సీఎస్ గారికి థ్యాంక్స్. మంచి మ్యూజిక్ ఇచ్చారు. క సినిమా ఇంత బాగా రావడానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు. ఆయన నాకు మా టీమ్‌కు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. మనం మంచి సినిమా చేశామంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు నేను ప్రామిస్ చేస్తున్నా దీపావళి పండుగకు మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కు వెళ్లండి. క సినిమా చూడండి. మిమ్మల్ని తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది" అని కిరణ్ అబ్బవరం తన స్పీచ్ ముగించాడు.

Whats_app_banner