Telugu Tv Show: తెలుగు కామెడీ గేమ్ షో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 లాంఛింగ్ డేట్‌ను స్టార్ మా రివీల్ చేసింది. ఈ షోకు హోస్ట్, జడ్జ్‌లతో పాటు కంటెస్టెంట్స్ ఎవరన్నది కూడా వెల్లడించింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సెకండ్ సీజన్ మార్చి 29న మొదలుకానుంది. రాత్రి తొమ్మిది గంటలకు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతోంది. మార్చి 29 నుంచి ప్రతి శనివారం, ఆదివారాల్లో ఈ టీవీ షో టెలికాస్ట్ కానుంది.
హోస్ట్‌తో పాటు జడ్జ్‌లలో స్టార్ మా ఎలాంటి మార్పులు చేయలేదు. మరోసారి ఈ టీవీ షోకు హోస్ట్‌గా శ్రీముఖి కనిపిస్తోండగా...కిరాక్ బాయ్స్ టీమ్‌కు శేఖర్ మాస్టర్...ఖిలాడీ గర్ల్స్ టీమ్‌కు అనసూయ జడ్జ్‌లుగా వ్యవహరించబోతున్నారు.
ఈ కామెడీ గేమ్ షో సెకండ్ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరన్నది ఇటీవల రిలీజ్ చేసిన ఓ ప్రోమో ద్వారా స్టార్ మా వెల్లడించింది. కిరాక్ బాయ్స్ టీమ్ నుంచి బిగ్‌బాస్ పృథ్వీ, దిలీప్, రవి కృష్ణ, సాకేత్, నిఖిల్ విజయేంద్రవర్మ, శివ కుమార్, బబ్లూతో పాటు జబర్ధస్థ్ ఇమ్మాన్యుయేల్ కంటెస్టెంట్స్‌గా బరిలోకి దిగనున్నారు.
ఖిలాడీ గర్ల్స్ టీమ్ తరఫున రోహిణి, శ్రీసత్య, లాస్య మంజునాథ్, దేబ్జానీ మోదక్, హమీదా ఖాతూన్, సుస్మిత, తేజస్వి మదివాడ, ఐశ్వర్య పాల్గొనున్నట్లు ప్రోమోలో చూపించారు. ఫస్ట్ సీజన్‌కు మించి ఫన్, గేమ్స్‌తో సెకండ్ సీజన్ సాగబోతున్నట్లు తెలుస్తోంది.
కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ వన్‌లో కిరాక్ బాయ్స్ టీమ్ విన్నర్‌గా నిలిచింది. ఇరవై లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుంది. ఫైనల్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన నాని విన్నర్స్‌కు టైటిల్ అందించాడు.
కిరాక్ బాయ్స్...ఖిలాడీ గర్ల్స్ సీజన్ వన్‌లో బాయ్స్ టీమ్ నుంచి అర్జున్ అంబాటి, అమీర్ దీప్ చౌదరి, నిఖిల్, గౌతమ్, శ్రీకర్, టేస్జీ తేజ, యాదమరాజు, రవితేజ, చైతూ, కిరణ్ గౌడ కంటెస్టెంట్స్‌లో పాల్గొన్నారు. గర్ల్స్ టీమ్ నుంచి ప్రియాంకజైన్, శోభాశెట్టి, ఆయేషా, ప్రేరణ, విష్ణుప్రియ, పల్లవి గౌడ, రీతూ చౌదరి, సౌమ్యరావు, గోమతి, దీపిక పాల్గొన్నారు.
కొన్నాళ్లుగా సినిమాలపై ఫోకస్ పెట్టిన అనసూయ యాంకరింగ్‌కు దూరమైంది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో మాత్రమే చేస్తోంది. అది కూడా ఈ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. ఇటీవలే పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అనసూయ. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 1700 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో అనసూయ కనిపించింది. పుష్ప 2 తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో స్పెషల్ సాంగ్ చేస్తోంది అనసూయ. ఈ మూవీతో పాటు మరో నాలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది.
సంబంధిత కథనం