జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన జాంబీ థ్రిల్లర్ మూవీ కింగ్‌స్టన్ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కోలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్నది. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం.
కింగ్‌స్టన్ మూవీకి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో జీవీ ప్రకాష్‌కుమార్‌కు జోడీగా దివ్యభారతి హీరోయిన్‌గా నటించింది. చేతన్, నితిన్ సత్య కీలక పాత్రలు పోషించారు. హీరోగా నటించడమే కాకుండా ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా జీవీ ప్రకాష్ కుమార్ వ్యవహరించాడు.
జీవీ ప్రకాష్ కుమార్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన కింగ్‌స్టన్ ట్రైలర్, టీజర్స్‌తో కోలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ మూవీతో హీరోగా అతడికి బ్లాక్‌బస్టర్ హిట్ దక్కడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ కథ కన్ఫ్యూజింగ్‌గా సాగడం, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాకపోవడంతో కింగ్‌స్టన్ డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఆరు కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. హీరోగా జీవీ ప్రకాష్ కెరీర్‌లో 25వ మూవీగా కింగ్‌స్టన్ రిలీజైంది.
తూతువురు గ్రామానికి ఓ శాపం ఉంటుంది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన జాలర్లు శవాలై తిరిగివస్తుంటారు. బోసయ్య అనే వ్యక్తి ఆత్మ ఈ దారుణాలకు పాల్పడుతుందని తూతువురు ప్రజలు భయపడుతుంటారు.
ప్రాణ భయంతో చేపల వేటను వదిలేసి ఊరివాళ్లంతా థామస్ వద్ద పనిచేస్తుంటారు. వారితో డ్రగ్స్ సప్లై చేయిస్తుంటాడు ధామస్. కింగ్ (జీవీ ప్రకాష్ కుమార్) కూడా ఆంటోనీ వద్దే పనిచేస్తుంటాడు. స్నేహితుడి చావుతో థామస్ చేస్తోన్న డ్రగ్స్ బిజినెస్ గురించి కింగ్‌కు తెలిసిపోతుంది. థామస్‌కు ఎదురుతిరుగుతాడు.
సముద్రంపైకి వెళ్లిన వారిని ఆత్మ చంపేస్తుందనే అపవాదు పోతేనే ఊరివాళ్లకు ఉపాధి దొరుకుతుందని భావిస్తాడు కింగ్. తన స్నేహితులతో కలిసి చేపల వేట కోసం సముద్రంపైకి వెళతాడు? ఈ జర్నీలో కింగ్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? బోసయ్య ఆత్మ వెంటాడుతుంది నిజమేనా? కింగ్‌తో పాటు అతడి టీమ్ జాంబీల నుంచి ఎలా తమ ప్రాణాలను కాపాడుకున్నారు? ఈ కథలో రాజ్ (దివ్యభారతి)తో పాటు ఛార్లెస్, బోస్ పాత్రలు ఏంటి? అన్నదే కింగ్‌స్టన్ మూవీ కథ.
ప్రస్తుతం హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు జీవీ ప్రకాష్ కుమార్, కింగ్‌స్టన్ తర్వాత హీరోగా 13, ఇది ముజక్కామ్ సినిమాలు చేస్తున్నాడు జీవీ ప్రకాష్ కుమార్. దాన వీర శూరన్2తో పాటు తెలుగులో రాబిన్ హుడ్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తోన్నాడు.
సంబంధిత కథనం