OTT Horror: ఓటీటీలోకి ఆలస్యంగా వచ్చేసిన 20 కోట్ల హారర్ థ్రిల్లర్.. ఇండియాలోనే తొలి సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్!-kingston movie ott streaming on zee5 indian first sea adventure horror thriller kingston ott release today afternoon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror: ఓటీటీలోకి ఆలస్యంగా వచ్చేసిన 20 కోట్ల హారర్ థ్రిల్లర్.. ఇండియాలోనే తొలి సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్!

OTT Horror: ఓటీటీలోకి ఆలస్యంగా వచ్చేసిన 20 కోట్ల హారర్ థ్రిల్లర్.. ఇండియాలోనే తొలి సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్!

Sanjiv Kumar HT Telugu

Kingston Movie OTT Streaming Lately: ఓటీటీలోకి రూ. 20 కోట్ల బడ్జెట్ హారర్ థ్రిల్లర్ మూవీ కింగ్‌స్టన్ కాస్తా ఆలస్యంగా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇండియాలోనే తొలి సీ అడ్వెంచర్ హారక్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కింగ్‌స్టన్ తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది. కింగ్‌స్టన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఆలస్యంగా వచ్చేసిన 20 కోట్ల హారర్ థ్రిల్లర్.. ఇండియాలోనే తొలి సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్!

Kingston Movie OTT Release Lately: తమిళంలో సంగీత దర్శకుడుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు జీవి ప్రకాష్ కుమార్. అటు మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఇటు హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే హీరోగా, సంగీత దర్శకుడుగా జీవీ ప్రకాష్ కుమార్ చేసిన సినిమా కింగ్‌స్టన్.

రెండోసారి జోడీగా దివ్య భారతి

ఇండియాలోనే మొట్ట మొదటి సీ అడ్వెంచర్ హారర్ ఫాంటసీ మూవీగా కింగ్‌స్టన్ తెరకెక్కింది. ఈ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్‌కు జోడీగా హీరోయిన్ దివ్య భారతి నటించింది. జీవీ ప్రకాష్ కుమార్, దివ్య భారతి కలిసి నటించిన రెండో సినిమా ఇది. కింగ్‌స్టన్ మూవీకి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించారు.

తెలుగు, తమిళంలో రిలీజ్

ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన కింగ్‌స్టన్ నిర్మాతల్లో హీరో జీవి ప్రకాష్ కుమార్ కూడా ఉండటం విశేషం. ఇక కింగ్‌స్టన్ మూవీ మార్చి 7న థియేటర్లలో తెలుగు, తమిళం భాషల్లో విడుదలైంది. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి కింగ్‌స్టన్ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు.

20 కోట్ల బడ్జెట్‌తో

సుమారుగా రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కింగ్‌స్టన్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి 10కి 4.4 రేటింగ్ తెచ్చుకుని ఫ్లాప్ రికార్డ్ సాధించుకుంది. కానీ, ఈ కింగ్‌‌స్టన్ సినిమాను 89 శాతం వరకు గూగుల్ యూజర్స్ లైక్ చేసినట్లు గూగుల్ చెబుతోంది.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

హారర్, ఎమోషన్, లవ్, అడ్వెంచర్, జాంబీ, యాక్షన్ వంటి అంశాలతో కింగ్‌స్టన్ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే, ఏప్రిల్ 13న కింగ్‌స్టన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు జీ5 ప్లాట్‌ఫామ్ ఇదివరకు తెలిపింది. కానీ, మధ్యాహ్నం వరకు సినిమాను డిజిటల్ ప్రీమియర్ చేయలేదు. దాంతో కాస్తా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆడియెన్స్ కాస్తా నిరాశచెందారు.

అక్కడ అలా.. ఇక్కడ ఎలా?

హాఫ్ డే ఆలస్యంగా ఏప్రిల్ 13న మధ్యాహ్నం 12 గంటలకు జీ5లో కింగ్‌స్టన్ ఓటీటీ రిలీజ్ అయింది. అది కూడా తెలుగు, తమిళ భాషల్లో కింగ్‌స్టన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఫెయిల్యూర్‌గా నిలిచిన కింగ్‌స్టన్ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

కింగ్‌స్టన్ కథలోకి వెళితే..

ఇక కింగ్‌స్టన్ మూవీ కథలోకి వెళ్తే.. ఒక సముద్రాన్ని ఆనుకుని ఒక గ్రామం ఉంటుంది. అక్కడి గ్రామస్థులు బతకాలంటే ఆ సముద్రం మీదకే పనికి వెళ్లాలి. కానీ, డబ్బు మీద ఒకరి అత్యాశ కారణంగా ఆ గ్రామానికి ఓ శాపం తగులుతుంది. దాంతో వారు అక్కడే తప్పా ఇంకెక్కడికి వెళ్లలేకపోతారు. అయితే, ఊరి కోసం హీరో మాత్రం రిస్క్ చేసి సముద్రాన్ని దాటాలనుకుంటాడు.

కింగ్‌స్టన్ ఓటీటీ రిలీజ్

ఈ క్రమంలో హీరోకు ఎదురైన సవాళ్లు ఏంటీ? సముద్రంలో నుంచి బయటకొచ్చిన జాంబీలు ఎవరు? అసలు తన ఊరును నాశనం చేసిన అత్యాశ ఏంటీ? శాపం ఏంటీ? అనే ఆసక్తికర విశేషాలు తెలియాలంటే జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న కింగ్‌స్టన్ మూవీని చూడాల్సిందే.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం