Kingdom Teaser: ఎన్టీఆర్ వాయిస్, విజయ్ యాక్షన్, అనిరుధ్ బీజీఎం.. అదిరిపోయిన కింగ్‌డమ్ టీజర్.. మరో లెవెల్ అంతే..
Kingdom Teaser: విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న మూవీకి కింగ్‌డమ్ అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీ నుంచి బుధవారం (ఫిబ్రవరి 12) అదిరిపోయే టీజర్ వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్, విజయ్ యాక్షన్, అనిరుధ్ అదిరిపోయే బీజీఎంతో ఈ టీజర్ మరో లెవెల్లో ఉంది.

Kingdom Teaser: గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీకి కింగ్‌డమ్ అనే టైటిల్ పెట్టారు. టైటిలే అదిరిపోయిందనుకుంటే.. మూవీ టీమ్ రిలీజ్ చేసిన సుమారు రెండు నిమిషాల టీజర్ మరో లెవెల్లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, అనిరుధ్ రవిచందర్ బీజీఎం ఈ టీజర్ కు మరింత ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమా ఈ ఏడాది మే 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
అదిరిపోయిన కింగ్‌డమ్ టీజర్
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో కింగ్‌డమ్ మూవీ వస్తోంది. ఈ సినిమా టీజర్ బుధవారం (ఫిబ్రవరి 12) రిలీజ్ కాగా.. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ఇక అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ఈ టీజర్లో అతని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంకో లెవెల్లో ఉంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, స్టంట్స్, యాక్షన్ కూడా ఆకట్టుకుంటున్నాయి. అయితే గంభీరమైన ఎన్టీఆర్ వాయిస్ మాత్రం ఈ టీజర్ కు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పక తప్పదు.
“అలసట లేని ఈ భీకర యుద్ధం.. అలలుగా పారే ఏరుల రక్తం.. వలసపోయినా అలసిపోయినా.. ఆగిపోనిది ఈ మహారణం.. నేలపైన దండయాత్రలు.. మట్టి కింద మృతదేహాలు.. ఈ అలజడి ఎవరి కోసం.. ఇంత బీభత్సం ఎవరి కోసం.. అసలీ వినాశనం ఎవరి కోసం.. రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం.. కాలచక్రాన్ని బద్ధలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం..” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.
ఇక చివర్లో విజయ్ దేవరకొండ ఒకే ఒక్క డైలాగు చెప్పినా ఆకట్టుకున్నాడు. “ఏమైనా జేస్త సర్.. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా” అంటూ తనదైన స్టైల్లో అతడు కొట్టే డైలాగుతో ఈ టీజర్ ముగుస్తుంది. కింగ్‌డమ్ మూవీ మే 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
కింగ్‌డమ్ మూవీ గురించి..
విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో జెర్సీ, మ్యాజిక్ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన గౌతమ్.. ఈసారి పూర్తి భిన్నంగా స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఈ కింగ్‌డమ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
అయితే తాజాగా వచ్చిన టీజర్ తో ఈ మూవీపై అంచనాలు మరో రేంజ్ కు వెళ్లాయని చెప్పొచ్చు. మూవీ టైటిల్, టీజర్, రిలీజ్ డేట్ ను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మేకర్స్ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.