కింగ్‍డమ్ సినిమా మరోసారి వాయిదా? కొత్త డేట్ ఇదేనా!-kingdom movie may postpone again new release date of vijay deverkonda action movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కింగ్‍డమ్ సినిమా మరోసారి వాయిదా? కొత్త డేట్ ఇదేనా!

కింగ్‍డమ్ సినిమా మరోసారి వాయిదా? కొత్త డేట్ ఇదేనా!

కింగ్‍డమ్ చిత్రం మరోసారి వాయిదా పడనుందని తెలుస్తోంది. మరింత ఆలస్యం కానుందనే రూమర్లు వస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా.. మరోసారి పోస్ట్‌పోన్ అవనుందని తెలుస్తోంది.

కింగ్‍డమ్ సినిమా మరోసారి వాయిదా? కొత్త డేట్ ఇదేనా!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్‍డమ్ చిత్రం ఆలస్యమవుతూనే ఉంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా.. ఇప్పుడు మరోసారి అదే బాట పట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ స్పై యాక్షన్ మూవీని జూలై 4న విడుదల చేస్తామని గత నెలలోనే కొత్త తేదీని మూవీ టీమ్ ఖరారు చేసింది. అయితే, ఆ డేట్‍కు కూడా ఈ చిత్రం విడుదల కాదని తాజాగా సమాచారం చక్కర్లు కొడుతోంది. మరో డేట్ ఏదో కూడా బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇవే..

మళ్లీ వాయిదా.. కొత్త తేదీ!

కింగ్‍డమ్ చిత్రం జూలై 4వ తేదీ నుంచి వాయిదా పడడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు మూవీ ఆ డేట్‍ను ఖరారు చేసుకోవడంతో ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది. కింగ్‍డమ్ సినిమా విడుదలను జూలై 25వ తేదీకి వాయిదా వేయాలని మూవీ టీమ్ డిసైడ్ అయినట్టు టాక్ వస్తోంది. ఈ డేట్‍పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కారణం ఇవేనా!

ఈసారి కింగ్‍డమ్ సినిమా వాయిదాకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కారణమనే రూమర్లు వస్తున్నాయి. ఈ మూవీకి మ్యూజిక్ పనులు చాలా ఇంకా పెండింగ్‍లో ఉన్నాయని తెలుస్తోంది. రీరికార్డింగ్ ఇంకా ఆలస్యమవుతుందని టాక్. దీంతోనే కింగ్‍డమ్ మూవీని జూలై 25కు వాయిదా వేయాలని టీమ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, కొన్ని సీన్లను కూడా రీషూట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా రూమర్లు ఉన్నాయి. మొత్తంగా కింగ్‍డమ్ జూలై 4 నుంచి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నట్టు బజ్ నడుస్తోంది. మూవీ టీమ్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

కింగ్‍డమ్ సినిమాను ముందుగా ఈ ఏడాది మార్చి 28న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత మే 30వ తేదీకి డేట్ మారింది. మళ్లీ జూలై 4వ తేదీకి వాయిదా పడింది. ఇప్పుడు మరింత ఆలస్యమై జూలై 25వ తేదీకి రిలీజ్ పోస్ట్‌పోన్ అవుతుందని రూమర్లు వస్తున్నాయి. ఇలా ఈ చిత్రం ఆలస్యమవుతూనే ఉంది.

రూ.100కోట్లకు పైగా బడ్జెట్‍తో..

కింగ్‍డమ్ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. పవర్‌ఫుల్ స్పై యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. ఈ మూవీతో విజయ్ దేవరకొండ మళ్లీ సక్సెస్ బాటపడతారని అభిమానులు ఆశ పెట్టుకున్నారు. కానీ విడుదల మాత్రం ఆలస్యమవుతోంది.

కింగ్‍డమ్ సినిమా రూ.100కోట్లకు పైగా బడ్జెట్‍తో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తున్నారు. హీరో సత్యదేవ్ కూడా ఓ కీలకపాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం