విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ ఘాటు కిస్.. కింగ్డమ్ నుంచి ఫస్ట్ సింగిల్ హృదయం లోపల వచ్చేస్తోంది.. డేట్ ఇదే-kingdom first single hridayam lopala to release on 2nd may vijay deverakonda bhagyashri borse lip lock ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ ఘాటు కిస్.. కింగ్డమ్ నుంచి ఫస్ట్ సింగిల్ హృదయం లోపల వచ్చేస్తోంది.. డేట్ ఇదే

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ ఘాటు కిస్.. కింగ్డమ్ నుంచి ఫస్ట్ సింగిల్ హృదయం లోపల వచ్చేస్తోంది.. డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే మధ్య ఓ ఘాటు లిప్ లాక్ సీన్ తో కింగ్డమ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది. హృదయం లోపల అనే ఈ పాట రిలీజ్ గురించి విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ ఘాటు కిస్.. కింగ్డమ్ నుంచి ఫస్ట్ సింగిల్ హృదయం లోపల వచ్చేస్తోంది.. డేట్ ఇదే

విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ కింగ్డమ్ (Kingdom). గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే ఫిమేల్ లీడ్ గా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ వాయిస్ తో వచ్చిన టీజర్ వీడియో ఎంతగానో ఆకట్టుకోగా.. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ వస్తోంది.

కింగ్డమ్ ఫస్ట్ సింగిల్ హృదయం లోపల..

కింగ్డమ్ మూవీ నుంచి వస్తున్న ఫస్ట్ సింగిల్ హృదయం లోపల. ఈ సాంగ్ శుక్రవారం (మే 2) రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.

“నమ్మకద్రోహం నీడల్లో, ఓ బంధం నటిస్తుండగా.. ఉద్రిక్తమైన ఆకర్షణ ఉంది. కింగ్డమ్ ప్రపంచం నుంచి అనిరుధ్ సాంగ్.. మళ్లీ మళ్లీ మీరు వినాలనుకునే పాటగా ఇది మిగిలిపోతుంది.. హృదయం లోపల” అనే క్యాప్షన్ తో విజయ్ ఈ విషయాన్ని చెప్పాడు.

ఈ సాంగ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశాడు. ఇది విజయ్, భాగ్యశ్రీ బోర్సే మధ్య ఓ ఘాటు ముద్దు సీన్ తో మొదలవుతుంది. ఓ బీచ్ లో కూర్చొని వీళ్లు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఈ పాటను అనిరుధ్ కంపోజ్ చేశాడు. మే 30న కింగ్డమ్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

అదిరిపోయిన టీజర్

కింగ్డమ్ మూవీ టైటిల్ రివీల్ చేయడంతోపాటు టీజర్ ను కూడా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, అనిరుధ్ రవిచందర్ బీజీఎం, విజయ్ యాక్షన్ ఈ టీజర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లింది.

“అలసట లేని ఈ భీకర యుద్ధం.. అలలుగా పారే ఏరుల రక్తం.. వలసపోయినా అలసిపోయినా.. ఆగిపోనిది ఈ మహారణం.. నేలపైన దండయాత్రలు.. మట్టి కింద మృతదేహాలు.. ఈ అలజడి ఎవరి కోసం.. ఇంత బీభత్సం ఎవరి కోసం.. అసలీ వినాశనం ఎవరి కోసం.. రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం.. కాలచక్రాన్ని బద్ధలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం..” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పించాయి.

విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో జెర్సీ, మ్యాజిక్ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన గౌతమ్.. ఈసారి పూర్తి భిన్నంగా స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఈ కింగ్‌డమ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం