రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్‍డమ్ సినిమాపై క్రేజ్ ఓ రేంజ్‍లో ఉంది. విజయ్‍కు వరుసగా కొన్ని ప్లాఫ్‍లు వచ్చినా ఈ మూవీపై మాత్రం అంచనాలుగా భారీగా ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ కింగ్‍డమ్ మే 30వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కింగ్‍డమ్ గురించి అనిరుధ్ మాట్లాడారు.
తన నెక్స్ట్ సినిమాల గురించి చెప్పాలని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిరుధ్‍కు ప్రశ్న ఎదురైంది. కింగ్‍డమ్‍తో పాటు రజినీకాంత్ ‘కూలీ’ సినిమాల గురించి అనిరుధ్ చెప్పారు. కింగ్‍డమ్ సినిమా చివరి 40 నిమిషాలు చూశానని, చాలా బాగుందని చెప్పారు.
కింగ్‍డమ్, కూలీ సినిమాలకు తన ఫైర్ ఎమోజీల కోసం వెయిచ్ చేయవద్దని, రెండూ బాగున్నాయని అన్నారు. “ముందు విజయ్ దేవకొండ సినిమా కింగ్‍డమ్ వస్తుంది. ఆ తర్వాత కూలీ ఉంటుంది. నేను చూసినంత వరకు రెండు సినిమాలు చాలా బాగున్నాయి. ఫైర్ ఎమోజీలు అవసరం లేదు.. ఇప్పుడే చెప్పేస్తున్నా. విజయ దేవరకొండ చిత్రాన్ని అరగంట, 40 నిమిషాలు చూశా. చాలా బాగుంది” అని అనిరుధ్ చెప్పారు.
రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాను తాను పూర్తిగా చూశానని అనిరుధ్ చెప్పారు. చాలా సూపర్‌గా ఉందన్నారు. కొత్త షేడ్స్ ఉంటాయని చెప్పారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలి మూవీ ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.
కింగ్‍డమ్ సినిమా నుంచి ఫస్ట్ పాట రీసెంట్‍గా వచ్చింది. ఈ పాటకు మంచి మెలోడీ ట్యూన్ ఇచ్చారు అనిరుధ్. ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య రొమాంటిక్ సాంగ్‍గా ఈ ‘హృదయం లోపల’ పాట ఉంది. ఈ పాటను అనిరుధ్, అనుమిత నదేషన్ పాడగా.. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు.
కింగ్‍డమ్ సినిమాను హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు. మే 30న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ టీజర్ కూడా బాగా హైప్ పెంచింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయిసౌజన్య ప్రొడ్యూజ్ చేస్తున్నారు.
సంబంధిత కథనం