King of Kotha OTT Release: దుల్కల్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీ ఓటీటీలోకి ఆరోజే రానుందా!
King of Kotha OTT Release: ‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అంచనాలు వెలువడుతున్నాయి.
King of Kotha OTT Release: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. పాన్ ఇండియా రేంజ్‍లో గ్యాంగ్‍స్టర్ యాక్షన్ డ్రామా ఈ చిత్రం వచ్చింది. ఆగస్టు 24న మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో థియేటర్లలో రిలీజైన కింగ్ ఆఫ్ కొత్తకు మిశ్రమ స్పందన వచ్చింది. యాక్షన్ సీన్లు, దుల్కర్ పర్ఫార్మెన్స్ లాంటివి బాగున్నా ఓవరాల్‍గా చిత్రం ఎక్కువ మంది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమా ఆశించిన రేంజ్‍లో ఆడలేదు. కాగా, ఇప్పుడు ‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

కింగ్ ఆఫ్ కొత్త మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీప్లస్ హాట్‍స్టార్ దక్కించుకుంది. సెప్టెంబర్ 22వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో కింగ్ ఆఫ్ కొత్త సినిమా స్ట్రీమింగ్‍కు వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కింగ్ ఆఫ్ కొత్త చిత్రానికి అభిలాష్ జోష్లీ దర్శకత్వం వహించారు. గ్యాంగ్‍స్టర్స్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ ఉంది. ట్రైలర్‌తో మంచి హైప్ తెచ్చుకున్నా.. ఆ స్థాయిలో సినిమా కలెక్షన్లను సాధించలేకపోయింది. వేఫారెర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై జీస్టూడియోస్ భాగస్వామ్యంతో ఈ సినిమాను హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించారు. సుమారు రూ.50కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
కింగ్ ఆఫ్ కొత్త చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‍గా చేశారు. గోకుల్ సురేశ్, షబ్బీర్ కల్లరక్కల్, ప్రసన్న, షమ్మి తిలకన్, చెంబన్ వినోద్ జోస్, నైలా ఉషా కీలకపాత్రల్లో నటించారు. ఓ స్పెషల్ సాంగ్‍కు రితికా సింగ్ చిందేశారు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వచ్చింది.
ఈ సినిమాలో గ్యాంగస్టర్ రాజు పాత్రలో దుల్కర్ నటన ఆకట్టుకుంది. మాస్ హీరోగానూ అతడి లుక్, యాక్టింగ్ అదిరిపోయాయి. యాక్షన్‍తో పాటు లవ్ స్టోరీ, ఎమోషనల్ డ్రామా, ఫ్రెండ్‍షిప్ అంశాలు కింగ్ ఆఫ్ కొత్త సినిమాలో ఉన్నాయి.