యాక్ష‌న్ రోల్‌లో అద‌ర‌గొట్టిన గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి - కిల్ల‌ర్ మూవీ గ్లింప్స్ రిలీజ్-killer movie glimpse review and talk jyothi rai action sequence and vfx highlight guppedantha manasu jagathi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  యాక్ష‌న్ రోల్‌లో అద‌ర‌గొట్టిన గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి - కిల్ల‌ర్ మూవీ గ్లింప్స్ రిలీజ్

యాక్ష‌న్ రోల్‌లో అద‌ర‌గొట్టిన గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి - కిల్ల‌ర్ మూవీ గ్లింప్స్ రిలీజ్

Nelki Naresh HT Telugu

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఫేమ్ జ్యోతిరాయ్ హీరోయిన్‌గా న‌టించిన కిల్ల‌ర్ మూవీ గ్లింప్స్ గురువారం రిలీజైంది. ఈ గ్లింప్స్‌లో మోడ్ర‌న్ యువ‌తిగా, రోబోగా రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో జ్యోతిరాయ్ క‌నిపించింది. జ్యోతిరాయ్‌పై తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి

కిల్లర్ మూవీ గ్లింప్స్

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఫేమ్ జ్యోతి రాయ్‌ కిల్ల‌ర్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి పూర్వ‌జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ మూవీలో హీరోగా న‌టిస్తోన్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను మేక‌ర్స్ తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో బుధ‌వారం రిలీజ్ చేశారు.

డీ బౌండ్ జిజార్డ‌ర్‌...

మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో..ఇలాంటి ఎలిమెంట్స్ తో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కిల్ల‌ర్ మూవీ గ్లింప్స్ ఎలా ఉందో చూస్తే - ప్రాచీన వైమానిక శాస్త్రంలో ఆశ్చర్యపరిచే మానవ మేథస్సు రహస్యాలు వెల్లడించారు.

ఆత్మ కలిగిన యంత్రాలు చూస్తారంటూ వైమానిక శాస్త్రంలో చెప్పిందే నిజం కాబోతోందా అనే డైలాగ్‌తో ఈ గ్లింప్స్ ప్రారంభమైంది. డి బౌండ్ అనే డిజార్డర్ తో బాధపడుతున్న హీరోయిన్ రాయ్, పూర్తిగా కోలుకుంటే పునర్జన్మ ఎత్తినట్లే అని, అప్పుడు ఆమెకు ఎదురు నిలవడం ఎవరి వల్లా కాదనే డైలాగ్స్ ఆస‌క్తిని పంచుతోన్నాయి.

రోబోగా...మోడ్ర‌న్ మ‌హిళ‌గా...

సూపర్ షీ క్యారెక్టర్ లో జ్యోతి రాయ్‌ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలుస్తోన్నాయి. ఈ గ్లింప్స్‌లో మోడ్ర‌న్ మ‌హిళ‌గా, సూప‌ర్ ప‌వ‌ర్ రోబోగా రెండు డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌లో జ్యోతి పూర్వ‌జ్ క‌నిపించింది. లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న‌ట్లు గ్లింప్స్ తో తెలుస్తోంది. మొదలెడదామా అంటూ గ్లింప్స్ చివరలో హీరో, డైరెక్టర్ పూర్వాజ్ క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది. వీఎఫ్ఎక్స్ గ్లింప్స్ కు ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ప్రొడ్యూస‌ర్‌గా...

కిల్ల‌ర్ మూవీలో జ్యోతిరాయ్‌, పూర్వ‌జ్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న కిల్ల‌ర్ మూవీలో విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.గ‌తంలో పూర్వ‌జ్ శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హీరోగా, డైరెక్ట‌ర్‌గానే కాకుండా ఈ సినిమాకు పూర్వాజ్ ఓ ప్రొడ్యూస‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ల‌తో క‌లిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

కిల్ల‌ర్ మూవీ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ది. త్వ‌ర‌లోనే ఈ సైన్స్ ఫిక్ష‌న్ మూవీని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు స‌న్నాహాలు చేస్తోన్నారు. ఈ సినిమాకు ఆశీర్వాద్ , సుమన్ జీవ మ్యూజిక్ అందిస్తోన్నారు.

జ్యోతి పూర్వ‌జ్‌గా...

పూర్వ‌జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏ మాస్ట‌ర్ పీస్ మూవీలో జ్యోతిరాయ్ ఓ కీల‌క పాత్ర పోషించింది. ఈ మూవీ షూటింగ్‌లోనే పూర్వ‌జ్‌తో ప్రేమ‌లో ప‌డ్డ జ్యోతిరాయ్ అత‌డిని పెళ్లి చేసుకున్న‌ది. పెళ్లి త‌ర్వాత త‌న పేరును జ్యోతి పూర్వ‌జ్‌గా మార్చుకుంది.

గుప్పెడంత మ‌న‌సు...

సీరియ‌ల్స్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది జ్యోతిరాయ్‌. గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఆమెకు తెలుగులో మంచి పేరు తె చ్చిపెట్టింది. ఈ సీరియ‌ల్‌లో జ‌గ‌తి పాత్ర‌లో జ్యోతిరాయ్ క‌నిపించింది. గుప్పెడంత మ‌న‌సు కంటే ముందు తెలుగులో క‌న్యాదానం సీరియ‌ల్ చేసింది. క‌న్న‌డంలో ప‌దిహేనుకుపైగా సీరియ‌ల్స్‌లో న‌టించింది. క‌న్న‌డంలో దియా, స‌ప్ల‌య‌ర్ శంక‌ర‌, జెర్సీ నంబ‌ర్ 10తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది. ప్ర‌స్తుతం హిందీలో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది జ్యోతిరాయ్‌.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం